కేవలం రూ.5,999లకే Realme C2:మీరు కొంటున్నారా?
రియల్ మి కంపెనీ నుండి వస్తున్న రియల్ మిC2 ప్రస్తుతం అత్యంత సరసమైన స్మార్ట్ ఫోన్.అత్యంత విలువ గల స్మార్ట్ఫోన్లను అందించే రియల్ మి సంస్థ రియల్ మిC2ను ఆకట్టుకునే లక్షణాలతో దాని ప్రారంభ ధర వద్ద కేవలం రూ .5,999లకు మాత్రమే అందిస్తుంది. రియల్ మిC2 మొబైల్ యొక్క గొప్ప ఫీచర్స్ దాని dewdrop డిస్ప్లే,యూనిక్యూ డైమండ్-కట్ డిజైన్,పెద్ద బ్యాటరీ మరియు ప్రస్తుతం ఆండ్రాయిడ్ పై తో లభించే అత్యంత సరసమైన ఫోన్లలో ఒకటి.

రియల్ మిC2 ఇండియాలో అమ్మకాలు ఈ రోజు 12 గంటలకు ప్రారంభమవుతాయి.ఈ అమ్మకాలు ఫ్లిప్ కార్ట్ మరియు Realme.comలో జరుగుతాయి. రియల్ మిC2 ధర 2GB + 16GBవేరియంట్ కేవలం రూ.5,999మాత్రమే ఈ మొబైల్ లో మరొక 3GB+32GB వేరియంట్ ధర రూ .7,999లు మాత్రమే.ఈ ఫోన్ డైమండ్ బ్లూ మరియు డైమండ్ బ్లాక్ కలర్ లో లభిస్తుంది.

రియల్ మిC2ను ఎందుకు కొనాలి ?
రూ.5,999 ఎంట్రీ లెవల్ ప్రైస్ లో రియల్ మిC2 ఒక నో-బ్రైనెర్ రకం. ఈ ధర వద్ద గొప్ప ఎంపికలు చాలా లేవు కాబట్టి రియల్ మి ఫోన్ చాలా బాగా ఉంటుంది. ఇది ఆకర్షణీయమైన,ప్రత్యేకమైన మరియు ధృడమైన డైమెండ్-కట్ బ్యాక్ ప్యానెల్ తో పాటు ఘనమైన నిర్మాణ నాణ్యతను అందిస్తుంది.దీని యొక్క చిప్పెట్ PUBG మరియు Asphalt 9 లాంటి ఆటలను సపోర్ట్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఎంట్రీ స్థాయి ధర వద్ద ఆల్ రౌండర్ అనుభవంగా Realme C2 ఉంది.
రియల్ మిC2 లో కొన్ని సమస్యలను తగ్గించలేము.డిస్ప్లే పేలవమైన బ్రైట్ నెస్ స్థాయిలు మరియు ColorOS సాఫ్ట్వేర్ చాలా చిందరవందరగా ఉంది.ఇది దీర్ఘకాలంలో ఫోన్ పనితీరు ప్రభావితం కావచ్చు. ఈ సమస్యలు మీకు చాలా ఇబ్బంది కలిగించకపోతే ఈ సెగ్మెంట్లో రియల్లీ C2 అనేది మంచి ఎంపిక.

స్పెసిఫికేషన్స్:
డ్యూయల్-సిమ్ (నానో) రియల్ మిC2 ColorOS 6.0తో Android 9 పై నడుస్తుంది. 19.5: 9 కాపర్ రేషియో మరియు గొరిల్లా గ్లాస్ 5 తో 6.1-inch ఫుల్ HD స్క్రీన్ కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్710 SoC చేత 2GB / 3GB RAM మరియు అడ్రినో 616 GPU తో జత చేయబడింది. మైక్రో SD కార్డు ( 256GB వరకు) విస్తరించవచ్చు. దీని ఇంటర్నల్ స్టోరేజీ 16GB/32GBగా ఉంది.
ఫొటోస్ మరియు వీడియో రికార్డింగ్ కోసం ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది ఇది 13 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాని f /2.2 ఎపర్చరు మరియు 2- మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా f/2.4 ఎపర్చరుతో ఉంటుంది.సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం RealmeC2 ముందు వైపు f/2.0 ఎపర్చరుతో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
రియల్ మిC2 16GB మరియు 32GBఇంటర్నల్ స్టోరేజీ ఎంపికలను కలిగి ఉంది. ఇది మైక్రో SD కార్డు ద్వారా 256GBస్టోరేజీ వరకు మద్దతును అనుమతిస్తుంది. కనెక్టవిటీ ఎంపికలు 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, మైక్రో- USB మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.
రియల్ మిC2 వెనుకవైపు మౌంట్ సాంప్రదాయ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. రియల్మీ C2 154.3x73.7x8.5mm కొలతలతో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఫీచర్స్
డిస్ప్లే ---- 6.1-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 13-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 2GB
OS ----- ఆండ్రాయిడ్ 9పై
స్టోరేజీ ----- 16GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh
ధర ----- రూ.5,999


Click it and Unblock the Notifications








