జియోని సవాల్ చేయడానికి రూ.65 వేల కోట్ల డీల్ కుదిరింది

By Hazarath
|

దేశీయ టెలికం రంగంలో అతి పెద్ద డీల్ కుదిరింది. జియో ఉచిత ఆఫర్ల సునామితో దూసుకుపోతున్న నేపథ్యంలో దానిని ఎదుర్కునేందుకు అలాగే సవాల్ చేసేందుకు అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ అలాగే ఎయిర్ సెల్‌ల మధ్య విలీన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రెండు కంపెనీలు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించాయి. తద్వారా రూ.65,000 కోట్ల విలువైన సంస్థగా ఆవిర్భవించి మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. డీల్‌లోని ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే..

 

జియోకి ఊహించని షాక్:రూ.40కి పుల్ టాక్ టైంతో పాటు 1 జిబి డేటా

ప్రతిపాదిత విలీన సంస్థ

ప్రతిపాదిత విలీన సంస్థ

ఈ డీల్ పూర్తయితే.. వినియోగదారులు, ఆదాయం పరంగా ప్రతిపాదిత విలీన సంస్థ (ఆర్ కామ్, ఎయిర్ సెల్ )భారత్‌లో నాలుగో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా నిలుస్తుంది. ఆదాయ పరంగా 12 ప్రధాన సర్కిళ్లలో మూడో స్థానానికి చేరుతామని ఆర్‌కామ్, ఎంసీబీలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

ఆర్‌కామ్‌కు, ఎయిర్‌సెల్

ఆర్‌కామ్‌కు, ఎయిర్‌సెల్

ఈ విలీనం ద్వారా ఆవిర్భవించే కొత్త సంస్థలో ఆర్‌కామ్‌కు, ఎయిర్‌సెల్ ప్రస్తుత యాజమాన్య సంస్థ, మలేసియాకు చెందిన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాద్(ఎంసీబీ)కు చెరో 50 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. డెరైక్టర్ల బోర్డులో ఇరు కంపెనీలకు సమాన ప్రాతినిథ్యం లభిస్తుంది.

రుణాల్లో రూ.14,000 కోట్లను
 

రుణాల్లో రూ.14,000 కోట్లను

ఇరు కంపెనీలు తమకున్న రుణాల్లో రూ.14,000 కోట్లను విలీనం తర్వాత ఏర్పాడే కొత్త సంస్థకు బదలాయిస్తాయి. దీంతో కొత్త కంపెనీ మొత్తం రుణ భారం రూ.28,000 కోట్లుగా ఉంటుంది. స్పెక్ట్రం చెల్లింపుల కోసం వెచ్చించాల్సిన రూ.6 వేల కోట్లు దీనికి అదనం.

రూ.20,000 కోట్ల రుణాన్ని

రూ.20,000 కోట్ల రుణాన్ని

ఈ ఒప్పందంతో ఆర్‌కామ్‌ రూ.20,000 కోట్ల రుణాన్ని తగ్గించుకోగలుగుతుంది. ఒప్పందం పూర్తయితే ఎయిర్‌సెల్‌ అప్పులు రూ.4000 కోట్ల మేర తగ్గుతాయి. ఇక కొత్తగా ఏర్పడే విలీన సంస్థ ఆస్తులు రూ.65,000 కోట్లుగా, నెట్‌వర్త్ రూ.35,000 కోట్లుగా ఉంటుందని అంచనా.

సిస్టెమా శ్యామ్ టెలికం

సిస్టెమా శ్యామ్ టెలికం

రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్ టెలికం(ఎస్‌ఎస్‌టీఎల్/ఎంటీఎస్) వైర్‌లెస్ బిజినెస్‌ను ఆర్‌కామ్ ఇప్పటికే విలీనంచేసుకున్న సంగతి తెలిసిందే.

తాజా డీల్‌తో

తాజా డీల్‌తో

తాజా డీల్‌తో దేశంలో అత్యధిక స్పెక్ట్రం కలిగిన కంపెనీగా కూడా విలీన సంస్థ ఆవిర్భవిస్తుంది. 800; 900; 1,800; 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లలో కలిపి దేశీ టెలికం పరిశ్రమకు ఉన్న మొత్తం స్పెక్ట్రంలో 19 శాతం దీనికి ఉంటుంది. తద్వారా 2జీ, 3జీ, 4జీ సేవలను దేశవ్యాప్తంగా అందించేందుకు వీలవుతుంది.

