Home
News

Realme Narzo 30 Series కొత్త ఫోన్ల ఫీచర్స్, ధరల మీద ఓ లుక్ వేయండి...

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి యొక్క నార్జో సిరీస్‌లో సరికొత్త మోడల్స్ రియల్‌మి నార్జో 30 ప్రో 5G, రియల్‌మి నార్జో 30A లను నేడు భారత్‌లో విడుదల చేశారు. నార్జో 30 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 800Uతో రన్ అవుతూ 5G కనెక్టివిటీతో లభిస్తుండగా. మరోవైపు రియల్‌మి నార్జో 30A మీడియాటెక్ హెలియో G85 Soc మరియు 4G సపోర్ట్‌ను కలిగి ఉండి బడ్జెట్ ధరలో లభిస్తుంది. షియోమి యొక్క Mi మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2 కు పోటీగా రియల్‌మి నార్జో 30 ప్రో 5G మరియు నార్జో 30A లతో పాటు రియల్‌మి మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ దేశంలో ప్రారంభించబడింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి నార్జో 30 సిరీస్ ధరల వివరాలు

రియల్‌మి నార్జో 30 సిరీస్ ధరల వివరాలు

రియల్‌మి నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రెండు వేరియంట్‌లలో విడుదల అయ్యాయి. ఇందులో ప్రో 5G మోడల్ యొక్క 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.16,999 ఉండగా, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.19,999 ధర ట్యాగ్‌ను కలిగి ఉండి స్వోర్డ్ బ్లాక్ మరియు బ్లేడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే మరొక ఫోన్ రియల్‌మి నార్జో 30A కూడా రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 3GB ర్యామ్ + 32Gb స్టోరేజ్ వేరియంట్‌ రూ.8,999 ధర ట్యాగ్‌ను మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ రూ.9,999 ధర ట్యాగ్‌ను కలిగి ఉండి లేజర్ బ్లాక్ మరియు లేజర్ బ్లూ కలర్ ఎంపికలలో లభిస్తుంది.

రియల్‌మి నార్జో 30 సిరీస్ సేల్స్

రియల్‌మి నార్జో 30 సిరీస్ సేల్స్

రియల్‌మి నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల లభ్యత విషయానికొస్తే వీటిలో రియల్‌మి నార్జో 30 ప్రో 5G మోడల్ మార్చి 4 న మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అయితే రియల్‌మి నార్జో 30A ఫోన్ యొక్క అమ్మకాలు మార్చి 5 న మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతాయి. ఈ రెండు ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల వినియోగదారులకు ఇఎంఐ లావాదేవీలపై రూ.1,000 తక్షణ తగ్గింపు లబిస్తుంది.

రియల్‌మి నార్జో 30 ప్రో 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30 ప్రో 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30 ప్రో 5G యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి యుఐతో రన్ అవుతుంది. ఇది 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి మరియు 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 U Socను 8GB వరకు ఎల్‌పిడిడిఆర్ 4X ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.

రియల్‌మి నార్జో 30A స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30A స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30A ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో రియల్మే UI తో రన్ అవుతుంది. ఇది 720x1,600 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తితో 6.5-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ తో పాటుగా 570 నిట్స్ గరిష్ట ప్రకాశంను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G85 SoC తో పాటు 4GB వరకు LPDDR4X RAM తో జతచేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ పరంగా ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, ఎఫ్ / 2.4 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 30 Series New Smartphones Released in India: Price, Specs, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X