Home
News

Redmi 9 Power మొదటి సేల్ నేడే ప్రారంభం!! మిస్ అవ్వకండి...

ఇండియాలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో సరసమైన ధర విభాగంలో విడుదల అయిన షియోమి యొక్క తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 9 పవర్ యొక్క మొదటి అమ్మకాలు మొదటి సారి ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్‌తో పాటు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటల నుంచి ఈ సేల్స్ మొదలు కానున్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ M11, వివో Y20, ఒప్పో A53 లకు పోటీగా విడుదలైన రెడ్‌మి 9 పవర్ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్లతో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి 9 పవర్ మొదటి ఆన్‌లైన్‌ సేల్స్

రెడ్‌మి 9 పవర్ మొదటి ఆన్‌లైన్‌ సేల్స్

రెడ్‌మి 9 పవర్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్లలో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.10,999 కాగా 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.11,999. ఇది ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు Mi.కామ్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే ఆఫ్‌లైన్ ఎంపికలలో Mi హోమ్స్, Mi స్టూడియోస్ మరియు Mi స్టోర్స్ ద్వారా కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫైరీ రెడ్ మరియు మైటీ బ్లాక్ వంటి నాలుగు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి 9 పవర్ ప్రీమియం డిజైన్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 9 పవర్ ప్రీమియం డిజైన్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 9 పవర్‌ కొత్త స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 మద్దతుతో 6.53-అంగుళాల FHD+ పెద్ద డోర్ డ్రాప్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ అద్భుతమైన ఆకృతితో పాటుగా వెనుక భాగం శక్తివంతమైన కలర్ లతో అందంగా కనిపిస్తుంది. వెనుక ప్యానెల్‌లో గల పెద్ద రెడ్‌మి లోగో డిజైన్ దీని యొక్క సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. కెమెరా సెటప్ కూడా ఫోన్ డిజైన్ లో ప్రీమియంగా కనిపిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ ప్యానెల్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ సెకండరీ కెమెరా, 2MP మాక్రో లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌లతో జతచేయబడి ఉంటాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ లోపల 8MP షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది.

రెడ్‌మి 9 పవర్ ఆండ్రాయిడ్ 10 ఫీచర్స్

రెడ్‌మి 9 పవర్ ఆండ్రాయిడ్ 10 ఫీచర్స్

రెడ్‌మి 9 పవర్‌ కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ విషయంలో ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662తో ఆడ్రినో 610 GPUతో పాటుగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా MIUI 12తో రన్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 కి అప్‌గ్రేడ్ అవుతుంది అని సంస్థ తెలిపింది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది రివర్స్ ఛార్జింగ్ కు మద్దతును ఇస్తుంది. అలాగే ఇది USB టైప్-C పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G వోల్టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ V5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 9 Power First Sale Set Today 12 PM Via Amazon, Mi.com: Price, Specs, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X