Realme x7 pro 5G మొదటి సేల్ ప్రారంభం!! ఊహించని ఆఫర్లు బోలెడు...
రియల్‌మి సంస్థ గత వారం ఇండియాలో విడుదల చేసిన మిడ్-రేంజ్ 5G మోడల్ స్మార్ట్‌ఫోన్‌లు రియల్‌మి X7 మరియు రియల్‌మి X7 ప్రో లలో ప్రో మోడల్ నేడు మొదటిసారి అమ్మకానికి రానున్నది. వన్‌ప్లస్ నార్డ్, షియోమి Mi 10i 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా 5G సపోర్ట్, 65W ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే వంటి మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ సేల్ లో ఈ ఫోన్ కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి X7 ప్రో ధర & సేల్ ఆఫర్స్
ఇండియాలో 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్‌లో రూ.29,999 ధర వద్ద విడుదల అయిన రియల్‌మి X7 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫాంటసీ మరియు మిస్టిక్ బ్లాక్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్స్ ఫిబ్రవరి 10 అంటే ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుండి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా మొదలుకానున్నాయి. ఈ రోజు అమ్మకంలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు ఈ ఫోన్ కొనుగోలుపై 10% తగ్గింపు పొందవచ్చు.

రియల్‌మి X7 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ 5G స్పెసిఫికేషన్స్
రియల్‌మి X7 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.55-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను 120HZ రిఫ్రెష్ రేటు మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో కలిగి ఉంది. ఇది 7nm తయారీ ప్రక్రియ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ 5G ప్రాసెసర్ ను కలిగి ఉండి ARM మాలి-జి 77MC 9 GPU తో మరియు 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండి కంపెనీ యొక్క సొంత రియల్‌మి UI స్కిన్‌తో రన్ అవుతుంది. వీటన్నింటి కోసం ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో కూడిన 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

రియల్‌మి X7 ప్రో యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరాలు జతచేయబడి ఉంటాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








