మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

Written By:

ప్రపంచానికి ఇప్పుడు పట్టుకున్న ఒకే ఒక జ్వరం పోకెమాన్..ఈ గేమ్ దెబ్బకి కొంపలు కొల్లేరవుతున్నాయి. అలాగే ప్రాణాలు పైపైకే పోతున్నాయి. ఇప్పటికే కొంతమంది ప్రాణాలు వదిలేశారు కూడా. చాలా దేశాల్లో ఈ గేమ్ ఆడేసమయంలో జాగ్రత్తగా ఉండాలని బయట ఎక్కడా ఆడొద్దని నిషేధాజ్ఙలు విధించారు. అయితే ఎన్ని నిషేధాలు విధించినప్పటికీ ఈ ఆటను మాత్రం వదలడం లేదు.. ఓ మహిళ ఈ గేమ్ ఆడుతూ ఏకంగా ఓ పెద్ద చెట్టే ఎక్కేసింది. దిగడానికి పడ్డ అవస్థలు మీరే చూడండి.

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ చాలా ప్రమాదకరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

ఇటీవల ట్రెండ్ గా మారిన 'పోకెమాన్' మొబైల్ గేమ్ ఆడుతూ ప్రమాదాల బారిన పడ్డవారు, ఇరకాటంలో పడ్డవారు, దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న ఒక వ్యక్తి, పోలీస్ కారు కింద పడ్డ మరో వ్యక్తి సంఘటనలు తెలిసినవే.

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో 'పోకెమాన్' ఆడుతున్న ఒక మహిళ .. ఆట క్రమంలో క్లార్క్స్ బోరోలోని ఒక శ్మశానంలోకి వెళ్లింది. అక్కడున్న ఒక చెట్టుపై పోకెమాన్ ఉన్నట్లు తెలియడంతో ఆ చెట్టెక్కేసింది.

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

అక్కడ వరకు బాగానే ఉంది, ఆ తర్వాతే ఆమెకు ఇబ్బంది వచ్చి పడింది. చెట్టు దిగడం ఆమె వల్ల కాలేదు. చివరికి చేసేదేమీలేక అత్యవసర నంబర్ కు ఫోన్ చేసింది.

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

తూర్పు గ్రీన్ విచ్ టౌన్ షిప్ ఫైర్, రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని నిచ్చెన వేయడంతో ఆమెకు కిందకు దిగింది. ఈ విషయాన్ని ఫైర్ డిపార్ట్ మెంట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం ఈ విషయం వెలుగు చూసింది.

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

ఈ పోస్ట్ ద్వారా 'పోకెమాన్' ఆడేవాళ్లను సదరు అధికారులు హెచ్చరించారు. ఆట ఆడేటప్పుడు ఎటు వెళ్తున్నామో, ఏం చేస్తున్నామనే విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

ఇక పోకెమాన్ గేమ్పై సౌదీ అరేబియా ముస్లిం మతపెద్దలు ఫత్వా జారీచేశారు. ఇస్లాంకు ఈ గేమ్ పూర్తి వ్యతిరేకమని ఫత్వాలో పేర్కొన్నారు.ఇస్లాంకు ఈ గేమ్ పూర్తి వ్యతిరేకమని ఫత్వాలో పేర్కొన్నారు

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

చెన్నైలో ఇటీవల ఈ గేమ్ ట్రాఫిక్ జాంకు కారణమైంది. యువతీయువకులు మొత్తం ఈ ఆటపైనే దృష్టికేంద్రీకరిస్తుండడంతో ఇటీవల ఈ ఆట సంచలనాలకు కారణమైంది.

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

ఇండోనేషియా ఈ గేమ్ను నిషేధించింది. విధినిర్వహణలో ఉన్న పోలీసులు, సైనికులు ఈ ఆట ఆడకూడదంటూ నిషేధం విధించింది.

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

చికిములా లో జెర్సన్ లో ఇద్దరూ ఈ గేమ్ ఆడుతూ ముందుకు వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు ఆస్పత్రిలో ఉన్నారు. పోకెమాన్ గో గేమ్ కారణంగా జరిగిన మొదటి క్రైమ్ ప్రపంచంలో ఇదేనని పోలీసులు తెలిపారు.

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

ఇక తన ఫోన్‌లో గేమ్ అడుకుంటూ వెళ్లి ఓ వ్యక్తి పెద్ద చెరువులో పడ్డాడు. తన ఫోన్ లోని పోక్ మన్‌ను తరుముతూ తాను ఎటువైపు నడుస్తున్నాడనే విషయం కూడా మర్చిపోయి నీళ్లలో పడ్డాడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Pokemon Go: US firefighters rescue woman who climbed tree in cemetery while playing game
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot