జియో డేటా స్పీడ్ ఇంత దారుణమా, ట్రాయ్ సర్వేలో అన్నింటికంటే లాస్ట్ !

Written By:

4Gదే దేశంలో ఓ కొత్త విప్లవాన్ని సృష్టిస్తాం. అమితవేగంతో ఉచితంగా డేటా సేవలు అందిస్తామంటూ టెల్కోలకు దిమ్మతిరిగే షాక్ నిచ్చే ప్రకటనలతో దూసుకొచ్చిన రిలయన్స్ జియో వేగంలో చతికిపడింది. ఇది సాక్షాత్తూ ట్రాయ్ పరిశోధనలో నిరూపితమైంది. ట్రాయ్ నిర్వహించిన డేటా పరీక్షల్లో జియో 4జీ వేగం అన్నింటికంటే చాలా తక్కువగా ఉందని తేలింది. ట్రాయ్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జియో యూజర్లకి షాక్: డిసెంబర్ 3 వరకే ఉచితం, ఆ తర్వాత పైసలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీ డేటా సేవల వేగం

ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, ఆర్‌కామ్, రిలయన్స్ జియోకు చెందిన 4జీ డేటా సేవల వేగాన్ని ట్రాయ్ పరీక్షించి చూసింది. వీటిలో జియో డేటా సేవల వేగం మిగిలిన సంస్థల సేవల కంటే మెల్లగా ఉంది.

ఎయిర్‌టెల్ 4జీ వేగం సెకనుకు 11.4 మెగాబైట్స్

4జీ సేవల వేగంలో అన్నింటికంటే ముందు ఎయిర్‌టెల్ నిలిచింది. ఎయిర్‌టెల్ 4జీ వేగం సెకనుకు 11.4 మెగాబైట్స్ (ఎంబీపీఎస్) ఉంది.

ఆర్‌కామ్ 4జీ సేవల వేగం 7.9 ఎంబీపీఎస్‌

రెండో స్థానంలో అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్ నిలిచింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ 4జీ సేవల వేగం 7.9 ఎంబీపీఎస్‌గా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐడియా 4జీ వేగం 7.6 ఎంబీపీఎస్

ఇక మూడో స్థానంలో నిలిచింది. ఐడియా 4జీ వేగం 7.6 ఎంబీపీఎస్ గా ఉంది.

వొడాఫోన్ 4జీ సేవల వేగం 7.3 ఎంబీపీఎస్‌

నాలుగవ స్థానంలో వొడాఫోన్ నిలిచింది. వొడాఫోన్ 4జీ సేవల వేగం 7.3 ఎంబీపీఎస్‌గా ఉన్నట్టు ట్రాయ్ గుర్తించింది.

జియో 4జీ డేటా సేవల వేగం సెకనుకు 6.2 ఎంబీపీఎస్‌

ఇక సంచనలం రేపిన జియో అన్నింటికంటే చివరిస్థానంలో నిలిచింది. జియో 4జీ డేటా సేవల వేగం సెకనుకు 6.2 ఎంబీపీఎస్‌గా ఉందని వెల్లడైంది.

ట్రాయ్ గణాంకాలతో జియో

అయితే ట్రాయ్ గణాంకాలతో జియో విభేదించింది. ట్రాయ్ అనలిటిక్స్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న గణాంకాల తర్వాత తాము సైతం అంతర్గతంగా పరీక్షించి చూశామని... జియో వేగాన్ని ఇతర ఆపరేటర్లతో ఏకపక్షంగా పోల్చి చూసినట్టు తాము భావిస్తున్నామని జియో ఓ ప్రకటనలో తెలిపింది.

వినియోగదారులు వాడిన తరువాత వేగాన్ని

యూజర్ డౌన్‌లోడ్ చేసుకునే 4జీబీ డేటా ఫేర్ యూసేజ్ పాలసీ(ఎఫ్‌యూపీ) లిమిట్ మొత్తాన్ని వినియోగదారులు వాడిన తరువాత వేగాన్ని ట్రాయ్ లెక్కగట్టిందని పేర్కొంటోంది.

వేగం 256 కేబీపీఎస్ వరకు పడిపోతుందని

ఒక్కసారి వినియోగదారులు ఎఫ్‌యూపీ లిమిట్ మొత్తాన్ని వాడుకున్నాక, వేగం 256 కేబీపీఎస్ వరకు పడిపోతుందని జియో ఓ ప్రకటనలో తెలిపింది.

4జీ స్పీడ్‌ను

జియో కస్టమర్లు 4జీ స్పీడ్‌ను బాగా సద్వినియోగ పరుచుకుంటున్నారని, వేగం తగ్గిపోయిందనడంలో ఎలాంటి నిజం లేదని కంపెనీ పేర్కొంటోంది.

తొలి రోజుల్లో ఇంటర్నెట్ స్పీడ్ 40 ఎంబీపీఎస్

ఇదిలా ఉంటే మరోవైపు జియో వచ్చిన తొలి రోజుల్లో ఇంటర్నెట్ స్పీడ్ 40 ఎంబీపీఎస్ వరకూ ఉండేదని, క్రమంగా ఆ వేగం తగ్గిపోతుందని వినియోగదారులూ వాపోతున్నారు. ఇప్పటికే దీనిమీద చాలామంది కంప్లయిట్లు చేస్తున్నారు.

చార్జింగ్ కూడా త్వరగా

జియో స‌ర్వీసుల‌న్నీ 4జీలో ఉండ‌డంతో చార్జింగ్ కూడా త్వరగా అయిపోతోందని, దీంతో మాటిమాటికి బ్యాట‌రీని రీచార్జ్ చేసుకోవాల్సి వ‌స్తోందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

3జీ ఫోన్లను సైతం పక్కనపడేసి 4జీ ఫోన్లకు

రిలయన్స్ జియో 4జీని ఆస్వాదించాలని ఇప్పటికే చాలామంది తమకున్న 3జీ ఫోన్లను సైతం పక్కనపడేసి 4జీ ఫోన్లకు మారిపోయారు. వారు కూడా ఈ విషయంపై తమ నిరాసక్తతను వ్యక్తం చేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిసెంబర్ 31 వరకు

డిసెంబర్ 31 వరకు ఉచిత డేటా, ఉచిత వాయిస్ వంటి సంచలన ప్రకటనలు చేస్తూ జియో సెప్టెంబర్‌లో టెలికాం పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

రూ.50కు 1జీబీ డేటా

వాయిస్ కాల్స్‌పై అసలు వినియోగదారులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయమని, రూ.50కు 1జీబీ డేటాను ఆఫర్ చేస్తామని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

చాలా ప్రాంతాల్లో అసలు కనెక్టివిటీనే లేదని

స్పీడు సంగతి పక్కనబెడితే చాలా ప్రాంతాల్లో అసలు కనెక్టివిటీనే లేదని తెలుస్తోంది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఇప్పుడు ట్రాయ్ జరిపిన ఈ పరీక్షల్లో జియో చివరి స్థానంలో నిలవడంతో ఆశ్చర్యంతో పాటు షాకింగ్ కు చాలామంది గురవుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G Speed Slowest in India, Shows Trai Data; Jio Blames Daily Data Limit of Welcome Offer read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting