Home
News

Redmi Note 9 Pro Max 8GB ర్యామ్ మొదటి అమ్మకం నేటినుంచే ప్రారంభం....

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమి గత వారంలో విడుదల చేసిన రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ యొక్క 8GB ర్యామ్ వేరియంట్‌ అమ్మకాలు ఎట్టకేలకు ఇండియాలో మొదలుకానున్నాయి. మార్చి నెలలో లాక్‌డౌన్‌కు ముందు ఇండియాలో తొలిసారిగా రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వంటి రెండు వేరియంట్‌లలో విడుదల అయింది. కాని ఇప్పుడు 8GB RAM మోడల్ కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి Mi.com ద్వారా కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ యొక్క 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999. అలాగే 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.16,999 కాగా 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.18,499. షియోమి యొక్క రెండు వేరియంట్లు ఇప్పటికే Mi.com, అమెజాన్ ఇండియా మరియు Mi హోమ్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ అన్ని కూడా రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌తో కొన్ని ముఖ్యమైన మార్పులతో సమానంగా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 9 ప్రో ఆండ్రాయిడ్ 10 మరియు MIUI 11 తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + IPS డిస్‌ప్లే 20: 9 కారక నిష్పత్తితో మరియు 1080x2400 పిక్సెల్స్ పరిమాణంలో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC, అడ్రినో 618 GPU ను కలిగి ఉండి 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది.

 

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ 64MP కెమెరా సెటప్

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ 64MP కెమెరా సెటప్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో రన్ అయ్యే 8GB LPDDR4X ర్యామ్‌తో మరియు 128GB UFS 2.1 స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన SD కార్డ్ స్లాట్‌ మద్దతుతో మెమొరిని మరింత విస్తరించవచ్చు. రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాల‌తో జత చేయబడి వస్తుంది.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ఫీచర్స్

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ ఫీచర్స్

స్టోరేజ్ పరంగా రెడ్‌మి నోట్ 9 ప్రో 128GB వరకు UFS 2.1 స్టోరేజ్ ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, NavIC, USB Type-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ సెన్సార్‌తో వస్తుంది మరియు బాటమ్-ఫైరింగ్ స్పీకర్లతో పాటు శబ్దం రద్దు మద్దతుతో డ్యూయల్ మైక్రోఫోన్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 9 Pro Max 8GB Smartphone First Sale in India Starts Today at 12PM
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X