ఇండియాలో రియల్‌మి ప్రభంజనం:స్మార్ట్‌ఫోన్‌ల ధర,ఫీచర్స్ వివరాలు
రియల్‌మి సంస్థ భారతదేశంలో రియల్‌మి 5, రియల్‌మి 5 ప్రో ఫోన్‌లతో పాటు తన కొత్త ఇయర్‌ఫోన్‌ల జతను కూడా విడుదల చేసింది. రియల్‌మి బడ్స్ 2 తో పాటు రియల్‌మి 5 ఐకానిక్ కేస్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ఐకానిక్ కేస్, రియల్‌మి 5 ప్రో మరియు రియల్‌మి టోట్ బాగ్‌తో పాటు తాజా రియల్‌మి బడ్స్ 2 సెప్టెంబర్ నుండి ఇండియాలో అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి 5 ఇండియాలో 9,999 రూపాయలతో ప్రారంభమవుతుంది. అలాగే రియల్‌మి 5 ప్రో 13,999 రూపాయలతో ప్రారంభమవుతుంది. ఇయర్ ఫోన్స్ మరియు ఇతర రియల్‌మి ఉత్పత్తుల యొక్క లక్షణాలు మరియు ధర గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

రియల్‌మి బడ్స్ 2,రియల్‌మి 5 ఐకానిక్ కేస్ ధర వివరాలు:
రియల్‌మి బడ్స్ 2 కేవలం 599 రూపాయలతో లభిస్తుంది. రియల్‌మి 5 కోసం ఐకానిక్ కేసులను రియల్‌మి 399 రూపాయల ప్రారంభ ధరతో ఆవిష్కరించింది. అంతేకాకుండా భారతదేశంలో రియల్‌మి 5 యొక్క 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 రూపాయలతో ప్రారంభమవుతుంది. అలాగే రియల్‌మి 5 ప్రో యొక్క 4GB ర్యామ్+ 64GB స్టోరేజ్ వేరియంట్ ధర 13,999 రూపాయలతో ప్రారంభమవుతుంది.

రియల్‌మి బడ్స్ 2 ఇతర వివరాలు:
రియల్‌మి బడ్స్ 2 సెప్టెంబర్ 4 నుండి ఇండియాలో విక్రయించబడతాయి. అలాగే సెప్టెంబర్ 11 నుండి ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా లభిస్తుంది. ఇది గత ఏడాది భారతదేశంలో ప్రారంభించిన రియల్‌మి బడ్స్‌కు అప్డేట్ వేరేషన్ గా చెప్పవచ్చు. రియల్‌మి బడ్స్ కెవ్లర్ ఫాబ్రిక్ వైర్, 11nm డ్రైవర్లు, మాగ్నెటిక్ స్విచ్ డిజైన్ మరియు 3-బటన్ ఇన్-లైన్ రిమోట్‌ను అందిస్తున్నాయి.
కొత్తగా ప్రారంభించిన రియల్‌మి బడ్స్ 2 11.2mm బాస్ డ్రైవర్లతో పనిచేస్తుంది. ఇది మాగ్నెటిక్ క్లాంపింగ్ మెకానిజం మరియు డ్యూయల్ టాంగిల్-ఫ్రీ కేబుల్ ను కలిగి ఉంటుంది. ఇయర్ ఫోన్లు మల్టీ-లేయర్ కాంపోజిట్ డయాఫ్రాగమ్ మరియు కేబుల్ ఆర్గనైజర్‌తో వస్తాయి.

రియల్‌మి 5 ధర వివరాలు:
రియల్‌మి 5 మూడు స్టోరేజ్ మోడళ్లలో అందించబడుతుంది. అందులో 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ 9,999 రూపాయలకు లభిస్తుంది. అలాగే 4GB ర్యామ్+ 64GB స్టోరేజ్ ధర 10,999 రూపాయలుగా నిర్ణయించగా 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉన్న టాప్ మోడల్ ధర 11,999 రూపాయలుగా నిర్ణయించబడింది. ఆగస్టు 27 మధ్యాహ్నం 12:00 గంటల నుండి వీటి యొక్క అమ్మకాలు జరుగుతాయి.

రియల్‌మి 5 ప్రో ధర వివరాలు:
మరోవైపు రియల్‌మి 5 ప్రో కూడా మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో మొదటిది 4GB ర్యామ్+ 64GB స్టోరేజ్ బేస్ మోడల్13,999 రూపాయలకు లభిస్తుంది. అలాగే 6GB ర్యామ్+64GB స్టోరేజ్ ఉన్న మిడ్ వేరియంట్ ధర 14,999 రూపాయలుగా నిర్ణయించారు. మూడవది 8GB ర్యామ్+128GB స్టోరేజ్ ఉన్న టాప్ మోడల్ ధర ఇండియాలో16,999 రూపాయలుగా నిర్ణయించబడింది.సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 12:00 గంటల నుండి దీని అమ్మకాలు జరుగుతాయి.ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి స్టోర్ మరియు భాగస్వామి ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల నుండి కొనుగోలు చేయగలవు.

రియల్‌మి 5 మరియు రియల్‌మి 5 ప్రో స్పెసిఫికేషన్స్:
కెమెరా వివరాలు:
రియల్‌మి 5 మరియు రియల్‌మి 5 ప్రో రెండూ క్వాడ్ రియర్ కెమెరాలతో మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నాయి. అయితే రియల్‌మి 5 ప్రో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. రియల్‌మి 5 ప్రో 119-డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 4 సెం.మీ ఫోకస్ సూపర్ మాక్రో లెన్స్ మరియు పోర్ట్రెయిట్ లెన్స్‌తో అందించనుంది. ఇంకా ఫోన్ VOOC ఫ్లాష్ ఛార్జ్ 3.0 టెక్నాలజీతో వస్తుంది. ఇది కేవలం 30 నిమిషాల్లో 55 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.
రియల్‌మి 5 ప్రోతో పాటు రియల్‌మి 5 యొక్క ముఖ్య లక్షణాలను హైలైట్ చేస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్ దాని ధరల విభాగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాడ్ కెమెరా ఫోన్‌గా పేర్కొనబడింది. ఇది1.25-మైక్రాన్ పిక్సెల్ పరిమాణంతో పాటు f / 1.8 లెన్స్ ప్రాధమిక సెన్సార్‌తో వస్తుంది . కెమెరా సెటప్‌లో 119-డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్, సూపర్ మాక్రో లెన్స్ మరియు పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉంటాయి.

ఫీచర్స్:
రియల్‌మి 5 ప్రో యొక్క "మెరుపు వేగవంతమైన" క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ SoC కూడా ఉంటుందని హైలైట్ చేస్తుంది. ఈ ఫోన్ అదనంగా దాని ఉత్తమ మధ్య-శ్రేణి చిప్‌సెట్ తో వస్తుందని తెలిపింది. ఇది స్నాప్‌డ్రాగన్ 712 SoCతో వస్తుంది. రియల్‌మి 5 ఫోన్ 5,000mAh బ్యాటరీతో 10W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది.అలాగే రియల్‌మి 5 ప్రో కూడా 4,035mah బ్యాటరీతో మరియు 20W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది ఇంకా ఫోన్ కొత్త "బెస్ట్-ఇన్-సెగ్మెంట్" క్వాల్కమ్ SoC తో వస్తుంది. అలాగే రియల్‌మి 5 వెనుక భాగంలో సాంప్రదాయ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. అయితే రియల్‌మి 5 ప్రోలో డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.


Click it and Unblock the Notifications








