ఎయిర్‌టెల్ ఆఫర్లతో జియోకి షాక్ తగిలింది !

Written By:

ఎయిర్‌టెల్ ఆఫర్లపై జియో కస్సుబుస్సులాడుతోంది. టారిఫ్ రూల్స్ ను తీవ్రంగా ఉల్లంఘిస్తూ తప్పుదోవ పట్టించే ఆఫర్లను ఎయిర్ టెల్ తీసుకొస్తుందని జియో భారీగా మండిపడుతోంది. తన కస్టమర్ల మధ్య ఏకపక్ష వివక్షతను తీసుకొస్తుందని పేర్కొంటోంది.

గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్‌లపై దిమ్మతిరిగే న్యూస్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారీ జరిమానా విధించాల్సిందే

ఎయిర్ టెల్ కొత్తగా తీసుకొచ్చిన రూ.293, రూ.449 ప్లాన్స్ తప్పుడు ధోరణిలో ఉన్నాయని, వీటికి సంబంధించి టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్, భారతీ ఎయిర్‌టెల్ పై భారీ జరిమానా విధించాల్సిందేనని పట్టుబడుతోంది.

కష్టమర్లను ఆకర్షించడానికి

కష్టమర్లను ఆకర్షించడానికి ఈ ఆఫర్లపై 70 రోజుల వరకు రోజుకు 1జీబీ డేటాను అందిస్తున్నట్టు చెప్పిందని, కానీ కేవలం 50ఎంబీ డేటాను మాత్రమే ఎయిర్ టెల్ అందిస్తుందని జియో పేర్కొంటోంది. సబ్ స్క్రైబర్లు ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్స్ కు తృప్తి చెందడం లేదని చెబుతోంది.

ఛార్జీలు కూడా వేస్తుందని

మిగతా మొత్తానికి ఎయిర్‌టెల్ ఛార్జీలు కూడా వేస్తుందని తెలిపింది. ఈ ప్లాన్స్ కింద ఎయిర్‌టెల్ అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ తో పాటు 1జీబీ మొబైల్ ఇంటర్నెట్ డేటాను 70 రోజుల వరకు 4జీ హ్యాండ్ సెట్ కస్టమర్లకు 4జీ సిమ్ పై ఇవ్వనున్నట్టు పేర్కొంది.

రూ.293 ప్లాన్ కింద

అయితే రూ.293 ప్లాన్ కింద కేవలం అపరిమిత కాలింగ్ ఎయిర్ టెల్ నెట్ వర్క్ కే పరిమితం చేసింది. 4జీ హ్యాండ్ సెట్ లేని ఇతర ఎయిర్ టెల్ కస్టమర్లు ఈ ప్లాన్స్ కింద కేవలం 35 రోజుల వరకు 50 ఎంబీ డేటా వాడకాన్ని పొందుతున్నారు.

ఘోరమైన వివక్ష ఆధారంగా

ఘోరమైన వివక్ష ఆధారంగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ ప్రయోజనాలను అందిస్తుందని జియో ఆరోపిస్తోంది. 4జీ హ్యాండ్ సెట్, 4జీ సిమ్ లేని సబ్ స్క్రైబర్లకు ఎయిర్ టెల్ ఆ ప్లాన్స్ పై అందిస్తున్న డేటా ప్రయోజనాలను ఏకపక్షంగా తగ్గిస్తుందట.

టారిఫ్ ఆర్డర్ 1999కు ఉల్లంఘన

ఇది టారిఫ్ ఆర్డర్ 1999కు ఉల్లంఘన అని జియో పేర్కొంటోంది. జియో చేస్తున్న ఆరోపణలను టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ఖండిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Claims Airtel Issuing Misleading Offers, Complains to TRAI Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot