3 రోజులు ఫోన్ బంద్ చేస్తే బ్రెయిన్ అద్భుతంగా మారిపోతుందట.. సైంటిస్టులే ఆశ్చర్యపోయారు..!
Quit Your Phone: స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవి మన చేతిలోనే ఉంటున్నాయి. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాం. కానీ కాసేపు ఫోన్‌కి బ్రేక్ ఇస్తే మీ మెదడు పనిచేసే విధానం మారుతుందట. స్మార్ట్‌ఫోన్‌కి కొంచెం బ్రేక్ ఇచ్చినా మెదడు పనితీరులో మార్పులు వస్తాయని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఏవో తెలుసుకుందాం.
తాజా పరిశోధన ప్రకారం, ఎవరైనా మత్తు పదార్థాల నుంచి బయటపడినప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో, అలాంటి మార్పులే ఫోన్ వాడకం ఆపేస్తే కూడా వస్తాయట. "కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్" అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కేవలం మూడు రోజులు స్మార్ట్‌ఫోన్‌కి దూరంగా ఉంటే మెదడు రసాయనాల్లో మార్పులు వస్తాయట.

* పరిశోధకులు స్టడీ ఎలా సాగిందంటే..
కొంతమంది యంగ్ అడల్ట్స్‌ని 72 గంటలపాటు స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించమని చెప్పారు. ఈ సమయంలో వాళ్లు ఫోన్‌ని కేవలం అత్యవసర పనుల కోసం మాత్రమే వాడాలి. అంటే ఆఫీస్ పనులు, నిత్యావసరాలు, కుటుంబ సభ్యులు లేదా క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి మాత్రమే ఫోన్ వాడాలి.
ఈ మార్పులను కొలవడానికి, శాస్త్రవేత్తలు ఫోన్ వాడకం తగ్గించడానికి ముందు, ఆ తర్వాత సైకలాజికల్ టెస్టులు చేశారు. అంతేకాదు, బ్రెయిన్ స్కానింగ్‌లు కూడా చేశారు. ఈ స్టడీలో తేలిందేంటంటే, రివార్డ్, కోరికలకు సంబంధించిన మెదడులోని కొన్ని ప్రాంతాలు, డ్రగ్స్ లేదా ఆల్కహాల్‌కు బానిసైన వాళ్ల మెదడులో ఎలా రియాక్ట్ అవుతాయో, అలానే రియాక్ట్ అయ్యాయట.
చాలామంది నిపుణులు "స్మార్ట్‌ఫోన్ వ్యసనం" అనే పదం కరెక్టేనా కాదా అని వాదిస్తున్నారు. ఎందుకంటే, ఎక్కువగా ఫోన్ వాడటం అనేది ఎమోషనల్, మానసిక, సామాజిక అంశాల వల్ల వస్తుంది కాబట్టి. కానీ, పరిశోధకులు మాత్రం ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కనుగొన్నారు.
* స్టడీ ఏం చెప్పిందంటే..
అందుకే న్యూరోసైంటిస్టులు దీని ప్రభావం మెదడుపై ఎలా ఉంటుందో ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నారు. ఈ స్టడీలో 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల 25 మంది పాల్గొన్నారు. స్మార్ట్‌ఫోన్ డిటాక్స్ స్టార్ట్ చేసే ముందు, వాళ్లకి ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా, ఫోన్ వాడకానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా అని చెక్ చేశారు.
అంతేకాదు, వాళ్ల ఫోన్ అలవాట్లు, మూడ్, ఫోన్ వాడాలనే కోరికల గురించి కూడా ప్రశ్నలు అడిగారు. తర్వాత fMRI స్కానింగ్ ఉపయోగించి వారి మెదడు ఎలా పనిచేస్తుందో రికార్డ్ చేశారు. 72 గంటలపాటు ఫోన్ వాడకాన్ని తగ్గించిన తర్వాత, మళ్లీ బ్రెయిన్ స్కానింగ్‌లు చేశారు.
*:ఈ రిజల్ట్స్‌లో ఏం తేలిందంటే..
స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించడం వల్ల డోపమైన్, సెరోటోనిన్‌తో లింక్ అయిన మెదడులోని ప్రాంతాలపై ఎఫెక్ట్ పడింది. ఈ న్యూరోట్రాన్స్‌మిటర్లు ఎమోషన్స్, మూడ్, వ్యసనంలో కీలక పాత్ర పోషిస్తాయి. మెదడులో వచ్చిన మార్పులు, డ్రగ్స్ లేదా ఆల్కహాల్ నుంచి బయటపడే వాళ్లలో, లేదా ఫుడ్ క్రేవింగ్స్‌లో కనిపించే మార్పుల్లాగే ఉన్నాయి.
ఇది కేవలం ఎక్కువగా ఫోన్ వాడేవాళ్లలో మాత్రమే కాదు, రెగ్యులర్‌గా ఫోన్ వాడేవాళ్లలో కూడా జరిగింది. టెక్నాలజీ రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో, మన స్మార్ట్‌ఫోన్ అలవాట్లు మెదడు పనితీరుపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఈ స్టడీ ప్రకారం, మీ ఫోన్‌కి కొద్దిరోజులు బ్రేక్ ఇవ్వడం వల్ల మెదడు రసాయనాలను తిరిగి సమతుల్యం చేసుకోవచ్చు. అంతేకాదు, వ్యసనంలా తయారైన ఫోన్ వాడే అలవాటును కూడా తగ్గించుకోవచ్చు. మీరు ఆరోగ్యకరమైన డిజిటల్ రొటీన్‌ని అలవాటు చేసుకుంటే, మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.
కాబట్టి, మీరు కూడా ఫోన్‌కి అతుక్కుపోయినట్టు ఫీలవుతుంటే, ఒకసారి 72 గంటల డిటాక్స్ ట్రై చేయండి. ఇది మీ మెదడుని మీరు ఊహించని విధంగా మార్చేయొచ్చు


Click it and Unblock the Notifications








