Realme కొత్త ఫోన్ నార్జో 30 సిరీస్ డిజైన్ లీక్‌ల మీద ఓ లుక్ వేయండి...
ఇండియాలో రియల్‌మి యొక్క స్మార్ట్‌ఫోన్‌లకు ఎంత డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా గత సంవత్సరంలో విడుదల అయిన నార్జో సిరీస్ లైనప్ లకు ప్రత్యేక ఆదరణ లభించింది. ఇందులోని మొత్తం ప్రయోజనంలో 'జెన్ Z' కోసం నిర్దేశించిన ఫోన్‌లపై దృష్టి పెట్టడానికి రియల్‌మి నార్జో 20 సిరీస్‌ను ప్రారంభించింది. అయితే ఇప్పుడు సంస్థ వీటి యొక్క తరువాతి తరం రియల్‌మి నార్జో 30 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడం మీద దృష్టి పెట్టింది. ఈ చైనా కంపెనీ త్వరలోనే ఈ సిరీస్‌ను విడుదల చేసి తన యొక్క స్మార్ట్‌ఫోన్ లైనప్ ను మరింత విస్తరించనుంది.

రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్ లీక్
రియల్‌మి సంస్థ యొక్క తన స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా రిలీజ్ చేయడానికి ముందు కొత్త స్మార్ట్‌ఫోన్‌ల యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను లీక్ చేసి వినియోగదారుల యొక్క దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్ కోసం ప్రజల సలహాలను తీసుకోవడం ప్రారంభించింది. రియల్‌మి నార్జో 30 ప్రో స్పెసిఫికేషన్లను సూచించే కొన్ని లీక్‌లు ఇప్పుడు హాల్ చల్ చేస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి నార్జో 30 ప్రో మోడల్ నెంబర్
మోడల్ నంబర్ ‘RMX 3161' తో కనిపించే రియల్‌మి యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ ఇటీవల ప్రఖ్యాత ధ్రువీకరణ సైట్ టెన్నాలో కనిపించింది. ఈ జాబితాలో ఫోన్ యొక్క పేరును వెల్లడించలేదు. అయినప్పటికీ నార్జో 20 ప్రోలో ‘RMX 2161' మోడల్ నంబర్ ఉన్నందున టెన్నాలో కనిపించే కొత్త ఫోన్ రియల్‌మి నార్జో 30 ప్రోగా దృవీకరిస్తున్నారు.

రియల్‌మి నార్జో 30 సిరీస్ లీక్ ఫీచర్స్
లిస్టింగ్ ప్రకారం రియల్‌మి నార్జో 30 కొత్త స్మార్ట్‌ఫోన్ NSA / SA 5G కనెక్టివిటీకి మద్దతుతో వస్తున్నట్లు ప్రధాన హైలైట్ గా ఉంది. ఈ నార్జో 30 ప్రో 6.5-అంగుళాల డిస్ప్లే మరియు 4,800mAh బ్యాటరీతో రాబోతున్నట్లు సమాచారం. ఇది ప్రయోగ సమయానికి 4,500mAh లేదా 5,000mAh కావచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11 మరియు రియల్‌మి యుఐతో రన్ అవుతూ 162.5 × 74.8 × 8.8mm కొలతల పరిమాణంతో వచ్చే అవకాశం ఉంది. డిజైన్ విషయానికొస్తే రియల్‌మి నార్జో 30 ప్రో బ్లాక్ కలర్ లో వచ్చే అవకాశం ఉంది. వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకారంలో నిలువుగా సమలేఖనం మాడ్యూల్ లో రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండనున్నట్లు భావిస్తున్నారు. ఈ సెటప్‌లో మూడు కెమెరాలు ఉంటాయి. పంచ్-హోల్ డిజైన్ తో సెల్ఫీ కెమెరాను కలిగిఉండవచ్చు. ఎడమ వైపు వాల్యూమ్ రాకర్‌ను, కుడి వైపున ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

రియల్‌మి నార్జో 30 సిరీస్ లాంచ్ డేట్
రియల్‌మి నార్జో 30 సిరీస్ గురించి ఖచ్చితమైన సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ సిరీస్ యొక్క ప్రో వేరియంట్‌తో పాటు కంపెనీ నార్జో 30 మరియు నార్జో 30A లను కూడా విడుదల చేయనున్నట్లు కొన్ని నిఘా వర్గాల సమాచారం. నార్జో 30 సిరీస్‌లోని మూడు స్మార్ట్‌ఫోన్‌లలో అనేక ఫీచర్స్ ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రో వేరియంట్ మాత్రం పెద్ద డిస్ప్లే , మెరుగైన కెమెరాలు, వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ మరియు అప్‌గ్రేడ్ ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. నార్జో 30A మిగిలిన రెండింటిలో టోన్డ్-డౌన్ వేరియంట్ కావున కొద్దిగా తక్కువ స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉంటుంది అని భావిస్తున్నారు.

రియల్‌మి నార్జో 30 సిరీస్ ధరల వివరాలు
రియల్‌మి నార్జో 30 సిరీస్ ఫోన్ల యొక్క ధరల విషయానికొస్తే సంస్థ యొక్క ముందున్న ఫోన్ల మాదిరిగానే వీటి ధరలు కూడా బడ్జెట్ ధరలో రూ.15 వేల లోపు వస్తున్నట్లు భావిస్తున్నారు. ఇది జరిగితే భారతదేశంలో చాలా సరసమైన 5G ఫోన్‌లను లాంచ్ చేసిన కంపెనీలలో రియల్‌మి ఒకటి అవుతుంది.


Click it and Unblock the Notifications








