Home
News

లీకైన రెడ్‌మి నోట్ 8 డిజైన్ ఫీచర్స్

రెడ్‌మి ఆసియా మార్కెట్లో అత్యంత ప్రసిద్ధ సంస్థ. ఈ సంస్థ షియోమి అనుబంధ సంస్థ. ఇది వినియోగదారులకు చారిత్రాత్మకంగా స్మార్ట్ఫోన్లను సరసమైన ధరల విభాగంలో అందివ్వడానికి ఎక్కువగా దృష్టి పెట్టింది. షియోమి సంస్థ 2015లో ఇండియాలోకి ప్రవేశించి ఇప్పుడు తనకంటూ ప్రతేక గుర్తింపును పొందింది.ఈ సంస్థ నుండి వచ్చిన ప్రతి స్మార్ట్ ఫోన్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది.

Redmi Note 8 Design and Features Leaked: What you Need to Know

ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని శ్రేణులలో నోట్ సిరీస్‌ ఫోన్లు భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు దాని యొక్క తాజా మొబైల్ రెడ్‌మి నోట్ 8 యొక్క డిజైన్లను లీక్ చేసింది. లీక్ అయిన దాని ప్రకారం ఇది క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 8:

రెడ్‌మి నోట్ 8:

కొత్త కెమెరా సెటప్ రెడ్‌మి యొక్క మధ్య శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లలో మొదటిది. కంపెనీ జనరల్ మేనేజర్ వీబోలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. దీనిలో 64MP క్వాడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్ యొక్క భారీ ఉత్పత్తిని నిర్ధారించే వీడియో ఉంది. ఇంతకుముందు రెడ్‌మి పరికరంలోని రెడ్‌మి నోట్ 8 లో 64MP కెమెరా ఉన్నట్లు పుకారు వచ్చింది. ఇప్పుడు కంపెనీ యొక్క జనరల్ మేనేజర్ రిలీజ్ చేసిన వీడియో ఆధారంగా అది నిజం అయింది.

లీకైన ఫీచర్స్:

లీకైన ఫీచర్స్:

లీకైన రెండర్ ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెన్సార్లను కలిగి ఉన్నాయి. ఇవి నిలువు కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన స్మార్ట్‌ఫోన్ యొక్క మాస్ ప్రొడక్షన్ వీడియోతో సమానంగా ఉంటుంది. అందువల్ల రెడ్‌మి నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌ 64MP క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని నిర్ధారిస్తుంది. ముఖ్యంగా 64MP క్వాడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్ యొక్క నిర్ధారణ వచ్చినప్పటికి దాని పేరును మాత్రం వెల్లడించలేదు.

డిజైన్:

డిజైన్:

రెడ్‌మి నోట్ 8 లీకైన చిత్రంలో నిలువుగా పేర్చబడిన ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌కు ఎడమ వైపున నాల్గవ సెన్సార్‌ కెమెరా కూడా ఉంది. ఒంటరి ఉన్న నాల్గవ సెన్సార్ కెమెరా పైన డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ కూడా ఉంది. వెనుకభాగం "షియోమి రూపొందించిన" ట్యాగ్‌తో రెడ్‌మి బ్రాండింగ్ పేరును కలిగి ఉంది. పరికరం యొక్క ఎడమ వైపున వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయని కూడా గమనించవచ్చు. అలాగే కుడివైపు పవర్ బటన్ ఉంటుంది. ఇంకా వెనుక భాగంలో అమర్చిన ఫింగర్ ప్రింట్ స్కానర్ యొక్క సూచనలు లేవు. కాబట్టి ఇది డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ స్కానర్ను కలిగి ఉండవచ్చు అని అంచనా.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

లీకైన చిత్రంలో చూసినట్లుగా రెడ్‌మి నోట్ 8 గ్రేడియంట్ కలర్ స్కీమ్స్ లలో వస్తుంది. అదనంగా నోట్ 8 ప్రో వేరియంట్ గేమింగ్ సెంట్రిక్ చిప్‌సెట్ Helio G90T SoC తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్. దురదృష్టవశాత్తు నోట్ 8 కు సంబంధించిన ఖచ్చితమైన లాంచ్ తేదీ మరియు అన్ని రకాల ఫీచర్స్ ఇప్పటికీ ఒక రహస్యంగా ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ ఇంకా ఎటువంటి ప్రకటనలతో అధికారికంగా ప్రకటించబడలేదు కాబట్టి వినియోగదారులు ఈ నివేదికను కాస్త లైట్ గా తీసుకోవచ్చు. మరిన్ని అప్డేట్ లు త్వరలో వస్తాయని భావిస్తున్నారు కాబట్టి వేచి ఉండండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 8 Design and Features Leaked: What you Need to Know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X