Home
News

Realme స్మార్ట్‌ఫోన్లు, టీవీల కొనుగోలుకు సరైన సమయం ఇదే!! ఆఫర్స్ బ్రహ్మాండం...

రియల్‌మి X‌3, రియల్‌మి X3 సూపర్‌జూమ్‌, రియల్‌మి నార్జో 10 మరియు రియల్‌మి టీవీలతో సహా సంస్థ యొక్క అన్ని రకాల ఉత్పత్తుల యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రియల్‌మి ఇండియా వెబ్ సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలుకానున్నాయి.

రియల్‌మి సేల్స్

రియల్‌మి సేల్స్

రియల్‌మి ఉత్పత్తుల మీద ఆసక్తి ఉన్న కొనుగోలుదారులకు అద్భుతమైన ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రియల్‌మి ఇండియా వెబ్ సైట్ లో పైన పేర్కొన్న ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. రియల్‌మి ఎక్స్‌ 3 మరియు రియల్‌మి ఎక్స్‌ 3 సూపర్‌జూమ్‌ ఒక్కొక్కటి రెండు స్టోరేజ్‌ వేరియంట్‌లలో మరియు రియల్‌మి నార్జో 10 ఫోన్ కేవలం సింగిల్‌ స్టోరేజ్‌ మోడల్‌లో లభిస్తుంది. అలాగే రియల్‌మి టీవీ మీద ఆసక్తి ఉన్న వారు దీనిని 32-అంగుళాల మరియు 43-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి X3 ధరల వివరాలు

రియల్‌మి X3 ధరల వివరాలు

ఇండియాలో రియల్‌మి X3 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో బేస్ వేరియంట్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ యొక్క ధర రూ.24,999. మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ. 25,999. ఈ రెండు వేరియంట్లు ఆర్కిటిక్ వైట్ మరియు గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

రియల్‌మి X3 సూపర్‌జూమ్‌ ధరల వివరాలు

రియల్‌మి X3 సూపర్‌జూమ్‌ ధరల వివరాలు

ఇండియాలో రియల్‌మి X3 సూపర్‌జూమ్ ఫోన్ ను రెండు స్టోరేజ్ ఎంపికలలో విడుదల చేసారు. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ యొక్క ధర రూ. 27,999 కాగా 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.32,999. రియల్‌మి X3 మాదిరిగానే ఇది ఒకే ఒక కలర్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి ఇండియా సైట్‌లో మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి ఎక్స్‌ 3, రియల్‌మి ఎక్స్‌ 3 సూపర్‌జూమ్‌ రెండూ కూడా జూన్‌ నెలలో ఇండియాలో లాంచ్ అయ్యాయి.

రియల్‌మి నార్జో 10  ధరల వివరాలు

రియల్‌మి నార్జో 10 ధరల వివరాలు

రియల్‌మి నార్జో 10 స్మార్ట్ ఫోన్ ఇండియాలో మే నెలలో లాంచ్ అయింది. ఇది ప్రారంభించినప్పటి నుండి అనేక సార్లు ఫ్లాష్ అమ్మకాల ద్వారా వినియోగదారుల ముందుకు వచ్చింది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఏకైక ఎంపికలో లభించే ఈ ఫోన్ గ్రీన్ మరియు వైట్ కలర్ ఎంపికలలో రూ.11,999 ధర వద్ద లభిస్తుంది.

రియల్‌మి టీవీల ధరల వివరాలు

రియల్‌మి టీవీల ధరల వివరాలు

రియల్‌మి స్మార్ట్ టీవీలను రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 32 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌ యొక్క ధర రూ.12,999 ధర కాగా 43 అంగుళాల డిస్‌ప్లే గల టాప్ టైర్డ్ వేరియంట్ యొక్క ధర రూ.21,999.

రియల్‌మి టీవీ స్పెసిఫికేషన్స్

రియల్‌మి టీవీ స్పెసిఫికేషన్స్

రియల్‌మి టీవీల్లో స్టాండర్డ్, Vivid, గేమ్, స్పోర్ట్, మూవీ, యూజర్, ఎనర్జీ సేవింగ్ తో సహా ఏడు రకాల డిస్ప్లే మోడ్‌లు కూడా ఉన్నాయి. రియల్‌మి టీవీలు 178 డిగ్రీల "సూపర్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్" ఫీచర్ ను కలిగివున్నాయి. అలాగే ఇది మీడియాటెక్ చిప్‌సెట్ ద్వారా 64 బిట్ క్వాడ్ కోర్ CPU మరియు మాలి -470 MP3 GPUలతో పనిచేస్తాయి. అలాగే ఇది 8GB ROM మరియు 1GB ర్యామ్ తో కూడా జతచేయబడి ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme X3, X3 SuperZoom, Narzo 10 and Realme TV Sale Today in India via Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X