Realme X2 Pro మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ కు అరుదైన అవార్డు....
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఈ సంవత్సరం మొదటిలో తన సరికొత్త రియల్‌మి X2 ప్రో మాస్టర్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కు అరుదైన రెడ్ డాట్ డిజైన్ అవార్డు లభించినట్లు రియల్‌మి సంస్థ తెలిపింది. ఈ రెడ్ డాట్ డిజైన్ అవార్డు అంతర్జాతీయంగా గుర్తించబడిన 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రపంచ పారిశ్రామిక డిజైన్ అవార్డు.

దీనిని జర్మన్ డిజైన్ కౌన్సిల్ ప్రారంభించింది. అధిక-నాణ్యత గల డిజైన్ ను కలిగి ఉండి హై-రేంజ్ ఫోన్ లకు గట్టి పోటీ ఇస్తున్న రియల్‌మి X2 ప్రో మాస్టర్ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి X2 ప్రో ధరల వివరాలు
రియల్‌మి X2 ప్రో యొక్క మాస్టర్ ఎడిషన్ కేవలం ఒకే ఒక వేరియంట్లో లభిస్తుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ గల ఈ ఫోన్ రూ.36,999 ధర వద్ద వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి వెబ్‌సైట్‌లో రియల్‌మి X2 ప్రో యొక్క 6GB RAM + 64GB స్టోరేజ్ స్టాండర్డ్ వేరియంట్ రూ.29,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.31,999 కు కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్స్
రియల్‌మి X2 ప్రో స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ ప్యానెల్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే ను కలిగి ఉండి 90Hz రిఫ్రెష్ రేట్‌స్క్రీన్ కు మద్దతు ఇస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC తో రన్ అవుతుంది. ఇది 4,000mAh బ్యాటరీను కలిగి ఉండడమే కాకుండా ఇది 50W సూపర్VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 30-35 నిమిషాల్లో సున్నా నుండి 100 వరకు పూర్తి ఛార్జ్ చేయవచ్చు.

కెమెరా సెటప్
రియల్‌మి X2 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ -కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GW1 ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








