రూ.50కే 1 జిబి : జియోలో అసలు ఈ ప్లాన్ లేనే లేదట

Written By:

జియో..జియో..ఇప్పుడు ఎక్కడ చూసినా అదే పేరు.. కష్టమర్లను ఆకట్టుకునేందుకు జియో ఆఫర్లు మీద ఆపర్లు ప్రకటించి మిగతా టెల్కోలకు దిమ్మతిరిగేలా చేస్తోంది. అయితే ఆ ఆఫర్లు ఉత్తివేనని అలాంటి ఆఫర్ జియో వెబ్ సైట్ లో లేనే లేదని కొంతమంది చెబుతున్నారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఆ చర్చ ఏంటో మీరే చూడండి.

4జీ నుంచి 5జీ వైపుగా జియో అడుగులు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

జియో సిమ్ తీసుకున్న కష్టమర్లు చాలామంది ఇప్పుడు నిరాశకు గురి అవుతున్నారు. రూ .50 కే 1 జీబీ డేటా అని సంస్థ ప్రకటించిన సంచలన ఆఫర్ జియోలో అసలు లేనే లేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

#2

చాలా ప్రకటనల్లో కనిపించే 'షరతులు వర్తిస్తాయి' నిబంధన రిలయన్స్ వినియోగదారులకు కూడా వర్తిస్తుందని కంపెనీ వెబ్ సైట్ లో పేర్కొంది. 

#3

డిసెంబరు 31 వ తేదీ వరకు అన్నీ ఫ్రీ ఫ్రీ అని ప్రకటించిన రిలయన్స్ జనవరి 1 వ తేదీ నుంచి మాత్రం రూ .50 కే 1 జీబీ ఇస్తామంటూ సంచలనానికి తెరలేపింది. నిజానికి రిలయన్స్ వెబ్సైట్లో ఆ ప్లాన్ అన్నదే లేకపోవడం చిత్రం.

#4

సంస్థ వెబ్‌సైట్ ప్రకారం .. రూ .19 తో టారిఫ్లు మొదలవుతుండగా దాని కాలపరిమితి ఒక్క రోజే. రాత్రిపూట అన్లిమిటెడ్ 4 జీ డేటా ఉచితమని సంస్థ ప్రకటించింది. అయితే రాత్రి అంటే ఇక్కడ 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అని అర్థం.

#5

జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ ఉచితమే కానీ 2017 జనవరి నుంచి మాత్రం కాదు. ఆ తరువాత కంపెనీ కొంత ఛార్జ్ చేస్తుంది.

#6

ఒకవేళ రూ .499 పెట్టి 4 జీ డేటా తీసుకుంటే అది అయిపోయాక సంస్థ ప్రకటించినట్టు రూ .50 కే 1 జీబీ రాదు. 10 కేబీ చార్జింగ్ పల్స్ చొప్పున 1 జీబీకి రూ .250 చెల్లించుకోవాల్సి ఉంటుంది.

#7

ఇంచుమించు ఇంతే ధరతో ఇతర నెట్వర్క్ కంపెనీలు కూడా 1 జీబీ డేటాను అందిస్తున్నాయి.

#8

అదే పోస్టుపెయిడ్లో అయితే డేటా ఉచితంగా వస్తుంది కానీ స్పీడ్ 128 కేబీపీఎస్కు పడిపోయి నత్తనడకను తలపిస్తుందని నెటిన్లు గగ్గోలు పెడుతున్నారు.

#9

ఇక ఫ్రీకాల్స్ లో కూడా మతలబు ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఫోన్లోని డయలర్ ద్వారా చేసే కాల్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుంది. వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, స్కైప్ ద్వారా చేసే కాల్స్‌కు మాత్రం డేటా చార్జీలు వర్తిస్తాయి.

#10

అప్పుడు చేసే ప్రతి కాల్ కి డేటా కరిగిపోయి మీ చేతిలో డబ్బులు అయిపోతాయి. అయితే కాల్స్ చేసే సమయంలో మొబైల్ డేటా ఆన్ చేయాల్సిన పనిలేకపోవడం చిన్న ఊరటనిచ్చే అంశం.

#11

అయితే రిలయన్స్ కు వచ్చే లాభం ఏంటంటే వీవోఎల్టీఈ టెక్నాలజీ మనదేశంలో కొంతకాలం కిందటే అందుబాటులోకి వచ్చినందున ఆ పరిజ్ఞానం ఉన్న ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి. 

#12

అందుకే రిలయన్స్ సంస్థ లైఫ్ (ఎల్వైఎఫ్) బ్రాండ్ ఫోన్లను చాలా మంది వీటిని ఎగబడి కొంటున్నారు. ఇది కంపెనీ పరోక్ష ఆదాయం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Reliance Jio 4G at Rs 50 per GB? Airtel, Vodafone challenge claim
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot