జియో వేగానికి అడ్డూ అదుపూ లేదు

Written By:

జియో వేగానికి ఎదురులేదు.మొబైల్‌లో అత్యధిక వేగం డేటా బదిలీ (4జీ) సేవల్లో రిలయన్స్‌ జియోదే అగ్రస్థానమని, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ప్రచురించిన తాజా నివేదికలో వెల్లడైంది. జియో డేటా డౌన్‌లోడ్‌ వేగం, పోటీ సంస్థలైన ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌ కంటే రెట్టింపు ఉందని తేలింది. నంబర్ వన్ స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌ మూడవ స్థానానికి పడిపోయింది.

జియో ధరలతో పెద్ద ప్రమాదమే పొంచి ఉంది !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో డౌన్‌లోడ్‌ వేగం 16.48 ఎంబీపీఎస్‌

మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సగటు వేగానికి సంబంధించి ట్రాయ్‌ ప్రతినెలా నివేదిక రూపొందిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలయన్స్‌ జియో డౌన్‌లోడ్‌ వేగం 16.48 ఎంబీపీఎస్‌గా నమోదైంది.

జనవరిలో ఇది 17.42 ఎంబీపీఎస్‌

జనవరిలో ఇది 17.42 ఎంబీపీఎస్‌. ఇంతవేగం వల్ల 5 నిమిషాల్లోపే సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకోవడం వీలవుతుంది.

ఎయిర్‌టెల్‌ది 7.66 ఎంబీపీఎస్‌

ఫిబ్రవరిలో ఐడియా సెల్యులార్‌ డేటా డౌన్‌లోడ్‌ వేగం 8.33 ఎంబీపీఎస్‌ కాగా, ఎయిర్‌టెల్‌ది 7.66 ఎంబీపీఎస్‌ మాత్రమే.

డేటా డౌన్‌లోడ్‌ వేగం

జనవరితో పోలిస్తే, ఫిబ్రవరిలో ఈ మూడు సంస్థల డేటా డౌన్‌లోడ్‌ వేగం కాస్త తగ్గింది.

ఫిబ్రవరిలో డేటా డౌన్‌లోడ్‌ వేగం

ఫిబ్రవరిలో డేటా డౌన్‌లోడ్‌ వేగం రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌)ది 2.67 ఎంబీపీఎస్‌ కాగా, టాటా డొకొమొ 2.52, ఎయిర్‌సెల్‌ 2.01 ఎంబీపీఎస్‌గా నమోదైంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Reliance Jio 4G Download Speed Fastest in India Once Again, Idea Second: TRAI Data read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot