PUBG మొబైల్ లైట్ ఆడటానికి వీలుగా వున్న 8వేలలోపు స్మార్ట్‌ఫోన్‌లు

|

PUBG మొబైల్ యొక్క డెవలపర్లు ఇటీవల PUBG మొబైల్ లైట్ అనే PUBG గేమ్ యొక్క లైట్ వర్షన్‌ను విడుదల చేశారు. మునుపటి వర్షన్‌ వలె కాకుండా ఈ క్రొత్త గేమ్ స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్‌లో చాలా సులభంగా ఆడవచ్చు . టెన్సెంట్ ఆటలలోని డెవలపర్లు ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్ల కోసం ఈ క్రొత్త సంస్కరణను ప్రారంభించారు.

 
top smartphones under rs 8000 to play pubg mobile lite

రాజీపడకుండా గొప్ప గేమ్‌ప్లే అనుభవాన్ని అందించడానికి తక్కువ ర్యామ్‌తో గల తక్కువ-స్థాయి స్మార్ట్‌ఫోన్ డివైస్ ల కోసం ఇది ఆప్టిమైజ్ చేయబడింది.

PUBG మొబైల్ లైట్ వివరాలు:

PUBG మొబైల్ లైట్ వివరాలు:

అన్రియల్ ఇంజిన్ 4 తో నిర్మించబడిన PUBG మొబైల్ యొక్క లైట్ వెర్షన్ కింద జాబితా చేయబడి ఉన్న అన్ని పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. PUBG మొబైల్ లైట్ 60 మంది ఆటగాళ్లతో రూపొందించిన చిన్న మ్యాప్‌ను కలిగి ఉంది. ఇది 10 నిమిషాల పాటు కొనసాగే వేగవంతమైన ఆటల కోసం చేయబడింది. ఈ గేమ్ యొక్క స్టోరేజ్ సామర్థ్యం కేవలం 400MB మాత్రమే. ఈ గేమ్ 2GB RAM కంటే తక్కువ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల కోసం నిర్మించబడింది అని డెవలపర్‌లు తెలిపారు. భారతదేశంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారని గుర్తుంచుకొని దీనిని అభివృద్ధి చేశారు.

PUBG మొబైల్ లైట్ గేమ్ కు అనుకూలంగా వున్న 8,000 రూపాయల లోపు స్మార్ట్‌ఫోన్‌లు:
 

PUBG మొబైల్ లైట్ గేమ్ కు అనుకూలంగా వున్న 8,000 రూపాయల లోపు స్మార్ట్‌ఫోన్‌లు:

శామ్సంగ్ గెలాక్సీ M10(7,999):

శామ్సంగ్ గెలాక్సీ M10 స్మార్ట్‌ఫోన్‌ 6.20-అంగుళాల TFT డిస్‌ప్లే, హెచ్‌డి + రిజల్యూషన్ 1520 × 720 పిక్సెల్స్ 19: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఇది శామ్‌సంగ్ Exynos 7870 ఆక్టా-కోర్ CPU తో పాటు 2 GB ర్యామ్ మరియు 16 GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది.

ఇది ఎఫ్ / 1.9 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్ సపోర్టింగ్ మరియు ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండ ముందు వైపు హెచ్‌డిఆర్ సపోర్ట్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. కానీ ఇది ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తుంది. ఇది 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా శామ్‌సంగ్ OneUI స్కిన్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ముఖ్యాంశాలు వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్, డ్యూయల్ రియర్ కెమెరాలు మరియు హెచ్‌డి కంటెంట్ స్ట్రీమింగ్ కోసం వైడ్‌విన్L1.

 

రియల్‌మి 3i (7,999):

రియల్‌మి 3i (7,999):

రియల్‌మి 3i స్మార్ట్‌ఫోన్‌ 6.22-అంగుళాల HD + (1520 x 720 పిక్సెల్స్) డిస్ప్లేతో 19: 9 కారక నిష్పత్తితో వస్తుంది. మీరు ఈ రియల్‌మి ఫోన్‌తో డ్యూడ్రాప్ తరహా డిస్ప్లేను కూడా పొందుతారు. ఇది మీడియాటెక్ హెలియో P60 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. దీనికి ARM Mali-G72 GPU మద్దతు ఉంది. డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ గల రియల్‌మి 3i స్మార్ట్‌ఫోన్‌ 10W ఛార్జింగ్ టెక్‌ మద్దతుతో 4,230 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా పొందుతారు. ఈ సెటప్‌లో 13 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు ఉంటాయి. అలాగే ముందు వైపు సెల్ఫీలు తీయడానికి వీలుగా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ పై-ఆధారిత కలర్‌ OS6 తో స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

 

షియోమి రెడ్‌మి 7(7,999):

షియోమి రెడ్‌మి 7(7,999):

షియోమి రెడ్‌మి 7 యొక్క స్మార్ట్‌ఫోన్‌లో 6.26-అంగుళాల డిస్ప్లే HD + (1520 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ మరియు 19: 9 కారక నిష్పత్తితో వస్తుంది. దీని యొక్క స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడుతుంది. హ్యాండ్‌సెట్ డాట్-నాచ్ డిస్ప్లే డిజైన్‌ను కూడా అందిస్తుంది. ఇది సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది 14nm క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632 ఆక్టా-కోర్ SoC ద్వారా గరిష్టంగా 1.8GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. ఇది అడ్రినో 506 GPU తో జత చేయబడి వస్తుంది.

రెడ్‌మి 7 స్మార్ట్‌ఫోన్ 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి మెమొరీని విస్తరించడానికి షియోమి ఒక ఎంపికను కూడా ఇచ్చింది. కెమెరా విభాగం పరంగా స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో AI- ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరా సెటప్‌లో 12 మెగాపిక్సెల్ మొదటి సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్ ఉంటాయి. రెడ్‌మి 7 ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సారును కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే రెడ్‌మి హ్యాండ్‌సెట్ 4,000 ఎంఏహెచ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

హానర్ 9 లైట్(7,999) :

హానర్ 9 లైట్(7,999) :

8,000 రూపాయల జాబితాలోని పాత స్మార్ట్‌ఫోన్‌లలో హానర్ 9 లైట్ కూడా ఒకటి. ఇది 1080 × 2160 రిజల్యూషన్ మరియు 18: 9 కారక నిష్పత్తితో 5.65-అంగుళాల ఫుల్-HD +డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇది 2.36GHz వద్ద క్లాక్ చేసిన హైసిలికాన్ కిరిన్ 659 ఆక్టా-కోర్ SoC ని కలిగి ఉంది. హానర్ 9 లైట్ 32 జీబీ స్టోరేజ్‌ మరియు 3 జీబీ ర్యామ్‌ వేరియంట్ తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయంలో ఇది ఆండ్రాయిడ్ 8.0 ఓరియో OS ఆధారంగా EMUI 8.0తో రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ విభాగంలో హానర్ 9 లైట్ 13 మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ సెన్సార్లతో రెండు వైపులా డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో M1:

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో M1:

ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో M1 స్మార్ట్‌ఫోన్‌ 5.99-అంగుళాల LCD డిస్‌ప్లేతో 2160 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో మరియు 18: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 636 చిప్‌సెట్ ఉంది. ఈ ధర వద్ద ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ ను కలిగి ఉన్నాయి.

3 జిబి మరియు 4 జిబి ర్యామ్ వేరియంట్లలో వస్తున్న ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో M1 స్మార్ట్‌ఫోన్‌ ఆప్టిక్స్ పరంగా వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ మరియు 5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటాయి. అలాగే సెల్ఫీస్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా కూడా ఉన్నాయి. 6GB ర్యామ్ వేరియంట్‌లో 16 మెగాపిక్సెల్ మరియు 5 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా మాడ్యూల్ మరియు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అప్‌డేటెడ్ లభిస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో ఇది బ్లూటూత్, VoLTEతో 4G LTE, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్లు, వై-ఫై మరియు జిపిఎస్ వంటివి ఉన్నాయి.

 

Best Mobiles in India

English summary
top smartphones under rs 8000 to play pubg mobile lite

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X