Home
News

రియల్‌మి 6i సేల్స్ నేటి నుంచే మొదలు!! సూపర్‌కాష్‌బ్యాక్ ఆఫర్లతో..

రియల్‌మి సంస్థ గత వారం ఇండియాలో లాంచ్ చేసిన రియల్‌మి 6i ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదటిసారిగా అమ్మకానికి వెళుతున్నది. దీనిని మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ విభాగంలో లభించే ఈ ఫోన్‌ ఆకట్టుకునే అద్భుతమైన స్పెసిఫికేషన్లను మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను కలిగి ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 6i ధరల వివరాలు

రియల్‌మి 6i ధరల వివరాలు

రియల్‌మి 6i యొక్క 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.12,999 మరియు 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఇది ఏకలిప్స్ బ్లాక్ మరియు లూనార్ వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది.

 

రియల్‌మి 6i సేల్స్ ఆఫర్స్

రియల్‌మి 6i సేల్స్ ఆఫర్స్

రియల్‌మి యొక్క ఈ కొత్త ఫోన్ మీద ఆసక్తిగల వారి కోసం ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి సంస్థ కొన్ని అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ యొక్క EMI లావాదేవీలపై 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రుపే డెబిట్ కార్డు యొక్క మొదటి ప్రీపెయిడ్ లావాదేవీపై రూ.30 ప్లాట్ తగ్గింపు లభిస్తుంది. అలాగే రుపే డెబిట్ కార్డు కొనుగోలుపై 75 రూపాయల వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో 5 శాతం తగ్గింపు పొందవచ్చు. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ లో మోబిక్విక్ ద్వారా కొనుగోలు చేసిన వారికి 100 శాతం సూపర్‌కాష్‌బ్యాక్ రూ.500 వరకు పొందవచ్చు.

 

 

రియల్‌మి 6i మీడియాటెక్ హెలియో G90T SoC స్పెసిఫికేషన్స్

రియల్‌మి 6i మీడియాటెక్ హెలియో G90T SoC స్పెసిఫికేషన్స్

రియల్‌మి సంస్థ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 6i యొక్క డిస్ప్లే 1,080x2,400 పిక్సెల్ పరిమాణంలో, 20: 9 కారక నిష్పత్తితో మరియు 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.5-ఇంచ్ ఫుల్-HD + డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G90T SoC చేత రన్ అవుతూ 30W ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతును ఇచ్చే 4,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇందులోని మైక్రో SD కార్డు స్లాట్ ను ఉపయోగించి మెమొరీని 256GB వరకు విస్తరించడానికి అవకాశం కూడా ఉంది.

రియల్‌మి 6i 48MP కెమెరా సెటప్

రియల్‌మి 6i 48MP కెమెరా సెటప్

రియల్‌మి 6i స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఫోన్ యొక్క ఇమేజింగ్ మరియు ఫొటోగ్రఫీ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ సెటప్‌లో మొదటి కెమెరా f / 1.8 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో మరియు పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

రియల్‌మి 6i 4,300mAh బ్యాటరీ కనెక్టివిటీ ఫీచర్స్

రియల్‌మి 6i 4,300mAh బ్యాటరీ కనెక్టివిటీ ఫీచర్స్

రియల్‌మి 6i లలోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి 5, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, 3.5 ఎంఎం ఆడియో జాక్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ మద్దతుతో వస్తుంది. ఇది 30W ఫ్లాష్ ఛార్జ్‌ మద్దతుతో 4,300mAh పెద్ద బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఫోన్ బరువు 195 గ్రాములు.

Best Mobiles in India

English summary
Realme 6i First Sale in India Starts Toady via Flipkart and Realme Website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X