Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..

|

ఇండియాలో పేరుపొందిన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ లలో రియల్‌మి ఫోన్‌లు ఎల్లప్పుడు ముందువరుసలో ఉన్నాయి. గత ఏడాది ఆగస్టులో 3GB ర్యామ్ + 32GB ఒకే ఒక స్టోరేజ్ మోడల్‌లో లాంచ్ అయిన రియల్‌మి C12 ఇప్పుడు భారతదేశంలో కొత్తగా 4GB ర్యామ్ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌ను 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ను అప్‌గ్రేడ్ చేసినప్పటికి ర్యామ్ మరియు స్టోరేజ్ విషయంలో కాకుండా ఫోన్ యొక్క ఫీచర్స్ లలో ఎటువంటి మార్పులు లేవు. రియల్‌మి C12 ఫోన్ మీడియాటెక్ హెలియో G35 SoC మరియు 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. 4GB ర్యామ్ వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే బిగ్ సేవింగ్స్ అమ్మకంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల జాబితాలో చేయబడింది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి C12 ధరలు & ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ఆఫర్స్
 

రియల్‌మి C12 ధరలు & ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ఆఫర్స్

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క కొత్త వెర్షన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్ ఇప్పుడు ఇండియాలో రూ.9,999 ధర వద్ద విడుదల అయింది. ఈ ఫోన్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది పవర్ బ్లూ మరియు పవర్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్ ఇప్పుడు అన్ని ఆన్‌లైన్ సైట్‌లలో రూ.8,999 ధర వద్ద లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి C12 మీద ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. వీటితో పాటుగా నో-కాస్ట్ EMI ఎంపికలు మరియు బ్యాంక్ డిస్కౌంట్‌లతో పాటు మొబిక్విక్ మరియు ఫ్రీచార్జ్ ద్వారా క్యాష్‌బ్యాక్‌ను అదనంగా కూడా అందిస్తుంది.

రియల్‌మి C12 మీడియాటెక్ హెలియో G35 SoC ప్రాసెస్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C12 మీడియాటెక్ హెలియో G35 SoC ప్రాసెస్‌ స్పెసిఫికేషన్స్

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది ప్లాస్టిక్ బిల్డ్‌ డిజైన్ ను కలిగి ఉంది. అలాగే ఫోన్ యొక్క వెనుకభాగంలో గట్టి పట్టు కోసం స్పష్టమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల హెచ్‌డి + IPS LCD డిస్‌ప్లేను 1600 x 720 పిక్సెల్స్ మరియు 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G35 SoC ద్వారా రన్ అవుతుంది. ఇది 12nm ప్రాసెస్‌ను కలిగి ఉండి 2.3GHz వేగంతో పనిచేస్తుంది.

రియల్‌మి C12 ఇమేజింగ్ కెమెరా సెటప్

రియల్‌మి C12 ఇమేజింగ్ కెమెరా సెటప్

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇమేజింగ్ కోసం వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ షూటర్ మెయిన్ కెమెరా ఎఫ్ / 2.2 ఎపర్చరుతో క్రోమా బూస్ట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో గల 2 మెగాపిక్సెల్ రెండవ కెమెరా పోర్ట్రెయిట్ మద్దతు మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలతో జత చేయబడి వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 ఎపర్చరు మరియు AI బ్యూటీ మోడ్ ఫీచర్ తో 5 మెగాపిక్సెల్ షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది.

రియల్‌మి C12 6,000mAh బ్యాటరీ ఫీచర్స్
 

రియల్‌మి C12 6,000mAh బ్యాటరీ ఫీచర్స్

రియల్‌మి C12 స్మార్ట్‌ఫోన్ 3-కార్డ్ స్లాట్‌ మద్దతుతో వస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ మరియు ఒక ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్‌ మద్దతును కలిగి ఉంది. ఈ SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 256GB వరకు విస్తరించడానికి ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది. ఇది రిచ్ గ్రీన్ మరియు రిచ్ గ్రే వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి UIతో రన్ అవుతూ 4GB ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 9.1 మిమీ మందంతో 196 గ్రాముల బరువుతో వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme C12 4GB RAM First Sale Start in Flipkart Big Saving Days Sale 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X