Home
News

Realme C11 Sale: రూ.7,499ల తక్కువ ధరకే లభ్యత! త్వరపడండి...

రియల్‌మి సంస్థ గత వారం ఇండియాలో C-సిరీస్‌లో భాగంగా సరికొత్త రియల్‌మి C11 ను విడుదల చేసింది. రియల్‌మి C3 కి అప్ డేట్ వెర్షన్ గా విడుదలైన రియల్‌మి C11 యొక్క అమ్మకాలు ఈ రోజు మొదటిసారి మొదలుకానున్నాయి. సబ్-రూ .8,000 ధరల విభాగంలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ విభాగంలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ మాత్రమే నిజమైన ఛాలెంజర్ గా ఉన్నది. రియల్‌మి C11 యొక్క ఫీచర్స్ మరియు సేల్స్ ఆఫర్స్ వంటి ఇతర ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C11 ధరల వివరాలు

రియల్‌మి C11 ధరల వివరాలు

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12PM నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా ప్రారంభం కానున్నది. ఇండియాలో 2GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్లలో విడుదలైన రియల్‌మి C11 రూ.7,499 ధర వద్ద రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే కలర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

 

రియల్‌మి C11 స్పెసిఫికేషన్స్

రియల్‌మి C11 స్పెసిఫికేషన్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బిల్డ్‌ డిజైన్ ను కలిగి ఉండి వెనుకభాగంలో గట్టి పట్టు కోసం స్పష్టమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్ మరియు 1600 x 720 పిక్సెల్స్, 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G35 SoC ద్వారా రన్ అవుతుంది. ఇది 12nm ప్రాసెస్‌ను కలిగి ఉండి 2.3GHz వేగంతో పనిచేస్తుంది.

రియల్‌మి C11 కెమెరా సెటప్

రియల్‌మి C11 కెమెరా సెటప్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది పిక్సెల్ 4 సిరీస్ మాదిరిగానే రూపొందించబడింది. ఇందులో గల మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ షూటర్ కెమెరా క్రోమా బూస్ట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతుతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంది. ఇది AI బ్యూటీ మోడ్ కలిగి ఉంటుంది.

రియల్‌మి C11 ఫీచర్స్

రియల్‌మి C11 ఫీచర్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక స్టోరేజ్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3-కార్డ్ స్లాట్‌ మద్దతుతో లభిస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ మరియు ఒక ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్‌కు మద్దతు ఉంది. ఈ SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతు ఇస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 9.1 మిమీ మందంతో 196 గ్రాముల బరువుతో వస్తుంది. రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్‌ యొక్క బ్యాటరీ ఒక్క ఛార్జ్ మీద 40 రోజుల స్టాండ్‌బైతో రేట్ చేయబడి ఉంది.

Best Mobiles in India

English summary
Realme C11 1st Sale at 12PM Today in India through Flipkart and Realme.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X