Redmi X-Series కొత్త స్మార్ట్ టీవీల యొక్క ధరలు & ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి

|

షియోమి యొక్క అనుబంధ సంస్థ రెడ్‌మి ఇండియాలో నేడు కొత్తగా స్మార్ట్ టివి సిరీస్‌ను విడుదల చేసింది. షియోమి సంస్థ గత కొంతకాలంగా దేశంలో స్మార్ట్ టీవీలను అందిస్తున్నప్పటికీ రెడ్‌మి ప్రారంభించిన మొదటి టీవీ సిరీస్ ఇదే కావడం విశేషం. రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ మూడు వేర్వేరు సైజులలో విడుదల చేసింది. వినియోగదారులకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి అన్ని రకాల టీవీలు 4K హెచ్‌డిఆర్ LED ప్యానల్‌ను కలిగి ఉంటాయి. ఈ రెడ్‌మి స్మార్ట్ టివి X-సిరీస్ టీవీలు ఆండ్రాయిడ్ టివి 10 తో రన్ అవుతూ గూగుల్ ప్లే స్టోర్ నుండి అవసరమైన యాప్ లను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

 

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ ధరల వివరాలు

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ ధరల వివరాలు

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ స్మార్ట్ టీవీలు ఇండియాలో మూడు వేర్వేరు వేరియంట్లలో విడుదల చేసాయి. వీటిలో X50 మోడల్ యొక్క ధర రూ.32,999 కాగా, X55 మోడల్ యొక్క ధర రూ.38,999, X65 మోడల్ యొక్క ధర రూ.57,999. ఈ సిరీస్ లోని అన్ని స్మార్ట్ టీవీలు ఒకే విధమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి కానీ వాటి పరిమాణాలలో మాత్రమే భిన్నంగా ఉంటాయి. ఈ సిరీస్ యొక్క అమ్మకాలు మార్చి 25, 2021 నుండి అమెజాన్ ఇండియా మరియు షియోమి యొక్క అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా మొదలుకానున్నాయి.

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ స్పెసిఫికేషన్స్
 

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ టీవీలు HDR10 + ఫార్మాట్‌తో పాటు డాల్బీ విజన్ టెక్నాలజీని కలిగి ఉండి వినియోగదారులకు వీడియో యొక్క నాణ్యతను మరింత మెరుగ్గా ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీలలో గల Vivid పిక్చర్ ఇంజిన్ మరియు రియాలిటీ ఫ్లో వంటివి వీక్షణ అనుభవాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. దీనికి DTS వర్చువల్: X మరియు డాల్బీ అట్మోస్ పాస్-త్రూ ఓవర్ EARC తో పాటు డాల్బీ ఆడియో మద్దతు ఉంది. రెడ్‌మి స్మార్ట్ టివి X-సిరీస్ ఆండ్రాయిడ్ టివి 10 లో రన్ అవుతూ హ్యాండ్స్ ఫ్రీ అనుభవం కోసం గూగుల్ అసిస్టెంట్‌ను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. షియోమి స్మార్ట్ టీవీల్లో మాదిరిగానే యూజర్లు ప్యాచ్‌వాల్ UIని కూడా యాక్సెస్ చేయవచ్చు.

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ ఫీచర్స్

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ ఫీచర్స్

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ టీవీలలో కంటెంట్ మిర్రరింగ్‌ను అనుమతించడానికి ఇవి అంతర్నిర్మిత Chromecast తో వస్తాయి. ఇది 64-బిట్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో రన్ అవుతూ 2GB ర్యామ్ మరియు 16GB ROM‌తో జతచేయబడి వస్తుంది. ఈ రెడ్‌మి స్మార్ట్ టీవీ X-సిరీస్ టీవీలు ఆటో లోటెన్సీ మోడ్ (ALLM) కు మద్దతు ఇస్తాయి. ఇవి రెండు USB పోర్ట్, మూడు HDMI పోర్ట్‌లు, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ మద్దతును కలిగి ఉండడంతో పాటుగా 3.5mm ఆడియో జాక్ ను కలిగి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Redmi X-Series Smart TVs Released in India: Price, Specifications, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X