Realme Smartwatch : స్మార్ట్‌వాచ్‌తో పాటు మరో 8 కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తున్న సంస్థ
చైనా యొక్క ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇండియాలో అతి తక్కువ కాలంలోనే బాగా అభివృద్ధిని సాధించింది. మొదట స్మార్ట్ ఫోన్లను తరువాత టీవీలను విడుదల చేసిన రియల్‌మి ఇప్పుడు మొదటి సారిగా తన తొలి స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సిద్దమైంది.

ఇటీవల యూట్యూబ్‌లో # అస్క్మాధవ్ సెషన్ ఎపిసోడ్‌లో రియల్‌మి ఇండియా సీఈఓ మాధవ్ సేథ్ సంస్థ యొక్క స్మార్ట్‌వాచ్ ను ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు రియల్‌మి తన అధికారిక ట్విట్టర్ అకౌంటులో టీజర్ వీడియోను షేర్ చేసింది. అలాగే మాధవ్ సేథ్ తన అకౌంటులో కూడా ఈ వీడియోను షేర్ చేసాడు. iPhone SE 2020: రూ.4000 తగ్గింపుతో ఆపిల్ కొత్త ఫోన్ సేల్స్!!! త్వరపడండి...

రియల్‌మి స్మార్ట్‌వాచ్
టీజర్ వీడియోను విశ్లేషిస్తే కనుక సంస్థ యొక్క మొదటి స్మార్ట్‌వాచ్ యొక్క డిస్ప్లే చతురస్రాకారంలో వస్తుంది. రియల్‌మి షేర్ చేసిన టీజర్ వీడియో ప్రకారం కూడా స్మార్ట్‌వాచ్‌కు రియల్‌మి వాచ్ అని పేరు పెడుతున్నట్లు ధృవీకరిస్తుంది. చైనాలో మే 25న జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో రియల్‌మి వాచ్‌ను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఈ ఈవెంట్ లో రియల్‌మి వివిధ రకాల ఎనిమిది కొత్త ప్రొడెక్టులను ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

రియల్‌మి స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్స్
లీక్ అయిన సమాచారం ప్రకారం రియల్‌మి వాచ్ 1.4-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క స్క్రీన్ 320 x 320 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 326 PPi ను కలిగి ఉంటుంది. రియల్‌మి యొక్క వాచ్‌లో 160 mAh బ్యాటరీని కలిగి ఉండి ఇది 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది. రియల్‌మి వాచ్ స్నాప్‌డ్రాగన్ వేర్ 3100 మరియు ఆండ్రాయిడ్ ద్వారా రన్ అవుతుంది.

అదనపు ఫీచర్స్
రియల్‌మి స్మార్ట్‌వాచ్ యొక్క అదనపు ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్‌వాచ్‌లో IP 68-సర్టిఫైడ్ బిల్డ్ ఉంటుంది. దీనితో పాటుగా పెడోమీటర్, హార్ట్ రేట్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్ వంటి మరెన్నో ఫీచర్లను అందించగలదని ఆశిస్తున్నారు. రియల్‌మి వాచ్ యొక్క ధర సుమారు రూ.15 వేలు ఉంటుందని అంచనా. దీని గురించి ఖచ్చితమైన సమాచారం కోసం మరి కొన్ని రోజులు వేచిఉండవలసి ఉంటుంది.

రియల్‌మి యొక్క ఎనిమిది కొత్త ఉత్పత్తులు
2020 మే 25 న చైనాలో జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో రియల్‌మి కొత్త ఫోన్లు, ఇయర్‌బడ్‌లు మరియు వీటితో పాటుగా మరికొన్ని కొత్త ఉత్పత్తులను ప్రారంభించనున్నది. వీటిలో రియల్‌మి టీవీతో పాటు రియల్‌మి ఎక్స్ 3 సిరీస్‌ను కూడా సంస్థ లాంచ్ చేస్తుందని అందరు భావిస్తున్నారు. ఇది మాత్రమే కాదు బ్లేడ్ రన్నర్ అని సంకేతనామం పొందిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ను కూడా మే 25 న ప్రారంభించవచ్చు.

రియల్‌మి లాంచ్ ఈవెంట్
రియల్‌మి పవర్ బ్యాంక్‌తో పాటు ట్రూ వైర్‌లెస్ (టిడబ్ల్యుఎస్) బడ్స్ లను లాంచ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. షెడ్యూల్ చేసిన లాంచ్ ఈవెంట్‌లో రియల్‌మే పలు రకాల ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్నందున 2020 మే 25 న చైనాలో జరగాల్సిన లాంచ్ ఈవెంట్‌లో రియల్‌మి వాచ్ కేవలం ఒక భాగమని రియల్‌మి కస్టమర్లు ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications








