ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అవుట్ !

Written By:

అవును మీరు విన్నది నిజమే ఇప్పుడు రష్యా దెబ్బకి రెండు పిట్టలు గిలగిలా కొట్టుకుంటున్నాయి. రష్యా ఉగ్రరూపాన్ని చూసి భయంతో వణికిపోతున్నాయి. ఇన్నాళ్లు ప్రపంచాన్ని ఏలిన ఆ రెండు పిట్టలు ఇప్పుడు కలుగులోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయింది. రష్యా ఉగ్రపోరులో అమెరికా,ఉగ్రవాదం అనే రెండు పిట్టలు ఇప్పుడు రెక్కలు విరిగి అమాంతం నేల మీదకు వచ్చి పడ్డాయి. ఇంకా చెప్పాలంటే ఉగ్రవాదులపై రష్యా సాగిస్తున్న యుద్ధంతో ప్రపంచ దేశాలకు పెద్దన్నగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా తన పెత్తనాన్ని కోల్పోయే స్థితికి వచ్చింది. ఇక ఉగ్రవాదులు సైతం ఎర్రజెండా దెబ్బకు తలో దిక్కుకు పారిపోతున్నారు. మిగతా కథనం స్లైడర్ లో...

Read more: త్రిముఖ పోరులో సిరియా రక్తపుటేరులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఉగ్రవాదులకు వెన్ను దన్నుగా నిలిచిన అన్ని ఉగ్రదేశాలకు ముచ్చెమటలు

అది రక్తపుటేరులు పారుతున్న సిరియా. కాని అక్కడ పారేది ఉగ్రవాదుల రక్తపుటేరులు...వారిని హతమార్చడమే లక్ష్యంగా రష్యా సిరియాలో పాగా వేసింది. ఉగ్రవాదులకు వెన్ను దన్నుగా నిలిచిన అన్ని ఉగ్రదేశాలకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. అమెరికా అంటే భయపడని ఉగ్రదేశాలు ఇప్పుడు ఎరుపెక్కిన ఎర్ర జెండాని చూసి భయంతో వణికిపోతున్నాయి. దీనికి కారణం అమెరికా చేయలేని పనిని రష్యా భుజానకెత్తుకోవడమే.

65కు పైగా స్థావరాలను, కమాండ్స్‌ సెంటర్స్‌ను..

ప్రపంచానికే సవాల్ గా మారిన ఉగ్రవాదుల కోరలు పీకేస్తాననే సంకేతాలిచ్చింది కమ్యూనిస్టు దేశం. చెప్పడమే కాదు...చేసి చూపిస్తోంది. సిరియాలోని ఉగ్రవాద శిబిరాల పై సెప్టెంబర్‌ 30న నుంచి రష్యా వైమానికం ఎడతెరపిలేకుండా దాడులు చేస్తూ వస్తోంది. దాదాపు ఉగ్రవాదులకు సంబంధించిన 65కు పైగా స్థావరాలను, కమాండ్స్‌ సెంటర్స్‌ను, శిక్షణా శిబిరాలను, ఆయుధ గిడ్డంగులను రష్యా వైమానికం ధ్వంసం చేశాయి.

మొట్టమొదటి సారిగా ఎస్‌యు-25, ఎస్‌యు-24ఎమ్‌,

ఈ వైమానిక దాడుల్లో మొట్టమొదటి సారిగా ఎస్‌యు-25, ఎస్‌యు-24ఎమ్‌, ఎస్‌యు-34 పాల్గొన్నాయి. వీటికి ఎస్‌యు-30 జట్‌ విమానాలు రక్షణ వలయంగా పనిచేశాయి. ఇప్పటికీ దాడులు చేస్తున్నాయి. అయితే సిరియా అధ్యక్షుడు అస్సద్‌ విన్నపంతోనే రష్యా ఈ పని చేస్తుంది. ఇది అమెరికాకు ఏ కోశానా మింగుడు పడటం లేదు. రష్యా బలాన్ని చూసిన అగ్రరాజ్యానికి కంటి మీద కునుకే రావడం లేదు.

కాస్పియన్‌ సముద్రం మీద నుంచి 26 క్షిపణులను..

అంతే కాదు.. అక్టోబర్‌ 8న 1,500 కిమీ దూరంలోని కాస్పియన్‌ సముద్రం మీద నుంచి 26 క్షిపణులను సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై ప్రయోగించింది. ఇరాన్‌, ఇరాక్‌ల గగనతలం మీదుగా దిగ్విజయం గా ప్రయోగించి ప్రపంచానికి రష్యా తన నౌకాదళ క్షిపణుల శక్తిని తెలియపరచింది.

వందల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తున్న అమెరికా..

ఈ దాడులను చూసినా అమెరికా సైతం నివ్వెరపోయింది. ఇక వందల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తున్న అమెరికా నౌకాదళం కన్నా చిన్న నౌకల మీదుగా క్షిపణులను ప్రయోగించి రష్యా తన ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరూపించుకుంది.

అమెరికా చేయలేని పనిని కేవలం నెల రోజుల్లో చేసి చూపించి..

అరబ్‌ వసంతం పేరుతో 2011 నుంచి సిరియాలో ప్రభుత్వ మార్పుకు అమెరికా వ్యూహాన్ని కొనసాగిస్తూ, 2014 నుంచి 60 దేశాల కూటమితో అమెరికా ఐఎస్‌ఐఎస్‌పై దాడులు చేస్తున్నప్పటికీ ఫలితం కనపడలేదు.కాని రష్యా నెలరోజుల్లో ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టించింది. అమెరికా చేయలేని పనిని కేవలం నెల రోజుల్లో చేసి చూపించి అగ్రరాజ్యానికి సవాల్ గా మారింది.

మోడరేట్‌ ప్రతిపక్షాలకు ఆయుధాలను సరఫరాచేస్తూ..

ఒకవైపు అస్సద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడరేట్‌ ప్రతిపక్షాలకు ఆయుధాలను సరఫరాచేస్తూ, ఐఎస్‌ఐఎస్‌ దాడులను, చొచ్చుబాటులను ప్రతిఘటించకుండా కేవలం ప్రభుత్వ మార్పుపై దృష్టిని సారించి సామాన్య ప్రజలపైనా, కర్మాగారాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు, నీటిసరఫరా సంస్థలపైనా అమెరికా దాడులు చేసింది. ఈ యుద్దంలో ఇప్పటి వరకు రెండున్నర లక్షలమంది సిరియన్లు ప్రాణాలు కోల్పోయారు.

లక్షలాది ప్రజానీకం ఐరోపా దేశాలకు వలస బాట

ఫలితంగా సిరియాలో అరాచకం ఏర్పడి లక్షలాది ప్రజానీకం టర్కీ, లెబనాన్‌, ఇరాన్‌, జోర్డాన్‌, ఐరోపా దేశాలకు వలస బాట పట్టారు.

ప్రపంచాన్ని కదిలించిన అయిలాన్ కుర్దీ విగతజీవి చిత్రం

దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ప్రపంచాన్ని కదిలించిన అయిలాన్ కుర్దీ విగతజీవి చిత్రమే. ఈ మరణాన్ని కూడా ఐఎస్ కిరాతకంగా వాడుకుంది. మమ్మల్ని కాదని ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే ఇదే గతి పడుతుందని ఐఎస్ వ్యాఖ్యానించింది.

రష్యాను ఒక నమ్మకమైన మిత్రునిగా..

దీంతో ప్రపంచ దేశాల్లో ఎనలేని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉగ్రవాదులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు...అయితే రష్యా ఏకంగా వారిపై యుద్దాన్నే ప్రకటించింది. ఇప్పుడు రష్యా దాడుల వల్ల ఫలితాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. యూరప్‌ దేశాల్లోనూ, ఇరాక్‌, ఇరాన్‌ దేశాల్లోనూ రష్యా అనుకూల పవనాలు వీస్తున్నాయి. అంతే కాదు..రష్యాను ఒక నమ్మకమైన మిత్రునిగా చూస్తున్నాయి.

రష్యాతో మన సంబంధాలను అమెరికా షరతులతో దూరం చేసుకోకూడదని..

యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లౌడే జుంకర్‌ ''రష్యాతో మన సంబంధాలను అమెరికా షరతులతో దూరం చేసుకోకూడదని ప్రకటించారు. రష్యాతో సౌమ్యంగా, సున్నితంగా సమస్యలను పరిష్కరించుకోవాలి'' అన్నారాయన. జర్మనీ డిప్యూటీ ఛాన్సలర్‌ సిగ్మార్‌ గాబ్రియెల్‌ రష్యాతో భావజాల యుద్ధం మంచిది కాదు. అసలు విభేదాలు,అంతర్యుద్ధాలకు గల కారణాలను వెతకాలని పిలుపునిచ్చారు

అమెరికా ఆధిపత్యానికి గండి...

ఇప్పుడు ఉగ్రవాద సంస్థలపై రష్యా దాడుల వల్ల మధ్య ప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టినట్లవుతుంది. ఏక ధృవ ప్రపంచానికి రష్యా తన మిలిటరీ బలంతో సమాధానం చెబుతోంది. రష్యా తన సైనిక స్థావరాలను టార్టూన్‌, లటాకియాల్లో ఏర్పాటు చేసుకుని తద్వారా మధ్యదరా సముద్ర ప్రాంతంలో తన బలాన్ని పెంచుకుంటోంది. అలాగే నల్లసముద్ర నౌకాదళాన్ని పటిష్ట పరచుకుంటోంది.

ప్రత్యామ్నాయ గ్యాస్‌ పైపులైను కతార్‌ నుంచి తీసుకొచ్చే ఆలోచన ..

రష్యా నుంచి గ్యాస్‌ పైపులైను సిరియా, మధ్యదరా సముద్రం మీదుగా యూరప్‌కు కలిపే ప్రణాళిక ఉంది. అయితే ఇప్పుడు ఈ గ్యాస్‌పైపు లైను ప్రణాళికను ధ్వంసం చేయటం ద్వారా ప్రత్యామ్నాయ గ్యాస్‌ పైపులైను కతార్‌ నుంచి తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది అమెరికా. అయితే ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రష్యాపై జరుగుతున్న నిందలను, ఆంక్షలను ఎదుర్కునేందుకు రష్యా సన్నద్దమైంది.

శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తి ..

పూర్వపు సోవియట్‌ యూనియన్‌ విశిష్ట మిలిటరీ బలం, వారసత్వం ద్వారా రష్యాకు వచ్చాయి. ఇదే అదనుతో శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తి ఎస్‌యు34 యుద్ధ విమానాలకు ఉంది. మధ్య ప్రాచ్య దేశాలను నౌకాదళం ద్వారా అదుపులో ఉంచగలిగే సామర్థ్యం నౌకా క్షిపణులకు ఉంది. ఇస్లామిక్‌ టెర్రరిజాన్ని అణగద్రొక్కడం ద్వారా ఇరాన్‌, మధ్య ఆసియా, రష్యా, పాకిస్తాన్‌, భారత్‌లకు పాకకుండా బలహీనపరచే పని చేస్తుంది.

అమెరికాను నమ్ముకోవడం కన్నా రష్యాతో స్నేహం ద్వారా ..

ఉగ్రవాద సంస్థలను ఏరివేయడం ద్వారా సిరియా, ఇరాక్‌, ఇరాన్‌, రష్యాల మధ్య ఏర్పడబోయే స్నేహం వల్ల మధ్య ప్రాచ్యంలో బలమైన శక్తిగా ఆవిర్భవించే ఆలోచన చేస్తుంది. అమెరికాను నమ్ముకోవడం కన్నా రష్యాతో స్నేహం ద్వారా శరణార్థుల సమస్యకు, వాణిజ్యపరమైన సమస్యలకూ పరిష్కారమార్గం దొరుకుతుందనీ ఈ దేశాలు కూడా ఇప్పుడు బలంగా నమ్ముతున్నాయి.

దీనికంతటికీ అమెరికాదే బాధ్యత అని ప్రపంచానికి..

ఇరాక్‌లో సద్దాంహుస్సేన్‌ ప్రభుత్వాన్ని 2003లో పడగొట్టిన తర్వాత లిబియా, సిరియా, ఎమెన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదుల చర్యలు పెరిగాయి. దీనికంతటికీ అమెరికాదే బాధ్యత అని ప్రపంచానికి చాటనుంది రష్యా. ఇదే సమయంలో 2003 ఆక్రమణ నుంచి విసిగివేసారిన ఇరాక్‌ ఉగ్రవాద నిర్మూలనకు రష్యాను సాయం కోరడం ద్వారా అమెరికా మరింత ఇరుకున పడింది.

వ్యూహాత్మకంగా విజయం సాధించాలనేది అధ్యక్షుడు పుతిన్‌ ఎత్తుగడగా..

ఈ దాడుల సహకారంతో సిరియా మిలిటరీ ఉత్తర భాగాన, లెబనాన్‌ మిలిటరీ పశ్చిమ భాగాన, అవసరమైతే దక్షిణం వైపు ఇరాన్‌ దళాలతో ఐఎస్‌ఐఎస్‌ను చుట్టుముట్టి వ్యూహాత్మకంగా విజయం సాధించాలనేది అధ్యక్షుడు పుతిన్‌ ఎత్తుగడగా ఉంది. తాజాగా ఇరాక్‌ షియాలు మద్దతుగా ముందుకొస్తున్నారు.

క్రమంగా ఐఎస్‌ఐఎస్‌ సభ్యులు తమ క్యాంపులు వదిలి ..

రష్యా ఆర్థికవ్యవస్థ స్పెయిన్‌, యుకె వంటి దేశాలతో సమంగా ఉన్నట్లు జిడిపి లెక్కలు చూపిస్తున్నాయి. వాస్తవానికి కృత్రిమంగా డాలర్‌-రూబుల్‌ విలువ కంటే రష్యన్‌ ఆర్థికవ్యవస్థ బలమైనదనీ ఈ వాయుదాడులు, రష్యా సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష పరిజ్ఞానం ద్వారా తెలియజేస్తుంది.దాడుల ప్రారంభంలో ఏముందనుకున్న క్రమంగా ఐఎస్‌ఐఎస్‌ సభ్యులు తమ క్యాంపులు వదిలి వెళుతున్నారు.

ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై రష్యా విజయం ద్వారా ..

వారి చమురు నిల్వలపై, ఆయుధ గిడ్డంగులపై దాడులను ముమ్మరం చేయటం ద్వారా ఇప్పటికే ఉగ్రవాద సంస్థ బలహీనపడుతోంది. ఇస్లామిక్‌ ఉగ్రవాదంపై రష్యా విజయం ద్వారా మధ్య ప్రాచ్యంలో చమురు మార్కెట్‌పై అమెరికా ఆధిపత్యం తగ్గనుంది. వివిధ దేశాలపై సామ్రాజ్య వాద మిలిటరీ పెత్తనాలు తగ్గుముఖంపట్టే అవకాశాలున్నాయి.

అమెరికా విమానాలు ఎగరకూడదని ఒబామా నిర్ణయం తీసుకుకోక..

తాజాగా రష్యా విమానాలు ఎగిరే ప్రాంతంలో పరస్పరం యుద్ధ విమానాలకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అమెరికా విమానాలు ఎగరకూడదని ఒబామా నిర్ణయం తీసుకుకోక తప్పలేదు. మరొకవైపు రష్యన్‌ విమానాలను కూల్చే యుద్ధ ఫిరంగులను అమెరికా సరఫా చేసేందుకు సిద్దమైందని వాదనుంది. ఇదే జరిగితే ప్రపంచంలో అమెరికా మరింత చులకనై శాంతి వ్యతిరేక దేశంగా ముద్ర పడుతుంది. రష్యా శక్తివంతమైన దేశంగా ఎదిగేందుకు దారి ఏర్పడుతుంది.

ఆచరణలో మూడు అడుగులు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి ..

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుదామంటూ ఆ మధ్య ప్రపంచదేశాలకు పిలుపునిచ్చన ఆచరణలో మూడు అడుగులు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి వేస్తోంది. ఇప్పుడు రష్యా దానిని ఆచరణలో చూపిస్తోంది. మరి ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write U.S. Weaponry Is Turning Syria Into Proxy War With Russia
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot