ఊహించనంత తగ్గింపు ధరను పొందిన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్

|

నోకియా-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసి విక్రయించే HMD గ్లోబల్ సంస్థ ఇప్పుడు భారతదేశంలో నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌ ధరలను అధికారికంగా తగ్గించింది. గత ఏడాది 26,999 రూపాయల ధర వద్ద లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 4 జీబీ + 64 జీబీ వేరియంట్ 15,999 రూపాయలకు లభిస్తుంది. అధికారిక నోకియా ఆన్‌లైన్ స్టోర్ శాశ్వత ధరల తగ్గింపును పేర్కొంది. అంతేకాకుండా ఈ కొత్త ధరలు త్వరలో అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్ల వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా ప్రతిబింబించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇతర చిల్లర వ్యాపారులు ధరలను తగ్గించడంలేదు.

 
Nokia 8.1 Price Slashed in India:Price,Availability and More

నోకియా 8.1 యొక్క 6 జిబి ర్యామ్ వేరియంట్ ధర కూడా 22,999 రూపాయలకు లభిస్తుంది. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ ముఖ్యంగా నోకియా X7 యొక్క గ్లోబల్ వేరియంట్ మాత్రమే. ఈ హ్యాండ్‌సెట్ నోకియా 7.1 తో పాటు నోకియా 5.1 ప్లస్ మరియు నోకియా 6.1 ప్లస్ వంటి నాచ్ డిస్ప్లేతో గ్లాస్ డిజైన్‌ను అందిస్తుంది. నోకియా 8.1 బ్లూ / సిల్వర్ మరియు ఐరన్ / స్టీల్ అనే రెండు కలర్ కాంబినేషన్లలో వస్తుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ 6.18-అంగుళాల ప్యూర్‌డిస్ప్లే IPS LED ప్యానెల్‌ను 2.5D కర్వ్డ్ గ్లాస్‌తో మరియు 2246 × 1080 పిక్సెల్‌ల ఫుల్-హెచ్‌డి + రిజల్యూషన్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 SoC మరియు అడ్రినో 616 GPU ఆదారంగా రన్ అవుతుంది. ఇది 4GB / 6GB RAM మరియు 64GB / 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 400GB వరకు మెమొరీని మరింత విస్తరించబడుతుంది.

కెమెరాలు

కెమెరాలు

కెమెరా విభాగంలో నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 13 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంటుంది. ముందువైపు సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

ఫీచర్స్
 

ఫీచర్స్

నోకియా 8.1 అనేది HMD గ్లోబల్ చేత తయారుచేసిన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 9 పై అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. నోకియా 8.1 లోని కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్లు, బ్లూటూత్, VoLTE తో 4G LTE మరియు ఫాస్ట్ ఛార్జింగ్ మరియు డేటా బదిలీల కోసం USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో కలిగిన 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Nokia 8.1 Price Slashed in India:Price,Availability and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X