Home
News

50 గంటల ప్లేబ్యాక్‌ టైం, ANC, డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీతో రియల్‌మి బడ్స్ T200 విడుదల..!

Realme Buds T200 : రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌ లోకి రియల్‌మి 15 5G, రియల్‌మి 15 ప్రో 5G ఫోన్‌లతోపాటు రియల్‌మి బడ్స్ T200 TWS బడ్స్‌ విడుదల అయ్యాయి. ఈ బడ్స్‌ ఇన్ ఇయర్‌ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. మరియు ANC సపోర్టు కూడా ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ఏకంగా 50 గంటల వరకు ప్లేబ్యాక్ టైంను పొందవచ్చు. ఈ బడ్స్ నాలుగు కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంటాయి.

రియల్‌మి బడ్స్‌ T200 స్పెసిఫికేషన్‌లు :
ఈ బడ్స్‌ ఇన్-ఇయర్ డిజైన్‌ ను కలిగి ఉన్నాయి. 12.4mm డైనమిక్‌ డ్రైవర్స్‌ ను కలిగి ఉన్నాయి. మరియు 20Hz-40,000Hz ఫ్రీక్వెన్సీ రేంజ్‌ ను అందిస్తుంది. రియల్‌మి బడ్స్‌ T200 ఇయర్‌బడ్స్‌ IP55 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉన్నాయి.

realme Buds T200 TWS Earbuds

ANC సపోర్టు :
ఈ బడ్స్‌ క్వాడ్‌ మైక్రోఫోన్లను కలిగి ఉన్నాయి. మరియు 32dB ANC (యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌) సపోర్టును కలిగి ఉన్నాయి. ఈ బడ్స్‌ Hi Res ఆడియో సర్టిఫికేషన్‌, LDAC కోడిక్‌ ను సపోర్టు చేస్తుంది. మరియు 45ms Low లేటెన్సీ గేమ్‌ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది.

డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీ :
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.4 పైన పనిచేస్తుంది. మరియు డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. 3D స్పేషియల్‌ ఆడియోను సపోర్టు చేస్తుంది. ఫోన్‌ కాల్స్‌ ఆన్సర్‌ లేదా రిజెక్ట్ చేయడం మరియు ప్లేబ్యాక్‌ను కంట్రోల్‌ చేసేందుకు వీలుగా టచ్ కంట్రోల్స్‌ను కలిగి ఉంది.

realme Buds T200 TWS Earbuds

రియల్‌మి బడ్స్‌ T200 ఇయర్‌బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 50 గంటల ప్లేబ్యాక్‌ టైంను (ANC Off) అందిస్తుంది. అయితే ANC ఫీచర్‌ ఆన్‌ చేసి వినియోగిస్తుంటే 35 గంటల వరకు ప్లేబ్యాక్‌ టైంను అందిస్తుంది. రియల్‌మి లింక్ యాప్‌ ద్వారా ఈ బడ్స్‌ను కనెక్ట్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా సౌండ్‌ ప్రొఫైల్‌, కంట్రోల్స్‌ను కస్టమైజ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

రియల్‌మి బడ్స్ T200 ధర వివరాలు :
ఈ రియల్‌మి బడ్స్‌ ధర రూ.1999 గా ఉంది. ఆగస్టు 1 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. డ్రీమీ పర్పుల్‌, మిస్టిక్‌ గ్రే, స్నోనీ వైట్, నియోన్‌ గ్రీన్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ప్రారంభ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.300 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

realme Buds T200 TWS Earbuds

రియల్‌మి 15 సిరీస్‌ విడుదల :
ఈ బడ్స్‌తోపాటు రియల్‌మి 15 5G, రియల్‌మి 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. 50MP సెల్ఫీ కెమెరా, 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు గేమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌ల సేల్‌ జులై 30 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme Buds T200 TWS Earbuds launched in india with 50 hours of playback time and ANC
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X