Home
News

Disney+ Hotstar VIP ను ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్,జియోలలో ఏది బెస్ట్?

ఇండియాలో గల టెలికాం ఆపరేటర్లు మొదటి స్థానం కోసం తన వినియోగదారులకు రకరకాల ప్రయోజనాలను అందిస్తున్నారు. వీటిలో అందరి కంటే ముందు వరుసలో ఎయిర్టెల్ సంస్థ ఉంటుంది. తన ప్రత్యర్దులలో ముఖ్యంగా రిలయన్స్ జియోను ఎదురుకోవడానికి ముందు నుంచి కూడా తన వినియోగదారులకు అద్భుతమైన ప్రయోజనాలతో వివిధ రకాల దరల వద్ద ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ ప్లాన్లను అందిస్తూనే ఉంది.

డిస్నీ + హాట్స్టార్

డిస్నీ + హాట్స్టార్

భారతి ఎయిర్‌టెల్ కంటే అధికంగా చందాదారులను గల రిలయన్స్ జియో కూడా తన వినియోగదారులకు అద్భుతమైన ప్లాన్లను అందిస్తున్నది. ఇండియాలో డిస్నీ సంస్థ హాట్స్టార్ తో కలిపి డిస్నీ + హాట్స్టార్ యాప్ ను లాంచ్ చేసింది. ఇందులో పిల్లలకు సంబందించిన మరియు సూపర్ హీరోల అన్ని సినిమాలను అందిస్తుంది. డిస్నీ + హాట్స్టార్ యొక్క ప్రయోజనాన్ని ఈ రెండు టెలికామ్ సంస్థలు రెండు కూడా తన వినియోగదారులకు అందిస్తున్నాయి.  Also Read:మీ ఫోన్ స్క్రీన్ లాక్ ఎంతవరకు సురక్షితం?

జియో,ఎయిర్టెల్ - డిస్నీ + హాట్స్టార్

జియో,ఎయిర్టెల్ - డిస్నీ + హాట్స్టార్

ఈ రెండు టెల్కోలు డిస్నీ + హాట్స్టార్ యొక్క ప్రయోజనాన్ని రూ.401 ధర గల డేటా ప్లాన్ వద్ద చందాదారులకు ఉచితంగా అందిస్తున్నారు. జియో ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో డిస్నీ + హాట్‌స్టార్ ప్రయోజనంను అందిస్తున్నది. ఎయిర్టెల్ సంస్థ రిలయన్స్ జియో కంటే కొంచెం ముందుగానే రూ.401 ధర వద్ద ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Reliance Jio: అధిక డేటా కోసం సరైన వోచర్ ప్యాక్‌లు ఇవే...

భారతి ఎయిర్‌టెల్ - డిస్నీ + హాట్‌స్టార్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ - డిస్నీ + హాట్‌స్టార్ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ ను కేవలం రూ.401 ధర గల ఒకే ఒక ప్లాన్ తో మాత్రమే అందిస్తున్నది. ఈ సాధారణ డేటా ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కాలానికి 3GB హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్రయోజనంను అందిస్తుంది. కానీ ఈ ప్లాన్ ఎటువంటి కాలింగ్ ప్రయోజనాలను అందించవు. కాబట్టి కాల్ చేయడానికి మీరు కాలింగ్ ప్రయోజనంతో వచ్చే మరొక బేస్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. కానీ ఈ ప్లాన్ తో వచ్చే డేటా ప్రయోజనాన్ని ఉపయోగించడానికి మీకు ఎటువంటి బేస్ ప్లాన్ అవసరం లేదు.

Airtel,డిస్నీ + హాట్‌స్టార్ చెల్లుబాటు

Airtel,డిస్నీ + హాట్‌స్టార్ చెల్లుబాటు

ఎయిర్‌టెల్ యొక్క రూ.401 ప్లాన్ తో లభించే డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాను మాత్రం ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ డేటా ప్యాక్ యొక్క చెల్లుబాటు 28 రోజుల తర్వాత ముగిసినప్పటికీ హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ యొక్క గడువు గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క ఫోన్ నంబర్‌ను ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్‌గా మార్చినప్పుడు లేదా మీ నంబర్‌ను వేరే టెల్కోకు పోర్ట్ చేసినప్పుడు కూడా ఇది మీకు అందుబాటులో ఉంటుంది.

రిలయన్స్ జియో డిస్నీ + హాట్‌స్టార్ ప్లాన్

రిలయన్స్ జియో డిస్నీ + హాట్‌స్టార్ ప్లాన్

రిలయన్స్ జియో డిస్నీ + హాట్‌స్టార్ ప్రయోజనాన్ని ఆరు వేరు వేరు ప్లాన్‌ల ద్వారా అందిస్తున్నది. ఇందులో రెండు బేస్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు మరియు నాలుగు డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు ఉన్నాయి. జియో ఈ ప్లాన్‌లతో డిస్నీ + హాట్‌స్టార్ VIP చందా ప్రయోజనాన్ని ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి అందిస్తోంది. రిలయన్స్ జియో సంస్థ డిస్నీ + హాట్‌స్టార్ ప్రయోజనాన్ని అందిస్తున్న ప్లాన్ గురించి తెలుసుకోవడానికి కింద ఉన్న లింకును ఓపెన్ చేయండి. Reliance Jio Hotstar Offer ను ఉచితంగా అందిస్తున్న జియో ప్యాక్‌లు ఇవే..

జియో - డిస్నీ + హాట్‌స్టార్ చెల్లుబాటు

జియో - డిస్నీ + హాట్‌స్టార్ చెల్లుబాటు

రిలయన్స్ జియో ప్లాన్‌తో మీకు లభించే డిస్నీ + హాట్‌స్టార్ విఐపి సబ్స్క్రిప్షన్ ప్రయోజనం ఒక సంవత్సరం మొత్తానికి కాకుండా ఆ ప్లాన్ యొక్క చెల్లుబాటు సమయం వరకు మాత్రమే లభిస్తుంది. డిస్నీ + హాట్స్టార్ విఐపి ప్రయోజనాన్ని నిరంతరం పొందడానికి తక్కువ చెల్లుబాటు గల బేస్ ప్లాన్లతో కాకుండా ఒక సంవత్సరం చెల్లుబాటు గల ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవడం ఉత్తమం.

More from GizBot

Best Mobiles in India

English summary
Bharti Airtel vs Reliance Jio: Disney+ Hotstar VIP subscription Comparison in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X