షియోమీలో రతన్ టాటా పెట్టుబడులు

Posted By:

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా చైనాకు చెందిన అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ల తయారీ కంపెనీ షియోమీలో పెట్టుబడులు పెట్టారు. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన తొలి భారతీయుడిగా రతన్ టాటా గుర్తింపు పొందారు. షియోమీ కంపెనీలో రతన్ టాటా పెట్టుబడి ఇంకా కొనుగోలు చేసిన వాటాకు సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు.

షియోమీలో రతన్ టాటా పెట్టుబడులు

ఎంతో ముందు చూపుతో వ్యవహరించే రతన్ టాటా షియోమీ ప్రయాణంలో భాగస్వాములు కావటం ఉత్సాహాన్ని ఇస్తోందని, భారత్ లో షియోమీ ఎదుగుదలకు రతన్ టాటా సలహాలు, సూచనలు ఎంగానో దోహదపడతాయని షియోమీ ఇండియా హెడ్ మను జైన్ అన్నారు.

(ఇంకా చదవండి: పెద్ద బ్యాటరీ.. క్వాడ్ హెచ్‌డి డిస్‌ప్లే)

కన్స్యూమర్ ఎలక్ట్ర్రానిక్స్ ప్రపంచంలోకి రివ్వున దూసుకొచ్చిన ప్రముఖ చైనా కంపెనీ షియోమి (Xiaomi) ఇటీవల 5వ వసంతంలోని అడుగుపెట్టింది. ‘యాపిల్ ఆఫ్ చైనా'గా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీని ప్రముఖ పారిశ్రామికవేత్త లీ జన్ (Lei Jun) ఏప్రిల్ 6, 2010న ప్రారంభించారు. చైనా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న  షియోమీ సంస్థకు చైర్మన్ ఇంకా సీఈఓగా లీ జన్ వ్యవహరిస్తున్నారు.

షియోమీలో రతన్ టాటా పెట్టుబడులు

షియోమీ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవటంతో కంపెనీ లాభాల బాటలో నడుస్తోంది. 2013లో షియోమి అమ్మకాలు 4.3బిలియన్ డాలర్లుగా నమోదవగా, వాటిలో అర్జించిన లాభం 56 మిలియన్ డాలర్లు. 2014లో షియోమి టెక్నాలజీ అమ్మకాలు 11.97 బిలియన్ డాలర్లుగా ఉంది. లాభాల శాతం వెల్లడి కావల్సి ఉంది. షియోమీ సంస్థను యాపిల్ ఆఫ్ చైనాగా పిలుస్తారు. సంస్థ వ్యవస్థాపకులైన లీ జన్‌ను ‘స్టీవ్‌‌జాబ్ప్ ఆఫ్ చైనా'గా పిలుస్తారు.

English summary
Ratan Tata invests in Chinese phone-maker Xiaomi. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot