బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు!

Posted By:

అమెరికా ఆర్ధిక ప్రగతి నత్తనడకన సాగుతున్న నేపధ్యంలో ఐటీ సెక్టార్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. రిసెషన్ నేపధ్యంలో ప్రాజెక్టులు కొరత ఏర్పడటంతో పలు కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. దింతో పలువురు ఐటీ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.

సాఫ్ట్‌వేర్ జీతాలు!

ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ సెక్టార్‌లో కేరీర్‌ను ప్రారంభిద్దామనుకుంటున్న వారికి ఏ ఉద్యోగం సురక్షితం..?, రిసెషన్ సమయంలోనూ ఉద్యోగం సేఫ్‌సైడ్‌గా ఉండాలంటే ఏ కెరీర్‌‌‌ను ఎంచుకోవాలి..?, ఈ విధమైన అంశాల పట్ల పలువురిలో నెలకున్న సందేహాలను నివృత్తి చేసేందుకు 5 భరోసాతో కూడిన ఐదు రిసెషన్ - ప్రూఫ్ ఐటీ ఉద్యోగాలను మీ ముందుంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాఫ్ట్‌వేర్ డెవలపర్ (Software Developer):


ఐటీ కంపెనీలకు జావా, డాట్ నెట్, మొబైల్ అప్లికేషన్, షేర్ పాయింట్, వెబ్ అప్లికేషన్ తదితర అంశాలకు సంబంధించి డెవలపర్లు ఎంతో అవసరం. వీరినే సాఫ్ట్‌వేర్ డెవలపర్లుగా పిలుస్తారు. నైపుణ్యాలను బట్టి జీతాలు ఉంటాయి. (ఏడాదికి $58,000 - 95,000వరకు).

ఐటీ విశ్లేషకుడు (IT Analyst):


ప్రతి ఐటీ కంపెనీకి డాటా విశ్లేషకుడు ఎంతో అవసరం. ఈ ఉద్యోగానికి అర్హత పొందే వ్యక్తి ఆయా విభాగాల్లో ష్టాతుడై ఉండాలి. ఐటీ విభాగంలో డాటా విశ్లేషకులను ఐటి నిపుణులుగా కూడా పిలుస్తారు. ఐటీ సెక్టార్‌లో డాటా విశ్లేషుకుని ఉద్యోగం సేఫ్ఇంకా బెస్ట్. జీతాలు నైపుణ్యాన్ని బట్టి ఉంటాయి (ఏడాదికి $56,051 నుంచి $84,577మధ్య).

హెల్ప్ డెస్క్/ టెక్నికల్ సపోర్ట్ (Help Desk/Technical Support):

 

ఐటీ సెక్టార్‌లో ‘హెల్ప్ డెస్క్/ టెక్నికల్ సపోర్ట్' విభాగానికి మంచి భవిష్యత్ ఉంది. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి టెక్నికల్ విభాగం క్రియాశీలక పాత్రపోషిస్తుంది. రానున్న సంవత్సరాల్లో ‘హెల్ప్ డెస్క్/ టెక్నికల్ సపోర్ట్' ఉద్యోగాలకు మరింత డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

 

సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అస్యూరెన్స్ (Software Quality Assurance):

ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తున్న ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఉద్యోగాలకు పెద్ద పీట వేసింది. టెక్నాలజీకి సంబంధించి వివిధ సందేహాలను నివృత్తి చేసేక్రమంలో వేలకొద్ది వెబ్‌సైట్‌లతో పాటు అప్లికేషన్‌లు పుట్టుకొస్తున్నాయి. దింతో సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఉద్యోగాలకు మంచి ఆదరణ ఉంది.

సిస్టమ్స్ అడ్మినిస్ట్రెటర్స్ (Systems Administrators):


ఇంట్రానెట్స్ మొదలుకుని పోర్టల్స్ ఇంకా డాటా కంపెనీల వరకు సిస్టమ్స్ అడ్మినిస్ట్రెటర్స్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి వేతనాలు ఉంటాయి.రిసెషన్ ఎర్పడినప్పటికి సిస్టమ్స్ అడ్మినిస్ట్రెటర్స్ ఉద్యోగాలకు ఏ మాత్రం డోకా ఉండదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot