ఇండియాలో లాంచ్ అయిన రియల్‌మిX & రియల్‌మి3i
న్యూఢిల్లీలో ఈ రోజు జూలై 15 సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో రియల్‌మిX, రియల్‌మి3i లను ఇండియాలో విడుదల చేశారు. ఆన్‌లైన్ మొబైల్ అమ్మకాల పరంగా కంపెనీ ఇప్పుడు ఇండియాలో రెండవ అతిపెద్ద కంపెనీగా రియల్‌మి ప్రకటించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, మరియు చెన్నైలలో స్మార్ట్‌ఫోన్ మరమ్మతు ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తున్నట్లు రియల్‌మి ప్రకటించింది. అక్కడ మీ ఫోన్‌ను 30 నిమిషాల్లో రిపేర్ చేస్తామని కంపెనీ పేర్కొంది. ఇండియాలో రియల్‌మిX ధర రూ.16,999 కాగా, రియల్‌మి3i ధర 7,999రూపాయలు.

రియల్‌మిX మొబైల్ సంస్థ ప్రారంభించిన మొట్టమొదటి "సరసమైన ఫ్లాగ్‌షిప్" స్మార్ట్‌ఫోన్ లాగా ఉంటుంది. అయితే రియల్‌మి3i స్మార్ట్‌ఫోన్ రియల్‌మి3 మొబైల్ కన్నా కొంచెం చౌకగా ఉంటుంది.

రియల్‌మిX స్పెసిఫికేషన్స్:
రియల్‌మిX 19.5: 9 కారక నిష్పత్తితో 6.53-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే ను కలిగి ఉంది. ఇది 16 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా మరియు డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ గల డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 SoC ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 4GB ర్యామ్+128GB స్టోరేజ్ మరియు 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది . రియల్‌మిX 3,765 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంటుంది. రియల్‌మిXకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా కలర్OS 6 తో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అదనపు మెమరీ కోసం విస్తరించదగిన స్లాట్ లేదు. రియల్‌మిX పోలార్ వైట్ మరియు స్పేస్ బ్లూ వంటి రెండు రంగులలో లభిస్తుంది. రియల్‌మిX యొక్క ప్రత్యేక స్పైడర్ మాన్ ఎడిషన్‌ను కూడా రియల్‌మి సంస్థ ప్రారంభించింది.

ఇండియాలో రియల్‌మిX ధరలు:
ఇండియాలో రియల్‌మిX 4 GB RAM+128 GB RAM వేరియంట్ ధర16,999 రూపాయలు. 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 19,999రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 24 మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మకాలు మొదలుకానుంది. అయితే రియల్‌మిXకు జూలై 18 న హేట్-టు-వెయిట్ సేల్ కూడా ఉంది. రియల్‌మిX స్పైడర్ మ్యాన్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర 20,999రూపాయలు.

రియల్‌మి3i స్పెసిఫికేషన్స్:
రియల్‌మి3i మీడియాటెక్ హెలియో p70 చిప్‌సెట్‌తో వస్తుంది మరియు 4,230 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇది 3D గ్రేడియంట్ యూనిబోడీ డిజైన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.2-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేతో పాటు 19: 9 కారక నిష్పత్తి మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ పై ఆధారంగా కలర్ OS 6.0తో నడుస్తుంది. కెమెరా విభాగం విషయానికొస్తే రియల్‌మి3 13 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్‌ను f/ 1.8 ఎపర్చరు మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఫీచర్స్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో PDAF, నైట్‌స్కేప్ మోడ్, హైబ్రిడ్ హెచ్‌డిఆర్, క్రోమా బూస్ట్, పోర్ట్రెయిట్ మోడ్ మరియు సీన్ రికగ్నిషన్ ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఎఫ్ / 2.0 ఫ్రంట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ పరంగా రియల్‌మి3i 4G VoLTE, బ్లూటూత్ 4.2, వై-ఫై 802.11 b/g/n, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్‌బితో పాటు OTG సపోర్ట్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ 4,230 ఎంఏహెచ్ బ్యాటరీతో బ్యాకప్ చేయబడి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత కలర్‌ఓఎస్ 6.0 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో నడుస్తుంది.

ఇండియాలో రియల్‌మి3i ధర:
ఇండియాలో రియల్‌మి3i స్మార్ట్‌ఫోన్ 3 GB RAM+ 32 GB స్టోరేజ్ వేరియంట్ ధర 7,999రూపాయలు కాగా 4 GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 రూపాయలు. రియల్‌మి3i యొక్క మొదటి అమ్మకం జూలై 23 న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క ఆన్‌లైన్ స్టోర్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








