Home
News

Realme C11 కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!!! ధర కూడా తక్కువే...

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతో ఇండియాలో అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపును పొందిన రియల్‌మి సంస్థ ఇప్పుడు ఇండియాలో తన సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి C11 ను నేడు ఇండియాలో లాంచ్ చేసింది. ఇండియాలో రియల్‌మి నార్జో సిరీస్ మరియు రియల్‌మి X3 సిరీస్ ఫోన్లను ప్రారంభించిన తరువాత సంస్థ నేడు తన కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది.

రియల్‌మి C11 లాంచ్

రియల్‌మి C11 లాంచ్

రియల్‌మి సంస్థ తన కొత్త ఫోన్ ను C-సిరీస్ విభాగంలో విడుదల చేసింది. దీనితో సంస్థ యొక్క ప్రధాన అమ్మకాల పరిమాణాన్ని మరింత పెంచుకోవడానికి దోహదం చేస్తుంది. గత సంవత్సరం కంపెనీ ఈ విభాగంలో రియల్‌మి C3 ను విడుదల చేసింది. ఇప్పుడు ఇది రియల్‌మి C11 రూపంలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది.

రియల్‌మి స్మార్ట్‌ఫోన్ ఇండియా మార్కెట్

రియల్‌మి స్మార్ట్‌ఫోన్ ఇండియా మార్కెట్

రెడ్‌మి నోట్ 9 జూలై 20 న ఇండియాలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కావున కంపెనీ యొక్క ఈ కొత్త ఫోన్ కు మార్కెట్లో బలమైన సవాళ్లు ఎదురుకోవడం ఖాయం. రియల్‌మి C11 యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ధరల వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ను ఇండియాలో కేవలం ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసింది. 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ లో లభించే ఈ ఫోన్ యొక్క ధర 7,499 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ను వినియోగదారులు జూలై 22 న మొదటి సారి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి C11 స్పెసిఫికేషన్స్

రియల్‌మి C11 స్పెసిఫికేషన్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బిల్డ్‌ డిజైన్ ను కలిగి ఉండి వెనుకభాగంలో గట్టి పట్టు కోసం స్పష్టమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్ మరియు 1600 x 720 పిక్సెల్స్, 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G35 SoC ద్వారా రన్ అవుతుంది. ఇది 12nm ప్రాసెస్‌ను కలిగి ఉండి 2.3GHz వేగంతో పనిచేస్తుంది.

రియల్‌మి C11 కెమెరా సెటప్

రియల్‌మి C11 కెమెరా సెటప్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది పిక్సెల్ 4 సిరీస్ మాదిరిగానే రూపొందించబడింది. ఇందులో గల మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ షూటర్ కెమెరా క్రోమా బూస్ట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతుతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంది. ఇది AI బ్యూటీ మోడ్ కలిగి ఉంటుంది.

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్

రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక స్టోరేజ్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3-కార్డ్ స్లాట్‌ మద్దతుతో లభిస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ మరియు ఒక ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్‌కు మద్దతు ఉంది. ఈ SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతు ఇస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతుంది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 9.1 మిమీ మందంతో 196 గ్రాముల బరువుతో వస్తుంది. రియల్‌మి C11 స్మార్ట్‌ఫోన్‌ యొక్క బ్యాటరీ ఒక్క ఛార్జ్ మీద 40 రోజుల స్టాండ్‌బైతో రేట్ చేయబడి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme C11 Budget Smartphone Launched in India: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X