పెంపుడు కుక్కతో సెల్ఫీ ఇక చాలా ఈజీ

Written By:

మన ఇంట్లో పెంచుకుంటున్న బుజ్జి పప్పీతో సెల్ఫీ దిగాలంటే చాలా కష్టమైన పని ఎందుకంటే అది ఒక చోట కుదురుగా ఉండదు. ఇక దాన్ని పట్టుకుని సెల్ఫీ దిగాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. ఒకవేళ దాన్ని గట్టిగా పట్టుకుని ఫోటో దిగినా అది అంత అందంగా కూడా రాకపోవచ్చు. సో ఆ పప్పీతో మీరు ఫోటో దిగాలనుకున్నా కాని..లేకుంటే అది అందంగా రావాలనుకున్నా గాని మార్కెట్లోకి ఉత్పత్తి వచ్చేసింది. ఇంతకీ ఆ ఉత్పత్తి ఏంటనేగా మీ డౌటు..అయితే అదేంటో ఎలా పని చేస్తుందో కింద స్లైడర్ లో చూసేయండి.

Read more: ప్రేయసిని చంపాడు, సెల్ఫీతో బొక్కలో పడ్డాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పెంపుడు కుక్కతో సెల్ఫీ

మీ పెంపుడు కుక్కతో సెల్ఫీ తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారా..?వాటిని అధిగమించేందుకు కాలిఫోర్నియాకు చెందిన జీవన్ హెర్నాండేజ్ ఓ పరిష్కారాన్ని కనిపెట్టాడు.

స్మార్ట్ ఫోన్ కు టెన్నిస్ బాల్ ను అతికించడం ద్వారా..

స్మార్ట్ ఫోన్ కు టెన్నిస్ బాల్ ను అతికించడం ద్వారా మీ పెంపుడు కుక్కలతో సెల్ఫీలు తీసుకోవడం సులువవుతుందని వెల్లడించారు.

ఏడాది పాటు శ్రమించి ఈ టెక్నిక్ ను కనిపెట్టాడు

పెంపుడు కుక్కతో తన భార్య సెల్ఫీ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసిన పెర్నాండేజ్ ఎలాగైనా ఈ సమస్యను అధిగమించాలని ఏడాది పాటు శ్రమించి ఈ టెక్నిక్ ను కనిపెట్టాడు.

కుక్క ఏకాగ్రత అంతా టెన్నిస్ బాల్ పైనే

ఈ విధానంలో సెల్ఫీ తీసుకునేటప్పుడు కుక్క ఏకాగ్రత అంతా టెన్నిస్ బాల్ పైనే ఉంటుంది.కాబట్టి అది కదలకుండా కెమెరా వంకే చూస్తుంది.

సెల్ఫీ బాల్ నుంచి శబ్దాలు

అంతేకాదు ఈ పోచ్ సెల్ఫీ బాల్ నుంచి శబ్దాలు కూడా వస్తాయి.అవి కుక్క ఏకాగ్రతను రెట్టింపు చేస్తాయి.

ఈ పోచ్ బాల్ ను అన్ని స్మార్ట్ ఫోన్లకు సరిపోయేలా అభివృద్ధి

దీంతో నిస్సందేహంగా ఫోటోలు తీసుకోవచ్చని అంటున్నాడు. ఈ పోచ్ బాల్ ను అన్ని స్మార్ట్ ఫోన్లకు సరిపోయేలా అభివృద్ధి చేస్తున్నాడు.

దీనికి అవసరమైన ప్రత్యేకనిధిని

కిక్ స్టార్టర్ అనే కంపెనీ దీనికి అవసరమైన ప్రత్యేకనిధిని సమకూర్చుకునేందుకు విరాళాల సేకరణ చేపట్టింది.

దీని లక్ష్యం 7 వేల డాలర్లు

దీని లక్ష్యం 7 వేల డాలర్లు కాగా 14 వేల డాలర్లకు పైగా విరాళాలు వసూలు కావడం గమనార్హం.

మీ బుజ్జి పప్పీతో ఫోటోలు

సో మీరు కూడా ఈ బాల్ ను కొనేసి మీ బుజ్జి పప్పీతో ఫోటోలు దిగేసేయండి. మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Pooch selfie: Use this latest gadget for a perfect selfie with your pet
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot