Realme X7 సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి!! ధరలు, ఫీచర్స్ ఇవే...
రియల్‌మి సంస్థ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్‌మి X7 మరియు రియల్‌మి X7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ఇండియాలో ఎట్టకేలకు ఆన్‌లైన్ లాంచ్ ఈవెంట్ పద్దతిలో నేడు విడుదల చేసింది. మిడ్-రేంజ్ 5G మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు వన్‌ప్లస్ నార్డ్, షియోమి Mi 10i 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా లభించే రియల్‌మి రెండు కొత్త ఫోన్‌లు 5G సపోర్ట్, 65W ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే వంటి మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లు ఫిబ్రవరి 10 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా దేశంలో అందుబాటులోకి రానున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి X7 సిరీస్ ధరల వివరాలు
రియల్‌మి X7 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్‌లలో స్పేస్ సిల్వర్ మరియు నెబ్యులా కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 6GB ర్యామ్ / 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.19,999 కాగా 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.21,999. 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ ఏకైక మోడల్ వేరియంట్‌లో లభించే రియల్మే X7 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫాంటసీ మరియు మిస్టిక్ బ్లాక్ అనే రెండు కలర్ లలో రూ.29,999 కొంచెం ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఫిబ్రవరి 10 నుండి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా వినియోగదారులు పొందవచ్చు.

రియల్‌మి X7 సిరీస్ లాంచ్ ఆఫర్స్
రియల్‌మి X7 ప్రో యొక్క అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్, మరియు ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఫిబ్రవరి 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలవుతుండగా రియల్‌మి X7 ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి రానున్నది. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు EMI పద్దతితో పాటుగా రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులు రూ.1,500 తగ్గింపును పొందవచ్చు.

రియల్‌మి X7 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
రియల్‌మి X7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.55-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 120HZ రిఫ్రెష్ రేటు మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో కలిగి ఉంది. ఇది 7nm తయారీ ప్రక్రియ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ 5G ప్రాసెసర్ ను కలిగి ఉండి ARM మాలి-జి 77MC 9 GPU తో మరియు 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండి కంపెనీ యొక్క సొంత రియల్‌మి UI స్కిన్‌తో రన్ అవుతుంది. వీటన్నింటి కోసం ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో కూడిన 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

రియల్‌మి X7 ప్రో 64MP క్వాడ్-కెమెరా సెటప్
రియల్‌మి X7 ప్రో యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉంటాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి X7 50W ఫాస్ట్ ఛార్జింగ్ స్పెసిఫికేషన్స్
రియల్‌మి X7 స్మార్ట్ ఫోన్ 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 2400 × 1080 పిక్సెల్ రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఇది ARM మాలి- G57 MC3 GPU తో జత చేసిన డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్‌తో రన్ అవుతూ 6GB/ 8GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పై మరియు రియల్‌మి UIతో రన్ అవుతూ 50W ఛార్జింగ్ మద్దతుతో కూడిన 4,310mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయంలో ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు జత చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో హోల్ పంచ్ కెమెరా మాడ్యూల్ లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








