JioMeet HD వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్!!! 100 మందితో జూమ్‌కు పోటీగా...

|

రిలయన్స్ జియో సంస్థ కొత్త కొత్త లాంచ్ లతో అందరిని ఆశ్చర్య పరుస్తూఉంటుంది. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసులలో ఎక్కువగా ఉపయోగిస్తున్న జూమ్‌ను సవాల్ చేస్తూ తన జియోమీట్ HD వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను విడుదల చేసింది.

వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ యాప్

వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ యాప్

ఇండియాలో మార్చి నెలలో మొదలైన లాక్ డౌన్ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. ఈ కరోనా కారణంగా ఉద్యోగులు కేవలం వారి ఇంటికి మాత్రమే పరిమితమై వారి యొక్క పనిని ఇంటి వద్ద నుండి కొసగిస్తున్నారు. ఇటువంటి వారు తమ కోలిగ్ ల యొక్క విషయాలను తెలుసుకోవడానికి అధికంగా వీడియో కాన్ఫరెన్సింగ్లను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వీడియో యాప్ లను వాడుతున్నారు.

 

Also Read: డౌన్‌లోడ్‌లలో రికార్డు సృష్టిస్తున్న షేర్‌చాట్ యాప్...Also Read: డౌన్‌లోడ్‌లలో రికార్డు సృష్టిస్తున్న షేర్‌చాట్ యాప్...

జియోమీట్ ఫీచర్స్

జియోమీట్ ఫీచర్స్

లాక్ డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలలో అత్యంత ప్రజాదరణ పొందిన జూమ్‌ను సవాలు చేస్తూ రిలయన్స్ జియో తన స్వంత సమర్పణతో జియోమీట్ యాప్ ను ప్రకటించింది. ఈ యాప్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ మరియు అన్ని యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ వినియోగదారులకు బీటా రూపంలో ఒక నెలకు పైగా అందుబాటులో ఉంది.

జూమ్‌కు పోటీగా జియోమీట్

జూమ్‌కు పోటీగా జియోమీట్

ఇండియాలో ప్రస్తుతం చైనా యాప్ ల బహిష్కరణ సమయంలో రిలయన్స్ జియో తన వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసును ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. హెచ్‌డి వీడియో కాన్ఫరెన్సింగ్‌ మద్దతుతో జియోమీట్ లభిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. జూమ్ మాదిరిగా ఇది కూడా ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ లో 100 మందిని పాల్గొనడానికి మద్దతును ఇస్తుంది. దీని కోసం మీటింగ్ ఐడి అవసరం ఉంటుంది. అలాగే ఇతరులు ఆహ్వాన లింక్ ఐడి సాయంతో కాల్‌లో చేరవచ్చు. ప్లే స్టోర్‌లో ఈ యాప్ యొక్క డౌన్‌లోడ్లు ఇప్పటికే 100 వేలకు పైన దాటింది. ఈ సర్వీస్ మొబైల్ మరియు డెస్క్‌టాప్ ప్లాట్‌ఫారమ్‌ల రెండింటికి అనుమతిని ఇస్తుంది.

జియోమీట్ డెస్క్‌టాప్ వెర్షన్

జియోమీట్ డెస్క్‌టాప్ వెర్షన్

డెస్క్‌టాప్ వెర్షన్ నుండి గ్రూప్ మీటింగులలో పాల్గొనే వారికి ఈ సర్వీస్ జూమ్ లాగా పనిచేస్తుంది. వినియోగదారుడు ఎవరైనా JioMeet యొక్క ఆహ్వాన లింక్‌పై క్లిక్ చేసి నేరుగా బ్రౌజర్ నుండి మీటింగులలో చేరవచ్చు. దీని కోసం ఎటువంటి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు. అప్లికేషన్ యొక్క ఇతర ఫీచర్లలో మీటింగులను షెడ్యూల్ చేసే ఎంపిక మరియు స్క్రీన్‌లను మరొకరితో పంచుకోవడం వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సర్వీస్ ఉచితంగా లభిస్తుంది.

JioMeet యాప్ ను డౌన్‌లోడ్ చేయడం మరియు స్టార్ట్ చేయడం ఎలా?

JioMeet యాప్ ను డౌన్‌లోడ్ చేయడం మరియు స్టార్ట్ చేయడం ఎలా?

1: మీ యొక్క ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌ను ఓపెన్ చేసి అందులో జియోమీట్ అప్లికేషన్ కోసం సెర్చ్ చేయండి.

2: రిలయన్స్ కార్పొరేట్ ఐటి పార్క్ లిమిటెడ్ పంపిణీ చేసిన అప్లికేషన్ మీ సెర్చ్ జాబితాలో కనబడుతుంది.

3: తరువాత ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేయండి. అది పూర్తిగా ఇన్‌స్టాల్ అయ్యే వరకు వేచి ఉండండి.

4: యాప్ పూర్తిగా డౌన్‌లోడ్ అయిన తర్వాత సైన్ అప్ ప్రక్రియను ప్రారంభించాలి. ఇందుకోసం మీ మొబైల్ నంబర్, మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయవలసి ఉంటుంది.

5: ధృవీకరణ కోసం Jio మీ నెంబర్ కు OTP పంపుతుంది. ధృవీకరణ పొందిన తరువాత మీరు వీడియో కాన్ఫరెన్సింగ్ సేవను ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

 

Best Mobiles in India

English summary
Reliance Introduced JioMeet App for Video Conferencing Service

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X