ఆర్‌కామ్‌కు 11 కోట్ల మంది మొబైల్ యూజర్లు

ఆర్‌కామ్‌కు 11 కోట్ల మంది మొబైల్ యూజర్లు

ప్రస్తుతం ఆర్‌కామ్‌కు 11 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నా రు. సబ్‌స్క్రయిబర్ల పరంగా నాలుగో స్థానంలో ఉంది. ఇక 8.4 కోట్ల మంది యూజర్లతో ఎయిర్‌సెల్ ఐదో స్థానంలో నిలుస్తోంది.

 4జీ సేవల మీద పూర్తి స్థాయిలో

4జీ సేవల మీద పూర్తి స్థాయిలో

ఇప్పటికే 4జీ సేవల మీద పూర్తి స్థాయిలో దృష్టి నిలిపి ఆర్ కామ్..ఈ విలీనం తర్వాత సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

సంచలన ఆఫర్లతో జియోతో పోటీకి సై

సంచలన ఆఫర్లతో జియోతో పోటీకి సై

ఇప్పటికే సంచలన ఆఫర్లతో జియోతో పోటీకి సై అంటోంది. ఇప్పటికే రిలయన్స్. కాం తన చందాదారుల కోసం 40 రూపాయల రీఛార్జ్ తో పుల్ టాక్ టైంతో పాటు 1 జిబి డేటాను ఉచితంగా అందిచే ఆఫర్ తీసుకొచ్చిన విషయం విదితమే.

ఢిల్లీలోని వినియోగదారుల కోసం

ఢిల్లీలోని వినియోగదారుల కోసం

దీంతో పాటు ఢిల్లీలోని వినియోగదారుల కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబాని Call Drops Se Chutkaara పేరుతో రూపాయికే 300 నిమిషాల 4జీ డాటాను ఇచ్చే ఆఫర్ ను తీసుకొచ్చారు.

 కాల్ డ్రాప్ ను అధిగమించే లక్ష్యంతో

కాల్ డ్రాప్ ను అధిగమించే లక్ష్యంతో

కంపెనీ కాల్ డ్రాప్ ను అధిగమించే లక్ష్యంతో 4 జీ యాప్ టు యాప్ కాలింగ్ సౌకర్యాన్ని ప్రకటించామని కూడా తెలిపింది. దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంత(ఎన్‌సీఆర్) ప్రజలకు ఇది భారతలోనే మొదటి ఆఫర్ అనీ, కాల్ డ్రాప్ సర్వీసులనుంచి విముక్తి లభించేందుకే ఈసౌకర్యమని ఆర్ కాం తెలిపిన విషయం విదితమే.

జియోతో పోటీ లేదని

జియోతో పోటీ లేదని

ఇప్పటివరకు జియోతో పోటీ లేదని చెప్పినా ముందు ముందు మాత్రం జియోకి పూర్తి స్థాయిలో పోటీ ఇచ్చేందుకు మాత్రం ఆర్ కామ్ రెడీ అవుతోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

మరిన్ని స్టోరీలు

మరిన్ని స్టోరీలు

జియోకి ఊహించని షాక్:రూ.40కి పుల్ టాక్ టైంతో పాటు 1 జిబి డేటా మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి

</a></strong>మరో షాక్..రూపాయికే 300 నిమిషాల 4జీ డాటా కాల్స్..ఎక్కడంటే...? <strong><a href=క్లిక్ చేయండి " title="మరో షాక్..రూపాయికే 300 నిమిషాల 4జీ డాటా కాల్స్..ఎక్కడంటే...? క్లిక్ చేయండి " loading="lazy" width="100" height="56" />మరో షాక్..రూపాయికే 300 నిమిషాల 4జీ డాటా కాల్స్..ఎక్కడంటే...? క్లిక్ చేయండి 

 

Best Mobiles in India

English summary
Reliance Communications, Aircel merger gives birth to Rs 65,000 crore giant; talks on with Sistema for 25% stake Read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X