Home
News

Realme Narzo 30A First Sale: రూ.8,000 ధరలో రియల్‌మి ఫోన్‌లో బెస్ట్ ఛాయస్

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల ఇండియాలో విడుదల చేసిన నార్జో 30 సిరీస్ లలో నార్జో 30A ను మొదటి సారి నేడు ఆన్‌లైన్ మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి వినియోగదారుల ముందుకు తీసుకువస్తున్నది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12PM నుండి ఆన్‌లైన్ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్ సైట్ ద్వారా మొదలుకానున్నాయి. బడ్జెట్ ధరలో లభించే ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో G85 SoC, 4GB వరకు ర్యామ్, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి నార్జో 30A ధరలు & సేల్స్ వివరాలు

రియల్‌మి నార్జో 30A ధరలు & సేల్స్ వివరాలు

రియల్‌మి నార్జో 30A స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. ఇందులో 3GB ర్యామ్ + 32Gb స్టోరేజ్ బేస్ వేరియంట్‌ రూ.8,999 ధర ట్యాగ్‌ను మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్‌ రూ.9,999 ధర ట్యాగ్‌ను కలిగి ఉండి లేజర్ బ్లాక్ మరియు లేజర్ బ్లూ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్ ద్వారా కొనుగోలు చేసే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల వినియోగదారులకు రూ.1,000 వరకు తక్షణ తగ్గింపు లబిస్తుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది.

రియల్‌మి నార్జో 30A ఆండ్రాయిడ్ 10 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30A ఆండ్రాయిడ్ 10 స్పెసిఫికేషన్స్

రియల్‌మి నార్జో 30A ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లో రియల్మే UI తో రన్ అవుతుంది. ఇది 720x1,600 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తితో 6.5-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ తో పాటుగా 570 నిట్స్ గరిష్ట ప్రకాశంను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G85 SoC తో పాటు 4GB వరకు LPDDR4X RAM తో జతచేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ పరంగా ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, ఎఫ్ / 2.4 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

రియల్‌మి నార్జో 30A యాంబియంట్ లైట్ సెన్సార్ కనెక్టివిటీ

రియల్‌మి నార్జో 30A యాంబియంట్ లైట్ సెన్సార్ కనెక్టివిటీ

రియల్‌మి నార్జో 30A ఫోన్‌ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ V5.0, GPS/ A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఫోన్ యొక్క సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ వంటివి ఉన్నాయి. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరిని మరింత విస్తరించవచ్చు. ఇది 6,000mAh అతి పెద్ద బ్యాటరీని స్టాండర్డ్ 25W పాస్ట్ ఛార్జర్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Narzo 30A Smartphone First Sale Starts Today 12PM on Flipkart and Realme.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X