రియల్‌మి XT ఫ్లాష్ సేల్స్.... త్వరపడండి!!!

|

ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు మొదలవుతున్న బిగ్ బిలినియర్స్ డేస్ సేల్స్ సందర్బంగా చాలా రకాల ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా రియల్‌మి యొక్క తాజా 64-మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి వెబ్‌సైట్‌లో ఫ్లాష్ సేల్స్ కి సిద్ధంగా ఉంది. స్మార్ట్‌ఫోన్‌కు ఇది రెండవ ఫ్లాష్ సేల్ అవుతుంది. వినియోగదారులు ఈ రోజు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ నుండి రియల్‌మి ఎక్స్‌టిని మధ్యాహ్నం 12:00 గంటలకు కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి XT
 

రియల్‌మి XT అమ్మకాలు ఇండియాలో గత వారం మొదలయ్యాయి. దాని మొదటి అమ్మకంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 4 నిమిషాల్లో 64,000 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. దీనిని ఇండియాలో మూడు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో అందిస్తున్నారు. ఇది పెర్ల్ వైట్ మరియు పెర్ల్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్లలో వస్తుంది.

ధర & ఆఫర్స్

ధర & ఆఫర్స్

రియల్‌మి ఎక్స్‌టి బేస్ మోడల్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ.15,999. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .16,999. ఇందులో టాప్-ఎండ్ మోడల్ 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర 18,999 రూపాయలు. సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 మధ్య కొనుగోలు చేసిన రియల్‌మి ఎక్స్‌టిపై వినియోగదారులకు ఒక సంవత్సరం పొడిగించిన వారంటీ లభిస్తుంది అని రియల్‌మి వెబ్‌సైట్ పేర్కొంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రియల్‌మిXT స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను డ్యూడ్రాప్ స్టైల్ నాచ్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కలిగి ఉంది. రియల్‌మి ఎక్స్‌టి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 712 AIE SoC తో రన్ అవుతుంది. ఇందులో 4GB నుంచి 8GB వరకు RAM మరియు 64GB నుంచి 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో కలిపి ఉంటుంది. రియల్‌మి సంస్థ రియల్‌మిXT స్మార్ట్‌ఫోన్‌ను వివిధ వేరియంట్ లలో రిలీజ్ చేసింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: చౌకైన స్మార్ట్‌ఫోన్‌లు

కెమెరాలు
 

కెమెరాలు

రియల్‌మిXT స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా విభాగానికి వస్తే ఇందులో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. కెమెరా యొక్క సెటప్ విషయంలో ఎక్కువ హైలైట్ గా ఉన్న అంశం శామ్సంగ్ ISOCELL బ్రైట్ GW1 మరియు f /1 / 1.72 సెన్సార్‌తో పనిచేసే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. ఇది పోటీ ఫోన్‌లలో కనిపించే 48MP సెన్సార్ కంటే 34% పెద్దది. 64MP సెన్సార్ 4-ఇన్ -1 పిక్సెల్ బిన్నింగ్‌ను ఉపయోగిస్తుంది. 16MP కెమెరా ఫోటోలను 1.6μm వ్యక్తిగత-పరిమాణ పిక్సెల్‌లతో అందించడానికి ఉపయోగపడుతుంది. వెనుక కెమెరా సెటప్‌లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు డెప్త్ మ్యాపింగ్ కోసం 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సోనీ ఐఎమ్‌ఎక్స్ 471 సెన్సార్‌తో f / 2.0 ఏపర్చర్ తో సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

గ్రేట్ న్యూస్: రియల్‌మి ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు

కెమెరా ఫీచర్స్

కెమెరా ఫీచర్స్

రియల్‌మిXT అప్రమేయంగా 16MP ఫోటోలను స్నాప్ చేస్తుంది. అయితే 9216 × 6912 పిక్స్ స్టిల్స్‌ను సంగ్రహించే ప్రత్యేక 64MP అల్ట్రా మోడ్ కూడా ఇందులో ఉంది. వెనుక వైపున ఉన్న ఇతర కెమెరాలు 8MP 119-డిగ్రీల అల్ట్రావైడ్, 2MP డీప్ కెమెరా మరియు 2MP మాక్రో స్నాపర్ ఇవి 4cm వద్ద గల వివరాలను చక్కగా సంగ్రహించగలవు. ఎదురుగా 16MP f / 2.0 సెల్ఫీ షూటర్ ఉంది.

అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ ల లో ఈ ఫోన్ల పై భారీ డిస్కౌంట్ లు

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఎంపికలు

రియల్‌మిXT యొక్క డిజైన్ విషయానికి వస్తే ఇందులో ముందు మరియు వెనుక ప్యానెల్‌లో గొరిల్లా గ్లాస్ 5 తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్ ప్రమాదవశాత్తు కింద పడిన మరియు సహేతుకమైన స్థాయికి రక్షణగా ఉంటుంది. ఇందులో VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతుతో కూడిన 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. స్మార్ట్‌ఫోన్ యొక్క ఇతర కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో వై-ఫై, బ్లూటూత్ V5.0, USB టైప్-సి పోర్ట్ మరియు మరిన్ని సాధారణ కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. ముఖ్యముగా ఇది ఆండ్రాయిడ్ 9 పై-ఆధారిత కలర్‌ఓఎస్ 6 డార్క్ మోడ్ తో రన్ అవుతుంది. ఇది పెర్ల్ వైట్ మరియు పెర్ల్ బ్లూ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుందని రియల్‌మి వెల్లడించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme XT Flash sale in Flipkart: Price,Offers, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X