అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం PUBG మొబైల్ ప్రత్యేకమైన ఇన్-గేమ్ రివార్డులు

|

అమెజాన్ ప్రైమ్ చందాదారులు ఇప్పుడు PUBG మొబైల్‌ గేమ్ ప్రారంభించిన ఇన్-గేమ్ రివార్డులను ఉచితంగా పొందగలుగుతారు. సెప్టెంబర్ 20 న చేసిన ప్రకటనలో అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఉచితంగా మొబైల్ గేమ్ కంటెంట్‌ను పొందగలదని PUBG ప్రకటించింది. సంస్థ ఇప్పటికే ట్విచ్ ప్రైమ్ ప్రయోజనాలను అందించింది. ఇది పిసి మరియు కన్సోల్ గేమర్‌లకు అందుబాటులో ఉంది.

PUBG
 

PUBG మొబైల్‌లో ప్రారంభించిన ఇన్-గేమ్ ఐటెమ్‌లలో ప్రత్యేకమైన ఇన్‌ఫిల్ట్రేటర్ మాస్క్, ఇన్‌ఫిల్ట్రేటర్ జాకెట్, ఇన్‌ఫిల్ట్రేటర్ ప్యాంట్స్ మరియు ఇన్‌ఫిల్ట్రేటర్ షూస్‌తో పాటు సరికొత్త బ్లడ్ ఓత్ - కార్ 98 K మరియు బ్లాక్ మాగ్మా పారాచూట్ ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ముందుకు సాగుతూ మరియు కొనసాగుతున్న ప్రాతిపదికన కొత్త మొబైల్ గేమింగ్ కంటెంట్‌ను విడుదల చేస్తున్నామని అమెజాన్ తెలిపింది. రాబోయే రోజుల్లో కంపెనీ EA, మూంటన్, నెట్‌మార్బుల్, వార్‌గేమింగ్ మొబైల్ వంటి ఇతరులతో పార్టనర్ షిప్ ను కలిగి ఉంటుంది అని అమెజాన్ తెలిపింది.

VP ఏతాన్ ఎవాన్స్

అధికారిక ప్రకటనలో ట్విచ్ ప్రైమ్ కోసం VP ఏతాన్ ఎవాన్స్ మాట్లాడుతూ "ఇప్పుడు మీరు ఏ ప్లాట్‌ఫామ్‌లో ఆడినా, కన్సోల్, పిసి లేదా మొబైల్ అయినా మీ కోసం ప్రైమ్ గేమ్ యొక్క ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ గేమ్ లలో ఒకటైన PUBG మొబైల్ కోసం ప్రత్యేకమైన కంటెంట్‌తో ప్రారంభిస్తున్నాము. రాబోయే నెలల్లో అందరికి చాలా ఇష్టమైన కళా ప్రక్రియలలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని మొబైల్ గేమ్ ల కోసం కొన్ని ప్రయోజనాలను అందిస్తున్నాము. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సభ్యులు PUBG మొబైల్ ప్లేయర్స్ కోసం ఇన్‌ఫిల్ట్రేటర్ మాస్క్‌ని మొదటగా ప్రస్తుతం క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం వారు PUBG మొబైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన iOS లేదా Android పరికరంలో అమెజాన్ ప్రైమ్ కోసం వెబ్‌పేజీని సందర్శించాలి.

ఆఫర్‌లో ఉన్న వస్తువుల జాబితా మరియు వాటిని క్లెయిమ్ చేసే తేదీలు
 

ఆఫర్‌లో ఉన్న వస్తువుల జాబితా మరియు వాటిని క్లెయిమ్ చేసే తేదీలు

1: 20 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 3 వరకు - ఇన్‌ఫిల్ట్రేటర్ మాస్క్

2: అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 17 వరకు - ఇన్‌ఫిల్ట్రేటర్ జాకెట్

3: అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 31 వరకు - ఇన్‌ఫిల్ట్రేటర్ షూస్

4: నవంబర్ 1 నుండి నవంబర్ 14 వరకు - ఇన్‌ఫిల్ట్రేటర్ ప్యాంటు

5: నవంబర్ 15 నుండి నవంబర్ 28 వరకు - ఎపిక్ లెవల్ గన్, బ్లడ్ ఓత్ - కార్ 98 కె

6: నవంబర్ 29 నుండి 12 డిసెంబర్ వరకు - ఎపిక్ లెవల్ బ్లాక్ మాగ్మా పారాచూట్

Most Read Articles
Best Mobiles in India

English summary
PUBG Mobile: Amazon Prime Subscribers get Game Rewards

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X