Home
News

Realme X2లో మరో కొత్త వేరియంట్!!! 2రోజులలో సేల్స్ ప్రారంభం...

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి తన సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి X2 గురించి ఒక కొత్త ప్రకటనను విడుదల చేసింది. దీని యొక్క వివరాలను పరిశీలిస్తే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ కోసం కొత్త స్టోరేజ్ మరియు ర్యామ్ వేరియంట్‌ను విడుదల చేసింది.

రియల్‌మి X2 కొత్త వేరియంట్

రియల్‌మి X2 కొత్త వేరియంట్

రియల్‌మి X2 కొత్త వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్లు మరియు లభ్యత వివరాలను కంపెనీ తమ అభిమానులతో పంచుకున్నది. ఇప్పుడు రియల్‌మి సంస్థ ఈ ఫోన్ యొక్క కొత్త వేరియంట్ లో భాగంగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది భారత మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు వేర్వేరు స్టోరేజ్ మరియు ర్యామ్ వేరియంట్లలో కొత్తగా చేరింది. కొన్ని సందర్భాల్లో ఎటువంటి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన దాదాపు ఏడు నెలల తర్వాత వస్తుంది. కానీ సంస్థ అన్నిటికన్నా ముందుగా విడుదల చేసింది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తున్న రియల్‌మిX2 గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి X2 కొత్త వేరియంట్ ధరల వివరాలు

రియల్‌మి X2 కొత్త వేరియంట్ ధరల వివరాలు

రియల్‌మి X2 యొక్క కొత్త 256GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ ను కొనాలని చూస్తున్న వినియోగదారులకు ఇప్పుడు సంస్థ మంచి అవకాశం అందిస్తుంది. కంపెనీ రియల్‌మి 6 యొక్క కొత్త ఫోన్ ను విడుదల చేసిన కొన్ని గంటలకే రియల్‌మి X2 యొక్క కొత్త ర్యామ్ మరియు స్టోరేజ్ ఆప్షన్‌ను ప్రకటించింది. ఈ ప్రకటనను పరిశీలిస్తే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999 కాగా కొత్తగా విడుదల చేసిన 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999.

రియల్‌మి X2 కొత్త వేరియంట్ సేల్స్

రియల్‌మి X2 కొత్త వేరియంట్ సేల్స్

రియల్‌మి X2 కొత్త వేరియంట్ పెర్ల్ బ్లూ, పెర్ల్ వైట్ మరియు పెర్ల్ గ్రీన్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుందని రియల్‌మి ధృవీకరించింది. ఈ ఫోన్ యొక్క కొత్త వేరియంట్ యొక్క అమ్మకాలు జూలై 21, 2020 న రాత్రి 8 నుండి మొదలుకానున్నాయి.

రియల్‌మి X2 స్పెసిఫికేషన్స్

రియల్‌మి X2 స్పెసిఫికేషన్స్

రియల్‌మి X2 స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ ప్యానెల్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్‌ డిస్ప్లే ను కలిగి ఉండి 90Hz రిఫ్రెష్ రేట్‌స్క్రీన్ కు మద్దతు ఇస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC తో రన్ అవుతుంది. ఇది 4,000mAh బ్యాటరీను కలిగి ఉండడమే కాకుండా ఇది 50W సూపర్‌VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 30-35 నిమిషాల్లో సున్నా నుండి 100 వరకు పూర్తి ఛార్జ్ చేయవచ్చు.

రియల్‌మి X2 ఫీచర్స్

రియల్‌మి X2 ఫీచర్స్

రియల్‌మి X2 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ -కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GW1 ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చబడి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme X2 8GB RAM and 256GB Internal Storage New Model Launched in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X