జియో దెబ్బ..చైనా కంపెనీలు కూడా..

Written By:

ఉచితంగా అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా, రోమింగ్ అంటూ టెలికాం రంగంలోకి దూసుకువ‌చ్చి మిగ‌తా కంపెనీల్లో అల‌జ‌డి రేపిన రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ టెలికాం మార్కెట్‌పై తీవ్రంగానే ప‌డింద‌న్న విష‌యం తెలిసిందే. జియో ఇస్తోన్న పోటీని త‌ట్టుకొని నిల‌బ‌డ‌డానికి ఇప్ప‌టికే ఎయిర్‌ టెల్‌, వోడాఫోన్‌, ఐడియా లాంటి మొబైల్‌ ఆపరేటర్లు ఎన్నో ఆఫ‌ర్ల‌ను గుప్పించాయి. ఇప్పుడు అదే బాటలో చైనా కంపెనీలు కూడా నడుస్తున్నాయి.

ఎయిర్‌టెల్ సర్ ప్రైజింగ్ ఆఫర్, ఫ్రీ డేటా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాకు చెందిన మూడు మొబైల్ ఆపరేటర్లు

తాజాగా చైనాకు చెందిన మూడు మొబైల్ ఆపరేటర్లు దేశీయ రోమింగ్ చార్జీలు రద్దుచేయడానికి నిర్ణయించుకున్నారు. మొబైల్ ఆపరేటర్ల సంఘమైన గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్ (జీఎస్‌ఎంఏ) ఈ విషయాన్ని ప్రకటించింది.

అద్భుతమైన మద్దతు

దేశీయ రోమింగ్ చార్జీలపై తామిచ్చిన పిలుపునకు ఈ మేరకు చైనా ప్రముఖ ఆపరేటర్ల నుండి అద్భుతమైన మద్దతు లభించిందని ప్రపంచంలో అతిపెద్ద టెలికాం మార్కెట్ అధ్యక్షుడు సునీల్ మిట్టల్ చెప్పారు.

ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి

చైనా టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్, చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ కార్ప్ , చైనా యునైటెడ్ నెట్వర్క్ కమ్యునికేషన్స్ గ్రూప్ ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఇంటర్‌ ప్రావిన్స్‌ రోమింగ్‌ చార్జీలను రద్దుచేయనున్నట్టు ప్రకటించాయి.

వివిధ ఆపరేటర్లు కూడా చైనాను ఉదాహరణగా

బిల్లుల భారాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుడికి సౌలభ్యంతో పాటు ప్రోత్సాహాన్ని అందివ్వనున్నట్టు తెలిపారు. ఇతరదేశాల్లోని వివిధ ఆపరేటర్లు కూడా చైనాను ఉదాహరణగా తీసుకోవాలని మిట్టల్ సూచించారు.

ముందు ముందు డేటా వినియోగం

ముందు ముందు డేటా వినియోగం విపరీతంగా పెరగనున్న నేపథ్యంలో కాల్స్ భారీగా తగ్గిపోనునున్నాయి. వీడియో కాల్స్ పెరగనున్నాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
China's Telcos to End Roaming Fees, Offer Corporate Pricing Incentives in Network Push read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot