డిసెంబర్ 28 నుంచి రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం

Written By:

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అంతిమంగా తన 4జీ సేవలను భారత్ లో ప్రారంభించేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. డిసెంబర్ 28న ఈ లాంచ్ కార్యక్రమం ఉంటుంది. అయితే, అంతకు ముందు రోజే ఈ సేవలు రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులకు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 27న రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఇంకా చైర్మన్ ధీరూభాయ్ అంబానీ 83వ జయంతి సందర్భంగా తొలత ఈ సేవలను రిలయన్స్ గ్రూప్ సిబ్బందికి అందించనున్నట్లు ఉద్యోగులకు రాసిన ఆహ్వాన్ లేఖలో ముఖేశ్, ఆయన భార్య నితా అంబానీ వెల్లడించారు.

లెనోవో కే4 నోట్ మరో సంచలనం కాబోతోందా..?

డిసెంబర్ 28 నుంచి రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం

రిలయన్స్ గ్రూప్ సబ్సిడరీ బ్రాండ్ అయిన రిలియన్స్ జియో ఇన్ఫోకామ్ దేశవ్యాప్తంగా 4జీ ఎల్టీఈ సేవలను అందించేందుకు పాన్ - ఇండియా లైసెన్స్ ను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ను నెలకొల్పేందుకు రిలయన్స్ జియో గత కొద్ది సంవత్సరాలుగా శ్రమిస్తోంది. పనులు పూర్తవటంతో లాంచ్ తేదీని ప్రకటించింది. రిలయన్స్ జియో సేవలు డిసెంబర్ 28న లాంచ్ అవుతున్నప్పటికి కమర్షియల్ మార్కెట్లోకి రావటానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది. రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాల

రిలయన్స్ జియో తన 4జీ నెట్‌వర్క్ కోసం ఓ ప్రత్యేకమైన ఇకోసిస్టంను అభివృద్థి చేస్తోంది.

జియో 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు

రిలయన్స్ జియో తన 4జీ నెట్‌వర్క్‌తో పాటు స్మార్ట్‌ఫోన్‌లను కూడా అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్‌లు ధర రేంజ్ రూ.4,000 నుంచి రూ.25,000 మధ్య ఉంటుంది. LYT బ్రాండ్ క్రింద ఈ ఫోన్ లు లభ్యమవుతాయి.

జియో 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు

రిలయన్స్ జియో అందించే 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్‌లు రిలయన్స్ రిటైల్ సహా అన్ని మల్టీ బ్రాండ్ స్టోర్‌లలో లభ్యమవుతాయి.

జియో 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు

రిలయన్స్ జియో 4జీ ఎల్టీఈ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా 5 లక్షల ఉచిత సిమ్ కార్డ్‌లను తమ ఉద్యోగులకు అందించేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తుంది.

జియో 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు

రిలయన్స్ జియో 4జీ సేవలు కమర్షియల్ మార్కెట్లోకి వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయి.

జియో 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు

మొదటి ఫేజ్‌లో భాగంగా జియో 4జీ సేవలను ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, బరోడా, ఇండోర్, జైపూర్ ఇంకా జామ్‌నగర్‌లలో ప్రవేశపెట్టనున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G LTE service Coming Soon: 7 Things To Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot