Home
News

Realme Narzo 10 Sale:బడ్జెట్‌ ఫోన్‌ను తగ్గింపు ధర వద్ద పొందే గొప్ప అవకాశం....

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి గత నెలలో విడుదల చేసిన ఫోన్లలో రియల్‌మి నార్జో 10 ఒకటి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఉత్పత్తి మరియు సరఫరాలలో సమస్యల కారణంగా ఇది ప్రస్తుతం ఫ్లాష్ అమ్మకాల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఇండియాలో ఈ రోజు మరోసారి దీని యొక్క అమ్మకాలు మొదలుకానున్నాయి.

రియల్‌మి నార్జో 10 ఫ్లాష్ సేల్

రియల్‌మి నార్జో 10 ఫ్లాష్ సేల్

రియల్‌మి నార్జో 10 ఫోన్ మీడియాటెక్ హెలియో G80 SoC చేత రన్ అవుతూ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే ఇది 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ప్రస్తుతం దీని యొక్క అమ్మకాలు రియల్‌మి యొక్క వెబ్‌సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ లలో మొదలుకానున్నాయి.

 

రియల్‌మి నార్జో 10 ధరల వివరాలు

రియల్‌మి నార్జో 10 ధరల వివరాలు

రియల్‌మి నార్జో 10 ఫోన్ ఇండియాలో కేవలం ఒకే ఒక స్టోరేజ్ ఎంపికలలో విడుదల అయింది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఎంపికలో లభించే ఫోన్ యొక్క ధర రూ.11,999. ఇది దట్ బ్లూ, దట్ గ్రీన్ మరియు దట్ వైట్ వంటి మూడు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌.కామ్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలుకానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లోని అమ్మకపు ఆఫర్‌ల విషయానికి వస్తే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై 5 శాతం తగ్గింపు లభిస్తుంది. నో-కాస్ట్ EMI ఆప్షన్లు నెలకు రూ.1,334 చెల్లించి కూడా కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి నార్జో 10 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 10 స్పెసిఫికేషన్స్

రియల్‌మి 10 ఫోన్ యొక్క డిస్ప్లే 720x1600 పిక్సెల్ పరిమాణంలో 6.5-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది హెచ్‌డి + రిజల్యూషన్, 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు "మినీ-డ్రాప్" నాచ్ స్టైల్ వంటి ఫీచర్ లను కలిగి ఉన్నాయి. రియల్‌మి నార్జో 10 యొక్క డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఇది స్పోర్ట్స్ మీడియాటెక్ హెలియో G70 SoC తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10-ఆధారిత రియల్‌మి UI తో పనిచేస్తుంది.

రియల్‌మి నార్జో 10  క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌

రియల్‌మి నార్జో 10 క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌

రియల్‌మి 10 స్మార్ట్ ఫోన్ వెనుకవైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనిలో f / 1.8 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది. ఇది 119 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం రియల్‌మి నార్జో 10 ముందువైపు ఎఫ్ / 2.0 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా ఉంది. ఈ సెల్ఫీ కెమెరా 30fps ఫ్రేమ్ రేట్ వద్ద HD (720p) వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. వెనుక కెమెరా సెటప్ ఫుల్ -హెచ్‌డి (1080p) వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.

రియల్‌మి నార్జో 10 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ

రియల్‌మి నార్జో 10 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ 5,000mAh బ్యాటరీ

రియల్‌మి నార్జో 10 ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 5,000mAh బ్యాటరీ మద్దతును కలిగి ఉంది. ఈ ఫోన్ 164.4x75.4x9mm కొలతల పరిమాణంలో ఉండి 199 గ్రాముల బరువుతో వస్తుంది. ఈ ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మద్దతును కలిగి ఉంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు. ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే 4G ఎల్‌టిఇ, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Realme Narzo 10 Flash Sale Start Today 12PM in India via Flipkart and Realme.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X