జియో ధరలతో పెద్ద ప్రమాదమే పొంచి ఉంది !

Written By:

జియో ధాటికి ఇండస్ట్రీలోని టెలికం కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. మొద‌ట వెల్‌కం ఆఫ‌ర్‌, ఆ త‌రువాత హ్యాపీ న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్‌, తాజాగా ప్రైమ్ ఆఫర్ మరో 15 రోజులు పొడిగింపు, రూ.303తో మరో మూడు నెలలు ఉచిత ఆఫర్లు ప్ర‌క‌టించి జియో సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. జియో ప్ర‌క‌టించిన తాజా ఆఫ‌ర్‌పై సెల్యులార్ ఆపరేటర్ బాడీ కోయ్ ఆందోళన వ్యక్తం చేసింది. జియో అందిస్తున్న ఛార్జీలు ఇండస్ట్రీని అంతలాకుతలం చేస్తాయని పేర్కొంది.

లీకైన జియో సెట్ టాప్ బాక్స్ ఫోటోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో ధరలతో

జియో ధరలతో టెలికాం ఇండస్ట్రీలో అసోసియేట్ అయ్యే బ్యాంకులపై, ఇతరులపై ప్రమాద ప్రభావం ఎక్కువగా పొంచి ఉన్నదని కోయ్ పేర్కొంది.

టారిఫ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో

అయితే తక్కువ ధరలతో సర్వీసులు అందించడం కస్టమర్లకు మంచిదే, కానీ అవి టారిఫ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదోననేదే అతిపెద్ద ప్రశ్నగా మారిందని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని కోర్టులు, టెలికాం ట్రిబ్యునలే తేల్చాల్సి ఉందన్నారు.

రూ.4.60 లక్షల కోట్లు

టెలికాం రంగం రూ.4.60 లక్షల కోట్లు వివిధ ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్లకు, బ్యాంకులకు రుణపడి ఉందని, ఇప్పుడు జియో ప్రస్తుతం అందిస్తున్న ఈ ధరలు ఈ ప‌రిశ్ర‌మ‌ను దెబ్బతీయనున్నాయని తెలిపింది.

ప్రమాదమే

ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ పేమెంట్లు, బ్యాంకుల రుణాల విషయంలో ప్రమాదం పొంచి ఉన్నాయని కోయ్ డైరెక్టర్ రాజన్ మ్యాథ్యూ చెప్పారు. కానీ ప్రత్యేకంగా రిలయన్స్ జియో టారిఫ్స్ పై స్పందించడానికి ఆయన తిరస్కరించారు.

మూడు నెలల పాటు ఉచితం

జియో మరింత కొంతమంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ముందస్తుగా ప్రకటించిన ప్రైమ్ ఆఫర్ ను మరో 15 పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ 15 రోజుల లోపల ప్రైమ్ ఆఫర్ తో పాటు రూ.303తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలల పాటు ఉచితంగా సేవలందించనున్నట్టు జియో ప్రకటించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio’s new pricing will continue to bleed telecom industry: COAI read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot