జూలై 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి3i & రియల్‌మిX

|

రియల్‌మి Xతో పాటు రియల్‌మి3i ఇండియాలో లాంచ్ కానుంది. రియల్‌మి ఇండియా సీఈఓ మాధవ్‌ శేత్‌ సోమవారం తన ట్విట్టర్‌ పోస్ట్‌ ద్వారా కొత్త ఫోన్‌ రాక గురించి సూచించారు. అయితే రాబోయే మోడల్ రియల్‌మి3i తన ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ మంగళవారం ధృవీకరించింది.

realme 3i teased on flipkart launching with realme x in india on july 15

ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన రియల్‌మి3i చౌకైన వేరియంట్‌గా వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా లభిస్తుందని కూడా పేర్కొన్నారు.

రియల్‌మి3i  యొక్క టీజర్:

రియల్‌మి3i యొక్క టీజర్:

రియల్‌మి మరో స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 3i ని రియల్‌మిX తో పాటు జూలై 15 న భారతదేశంలో విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి3i యొక్క టీజర్ జాబితాను కంపెనీ "స్మార్ట్‌ఫోన్స్ కా ఛాంపియన్" అని పేర్కొంది. ఇది ఫోన్‌ను చాలా స్టైలిష్ ఛాంపియన్, బిగ్ బ్యాటరీ ఛాంపియన్, డిస్ప్లే ఛాంపియన్ మరియు కెమెరా ఛాంపియన్‌గా టీజ్ చేస్తుంది.

రియల్‌మి 3 ధరలు:

రియల్‌మి 3 ధరలు:

గుర్తుచేసుకోంటే రియల్‌మి 3 మార్చిలో ప్రారంభించబడింది. ఇది రియల్‌మి 2 తరువాత వచ్చింది. కంపెనీ మొదట్లో రియల్‌మి 3 యొక్క రెండు వేరియంట్లను విడుదల చేసింది. తరువాత 3 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌తో కొత్త వేరియంట్ మేలో వచ్చింది. ఈ కొత్త రియల్‌మి3 3 జీబీ + 64 జీబీ వేరియంట్‌ ధర 9,999రూపాయలు. 3GB + 32GB కాన్ఫిగరేషన్ మరియు 4GB + 64GB కాన్ఫిగరేషన్ కలిగిన ఇతర వేరియంట్ల ధరలు వరుసగా రూ.8,999 మరియు 10,999రూపాయలు.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

రియల్‌మి 3 మీడియాటెక్ హెలియో p70 చిప్‌సెట్‌తో వస్తుంది మరియు 4,230 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడిఉంటుంది. ఇది 3D గ్రేడియంట్ యూనిబోడీ డిజైన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.2-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేతో పాటు 19: 9 కారక నిష్పత్తి మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ పై ఆధారంగా కలర్ OS 6.0తో నడుస్తుంది. కెమెరా విభాగం విషయానికొస్తే రియల్‌మి3 13 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్‌ను f/ 1.8 ఎపర్చరు మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఫీచర్స్:

ఫీచర్స్:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో PDAF, నైట్‌స్కేప్ మోడ్, హైబ్రిడ్ హెచ్‌డిఆర్, క్రోమా బూస్ట్, పోర్ట్రెయిట్ మోడ్ మరియు సీన్ రికగ్నిషన్ ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఎఫ్ / 2.0 ఫ్రంట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ పరంగా రియల్‌మి 3 4G VoLTE, బ్లూటూత్ 4.2, వై-ఫై 802.11 b/g/n, జిపిఎస్ / ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్‌బితో పాటు OTG సపోర్ట్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ 4,230 ఎంఏహెచ్ బ్యాటరీతో బ్యాకప్ చేయబడి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత కలర్‌ఓఎస్ 6.0 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో నడుస్తుంది.

Best Mobiles in India

English summary
realme 3i teased on flipkart launching with realme x in india on july 15

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X