Home
News

Realme సంస్థ విడుదల చేయనున్న స్మార్ట్‌టీవీ... టీవీ రంగంలో గట్టి పోటీ...

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి ఇండియాలో ప్రారంభమైన కేవలం రెండేళ్ళలోపు భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కీలకపాత్ర పోషిస్తున్నది. ఇది మిగతా వాటితో పోలిస్తే ఇండియాలో తెలివిగా పనిచేసి త్వరగా ఎదిగింది. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఆడియో ఉత్పత్తులు మరియు వాటి యొక్క ఉపకరణాల విషయంలో కూడా రియల్‌మి సంస్థ తన సత్తా చాటుతున్నది.

రియల్‌మి

ఇప్పుడు రియల్‌మి సంస్థ తన తదుపరి విభాగంలోకి అడుగుపెట్టింది. స్మార్ట్‌టీవీలను త్వరలో విడుదల చేస్తున్నట్లు రియల్‌మి సంస్థ తన వెబ్‌సైట్‌ ద్వారా ధృవీకరించింది. రియల్‌మి సంస్థ వస్తున్న మొదటి రియల్‌మి టీవీని 43-అంగుళాల స్క్రీన్ పరిమాణంలో అందించవచ్చని సూచిస్తుంది. ఇదే కాకుండా ఇతర స్క్రీన్ పరిమాణాలు కూడా ఉండవచ్చు. ఈ సంవత్సరం చివర్లో రియల్‌మి టీవీని సంస్థ ఇండియాలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

BIS

BIS

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా ట్విట్టర్ యూజర్ ముకుల్ శర్మ గుర్తించిన జాబితా ప్రకారం రియల్‌మి టివి 43-ఇంచ్ LED వేరియంట్ టివికి ధృవీకరించబడినట్లు చూపిస్తుంది. అదే జాబితాలోని మోడల్ నెంబర్ JSC55LSQL; మోడల్ సంఖ్యలోని '55' ఈ శ్రేణిలోని టాప్-ఎండ్ వేరియంట్ 55-అంగుళాల స్క్రీన్ కలిగి ఉండవచ్చని సూచిస్తుంది.

రియల్‌మి టీవీ

రియల్‌మి టీవీ

భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి మరియు లాక్‌డౌన్ కారణంగా రియల్‌మి టీవీని 2020 లో క్యూ 2 లో ప్రారంభించబోతున్నాం అని సంస్థ తెలిపింది. 2020 లోనే టెలివిజన్ భారతదేశంలో ప్రారంభించబడుతుందని మేము ఇంకా ఆశిస్తున్నాము. రియల్‌మి టీవీని మొదట MWC 2020 లో ప్రకటించాలని అనుకున్నారు. కాని కరోనావైరస్ వ్యాప్తిపై ఉన్న ఆందోళనల కారణంగా ఈ కార్యక్రమం రద్దు చేయబడింది.

రియల్‌ఇ సీఈఓ మాధవ్ శేత్

రియల్‌ఇ సీఈఓ మాధవ్ శేత్

ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో కంపెనీ స్మార్ట్ టీవీని విడుదల చేయనున్నట్లు రియల్‌ఇ సీఈఓ మాధవ్ శేత్ గతంలో ప్రకటించారు. కోవిడ్ -19 మహమ్మారి భారతదేశంలో అన్ని కీలకమైన ఉత్పత్తి లాంచ్‌లను వాయిదా వేయడంతో రియల్‌మే టీవీ రాక కూడా ఆలస్యం కావచ్చు.

 

 

స్మార్ట్ టీవీ ఫీచర్స్

స్మార్ట్ టీవీ ఫీచర్స్

ప్రస్తుతానికి రియల్‌మి సంస్థ యొక్క స్మార్ట్ టీవీ ఫీచర్స్ మరియు ప్రత్యేకతలు ఏవీ తెలియదు. రియల్‌మి టీవీ సిరీస్‌లో హెచ్‌డిఆర్‌కు మద్దతుతో అల్ట్రా-హెచ్‌డి మోడళ్లు ఉండే అవకాశం ఉంది. అవి ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఆండ్రాయిడ్ టీవీ లేదా కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో రన్ అవుతున్న స్మార్ట్ టెలివిజన్లు.

స్మార్ట్ టీవీ

స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ప్రవేశించే స్మార్ట్ఫోన్ కంపెనీల జాబితాలో రియల్మే చేరనుంది. షియోమి ఇప్పటికే స్మార్ట్ టివిల యొక్క పెద్ద శ్రేణిని ధరల పరిధిలో కలిగి ఉండడమే కాకుండా ఆన్‌లైన్ లో పెద్ద మార్కెట్ వాటాను కూడా పొందింది. మోటరోలా మరియు నోకియా స్మార్ట్ టీవీలు కూడా భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ లో టిసిఎల్ మరియు VU యొక్క ధరలు ప్రస్తుతం స్వల్పంగా పెరిగాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Smart TV Spotted on BIS Site ahead of Official Release
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X