అద్బుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మొదలైన రియల్‌మి X3 సేల్స్
ప్రముఖ చైనా బ్రాండ్ రియల్‌మి గత నెలలో ఇండియాలో మిడ్-రేంజ్ సిరీస్‌లో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ రియల్‌మి X3 యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12pm నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ యొక్క వెబ్ సైట్ లో మొదలయ్యాయి. ఈ ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 855+ SoCతో రన్ అవుతూ 6GB మరియు 8GB RAM ఎంపికలతో జత చేయబడి వస్తుంది. ముందు భాగంలో డ్యూయల్ కెమెరాలు మరియు వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి X3 ధరల వివరాలు
రియల్‌మి X3 ఇండియాలో రెండు వేరు వేరు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.25,999. ఈ ఫోన్ ఆర్కిటిక్ వైట్ మరియు గ్లాసియర్ బ్లూ వంటి రెండు కలర్ ఎంపికలలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్ ద్వారా జరుగుతున్న ఈ అమ్మకంలో మోబిక్విక్ వాలెట్ ద్వారా రియల్‌మి సైట్‌లో కొనుగోలు చేసిన వినియోగదారులకు 100 శాతం సూపర్‌కాష్ అంటే సుమారు రూ.500 వరకు పొందవచ్చు.

రియల్‌మి X3 సేల్ ఆఫర్స్
రియల్‌మి X3 ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేసే వారు కొన్ని అద్బుతమైన ఆఫర్‌లను పొందవచ్చు. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వీటితో పాటుగా యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కూడా అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందుతారు.

రియల్‌మి X3 స్పెసిఫికేషన్స్
రియల్‌మి X3 ఫ్లాగ్‌షిప్ ఫోన్ FHD + రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే 60Hz మరియు 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో రెండు వేరు వేరు స్టోరేజ్ వేరియంట్లలో విడుదల అయ్యింది.

రియల్‌మి X3 ఫీచర్స్
రియల్‌మి X3 ఫ్లాగ్‌షిప్ ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో గల 64-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా శామ్‌సంగ్ GW1 సెన్సార్‌ను కలిగి ఉంది. దీనితో పాటుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా జతచేయబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరాలు కూడా జతచేయబడి ఉన్నాయి.

రియల్‌మి X3 కనెక్టివిటీ ఎంపికలు
రియల్‌మి X3 ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ఒకే ఒక ఎంపికను మాత్రమే వస్తుంది. ఇది బ్రాండ్ యొక్క యాజమాన్య 30W డార్ట్ ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతు గల 4,200mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G, వై-ఫై 802.11ac, బ్లూటూత్ V5.0, GPS/ A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications







