50 రూపాయలకే 2వేల సినిమాలు వస్తే..

Written By:

అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సినీ ప్రియుల కోసం 'బిగ్‌ఫ్లిక్స్' పేరిట ఓ నూతన సేవను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌తోపాటు ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్‌లలో బిగ్‌ఫ్లిక్స్ లభిస్తోంది. దీంట్లో 9 భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ భాషకు చెందిన పలు సినిమాలను, ట్రైలర్స్‌ను, షార్ట్ ఫిలిమ్స్, వీడియోలను ఏర్పాటు చేశారు. బిగ్‌ఫ్లిక్స్ లో ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి మొత్తం 2వేల సినిమాలు ప్రేక్షకులకు లభిస్తున్నాయి. అవన్నీ హెచ్‌డీ క్వాలిటీతో ఉన్నాయి. అయితే బిగ్‌ఫ్లిక్స్ ను వాడుకోవాలంటే యూజర్లు నెలకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లిస్తే వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ ఎందులోనైనా అన్‌లిమిటెడ్ సినిమాలను చూడవచ్చు.

ఎయిర్‌టెల్ ఆఫర్లతో జియోకి షాక్ తగిలింది !

జియోని కుదిపేస్తున్న ఆర్ కామ్ ప్లాన్ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 149 కే అపరిమిత కాలింగ్ ప్లాన్‌

అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రూ. 149 కే అపరిమిత కాలింగ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.

ఏ టెలికాం నెట్‌వర్క్‌కైనా

దేశవ్యాప్తంగా ఏ టెలికాం నెట్‌వర్క్‌కైనా, ఏ మొబైల్ నుంచైనా అపరిమిత కాలింగ్ టాక్ టైమ్ సద్వినియోగం చేసుకునేలా ఈ ప్లాన్ దోహదం చేయనుంది.

2 జీ, 3 జీ, 4 జీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌లోని అన్ని నెట్‌వర్క్‌‌లకు

నెలకు రూ .149 చెల్లిస్తే 2 జీ, 3 జీ, 4 జీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌లోని అన్ని నెట్‌వర్క్‌‌లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు.

టార్గెట్‌

టార్గెట్‌ 2 జీ, 3 జీ, 4 జీ హ్యాండ్‌సెట్ ఓనర్లను టార్గెట్‌గా చేసుకుని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ద్వారా, వారిని ఆర్‌కామ్ నెట్‌వర్క్‌లోకి మరల్చడానికి ఈ ప్లాన్ దోహదం చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.

300 ఎంబీ డేటా

ఈ ప్లాన్‌పై 300 ఎంబీ డేటా కూడా వినియోగదారులకు లభిస్తుంది. భారత్‌లో లక్షల మంది 2 జీ హ్యాండ్‌సెట్ ఓనర్లు ఉన్నారని, వారందరు ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆర్‌కామ్ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Entertainment launches BIGFLIX services for Rs 50 per month read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot