Home
News

ఇండియాలో త్వరలో విడుదలయే 5 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లు

ఇండియాలో ప్రతి నెల స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు వారి వారి స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూఉంటారు. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ పోటీని కొనసాగించడానికి నిరంతరం కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు.ఇప్పుడు శామ్సంగ్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ నోట్ 10 సిరీస్‌ను భారత్‌కు తీసుకువస్తున్నది.ఎప్పుడు శామ్సంగ్ కు గట్టి పోటీ ఇచ్చే షియోమి కూడా ఈ సారి మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయబోతున్నది.

Best 5 Smartphones to Launch Soon in India 2019: Heres the List

అలాగే దీనికి పోటీగా షియోమి మరియు రియల్‌మి సంస్థలు కొత్తగా తన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నాయి. త్వరలో ఇండియాలో రిలీజ్ అవుతున్న మొదటి ఐదు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 షియోమి Mi A3:

షియోమి Mi A3:

షియోమి యొక్క ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిలో Mi A3 అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో రిలీజ్ కాబోతున్నది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యూరోప్‌లో ప్రారంభ ధర EUR 249తో ప్రారంభించబడింది. ఇప్పుడు ఇండియాలో 14,999 రూపాయలకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. Mi ఇండియా యొక్క మేనేజర్ మను కుమార్ జైన్ ఇప్పటికే కొత్త ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సంబంధించిన టీజర్‌లను విడుదల చేసారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టు 21 న ఇండియాలో లాంచ్ కాబోతున్నది.

మోటరోలా వన్ యాక్షన్:

మోటరోలా వన్ యాక్షన్:

మోటరోలా వన్ యాక్షన్ గా పిలువబడే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా సంస్థ ఇటీవల యూరోప్‌లో ప్రకటించింది. "వన్" సిరీస్‌లోని మూడవ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఈ నెలలో ఇండియాలో రిలీజ్ కానున్నది. ఇది 6.3-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో 2520x1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో మరియు ప్రత్యేకమైన 21: 9 డిస్‌ప్లేతో వస్తుంది. ఇది వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది మరియు ఇది Exynos 9609 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 3,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10:

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 10:

ఈ నెలలో అత్యంత ఉత్తేజకరమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లలో ఒకటి శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 సిరీస్ లాంచ్. ఈ సంస్థ త్వరలో కొత్త నోట్ లైనప్‌ను భారత్‌కు తీసుకువస్తోంది. సంస్థ ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో ప్రీ-బుకింగ్ కోసం స్మార్ట్‌ఫోన్‌ను జాబితా చేసింది. కాగా శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 ధర 69,999 రూపాయలు. మరియు శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10+ యొక్క ధర 256GB మరియు 512GB స్టోరేజ్ వేరియంట్‌లకు వరుసగా రూ.79,999 మరియు 89,999 రూపాయలు ఆగస్ట్ 22 నుండి ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఇండియాలో జరగనున్నాయి.

రియల్‌మి 5:

రియల్‌మి 5:

రియల్‌మిX ని భారతదేశంలో విజయవంతంగా ప్రారంభించిన తరువాత సంస్థ ఇప్పుడు రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. దీని ధర 15,000 రూపాయలు. రియల్‌మి కంపెనీ మెరుగైన స్పెసిఫికేషన్లతో రియల్‌మి 5 ప్రో స్మార్ట్‌ఫోన్ ను కూడా తీసుకురావచ్చు. అలాగే రియల్‌మి 5 ప్రోలో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నట్లు నిర్ధారించబడింది. రియల్‌మి 5 ప్రో మరియు రియల్‌మి 5 స్మార్ట్‌ఫోన్లు ఆగస్ట్ 20 న అంటే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతున్నారు.

ఆసుస్ ROG ఫోన్ 2:

ఆసుస్ ROG ఫోన్ 2:

ఆసుస్ ఇటీవలే ఆసుస్ ROG ఫోన్ 2 గా పిలువబడే వారి గేమింగ్ స్మార్ట్‌ఫోన్ యొక్క రెండవ వేరియంట్ ను విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ మరింత శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్‌తో వస్తున్నది.ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇండియా లాంచ్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు త్వరలో ఇండియాలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Best 5 Smartphones to Launch Soon in India 2019: Here's the List
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X