ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్స్:దిమాక్ ఖరాబ్ ఆఫర్స్

|

ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా అమ్మకాన్ని నిర్వహిస్తోంది. ఈ అమ్మకం సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతుంది. ఈ అమ్మకంలో అనేక ఫోన్ల మీద చాలా రకాల ఒప్పందాలు మరియు డిస్కౌంట్లను జాబితా చేయబడ్డాయి. ఒప్పో A3s , రెడ్‌మి 6 , మోటరోలా వన్ విజన్ వంటి మరిన్ని ఫోన్లు ఇందులో ముఖ్యమైనవిగా ఉన్నాయి. ఆసుస్ 6Z , ఒప్పో F 11 ప్రో, మరియు వివో V15 ప్రో ఫోన్‌ల మీద కూడా అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ చాలా ఫోన్‌ల కొనుగోలుపై కేవలం 69 రూపాయలకు తన కంప్లీట్ మొబైల్స్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది.

ఒప్పో A3
 

ఫ్లిప్‌కార్ట్‌లోని మొబైల్స్ బొనాంజాలో ఒప్పో A3 స్మార్ట్ ఫోన్ పై 1,000 రూపాయల తగ్గింపుతో 2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను 6,990 రూపాయలకు మరియు 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను 7,990 రూపాయలకు చివరగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను 9,990 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో పర్పుల్ మరియు రెడ్ కలర్ ఎంపికలలో లభిస్తుంది.

రెడ్‌మి 6

రెడ్‌మి 6 ను 2,000 రూపాయల తగ్గింపుతో 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను కూడా 6,999 రూపాయల ధర వద్ద అందిస్తున్నారు. అదేవిధంగా రియల్‌మి 2 ప్రో యొక్క 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ను 9,999 రూపాయల డిస్కౌంట్‌తో జాబితా చేయబడింది. చివరి దీని యొక్క కట్ ధర 11,990 రూపాయలు. ఇందులో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను 11,999 రూపాయలకు మరియు 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను13,999 రూపాయల డిస్కౌంట్ ధర అందిస్తోంది.

రియల్‌మి

రియల్‌మి 3 స్మార్ట్ ఫోన్ పై కూడా 500 రూపాయల తగ్గింపును అందిస్తోంది. అలాగే రియల్‌మి 3 ప్రో పై కూడా 1,000 రూపాయల ఆఫ్ లభిస్తోంది. అలాగే నోకియా 8.1పై రూ.1,000 మరియు మోటరోలా వన్ విజన్ పై రూ.3,000 డిస్కౌంట్ అందిస్తోంది. మోటరోలా వన్ విజన్ యొక్క రూ.19.999ల లాంచ్ ధరకు బదులుగా ఈ అమ్మకంలో 16,999 రూపాయలకు అందిస్తోంది.

ఎక్స్చేంజ్ డిస్కౌంట్
 

ఎక్స్చేంజ్ డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్స్ అనేక ఫోన్‌లపై అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. పాత ఫోన్ మార్పిడి ద్వారా డిస్కౌంట్ పొందాలని చూస్తున్న వినియోగదారులు వీటిని పరిగణించవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ A-సిరీస్ ఫోన్‌లపై 2,500 రూపాయల అదనపు ఎక్స్చేంజ్ తగ్గింపు అందుకోవచ్చు. అలాగే ఆసుస్ 6Z, ఒప్పో F11 ప్రో, వివో V 15 ప్రో, ఒప్పో A 7 వంటి ఫోన్ల మీద 3,000 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.

ఐఫోన్

పాత ఐఫోన్ మోడల్స్ నో-కాస్ట్ EMI ఎంపికలతో జాబితా చేయబడ్డాయి. అదనంగా శామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 పై 4,000 రూపాయల వరకు ఆఫ్ జాబితా చేయబడింది. హానర్ 20 మీద కూడా 3,000 రూపాయల తగ్గింపుతో ప్రస్తుతం కేవలం 29,999 రూపాయలకు అందుబాటులో ఉంది. మొబైల్స్ బొనాంజాలో జాబితా చేయబడిన ఇతర ఫోన్‌ల సమూహం గురించి ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక పేజీని సందర్శించి అవన్నీ చూడవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Mobiles Bonanza Sale: Best Discount and Offers on Motorola One Vision and Other Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X