Home
News

Jio, Airtel, BSNL టెల్కోల యొక్క ఉపయోగకరమైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

ఇండియాలో లాక్ డౌన్ మొదలైన తరువాత ఇటీవలి కాలంలో మొబైల్ యొక్క ఇంటర్నెట్ వాడకం చాలా వరకు పెరిగింది. ఎక్కువ మంది ప్రజలు తమ తమ ఇళ్లలో ఉండి పనిచేస్తున్నందున వారు ముందు కంటే అధిక మొత్తంలో డేటాను వినియోగిస్తున్నారు. ఇటువంటి వారి కోసం టెలికామ్ సంస్థలు ఎటువంటి అతుకులు లేని ఇంటర్నెట్ కనెక్షన్ ను వినియోగదారులకు అందిస్తున్నారు.

టెల్కోల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

టెల్కోల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఇంటి వద్ద నుండి పనిచేసే వారిలో కొంతమంది బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను వాడుతున్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం తమ యొక్క మొబైల్ ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. అన్ని టెలికామ్ సంస్థలు తమ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకొని సరసమైన ధరల వద్ద కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు బిఎస్‌ఎన్‌ఎల్ వంటి టెల్కోలు ఇప్పుడు కొన్ని కొత్త ప్లాన్‌లను విడుదల చేసాయి. ఈ టెల్కోస్ అందిస్తున్న కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో సంస్థ అధికంగా మొబైల్ డేటాను ఉపయోగించే వారిని దృష్టిలో పెట్టుకొని రోజుకు 2GB డేటాను అందించే రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను రూ.2,399 మరియు రూ.2,599 ధరల వద్ద విడుదల చేసింది. ఈ రెండు ప్లాన్లు కూడా ఒక సంవత్సరం అంటే 365 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తాయి. ఈ రెండు ప్లాన్‌ల మధ్య గల అతి పెద్ద తేడా ఏమిటంటే రూ.2,599 ప్లాన్‌ వినియోగదారులకు డిస్నీ + హాట్‌స్టార్ VIP చందా ప్రయోజనంను అదనంగా అందిస్తుంది. జియో యొక్క ఈ రెండు కొత్త లాంగ్ టర్మ్ ప్లాన్‌లు నాన్ జియో కాలింగ్ కోసం 12,000 FUP నిమిషాలను మరియు జియో నుండి జియోకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ల ప్రయోజనాలను అందిస్తుంది. దానితో పాటు జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను కూడా అదనంగా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారులను మరింతగా ఆకట్టుకోవడానికి మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఇందులో మొదటిది రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 1GB డేటా మరియు 100 SMS ల ప్రయోజనాలతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కానీ ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం కేవలం 18 రోజులు మాత్రమే. ఈ ప్లాన్ ZEE5, Wynk Music మరియు Airtel Xstream చందా వంటి ప్రయోజనాలకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్

భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన రెండవ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ధర రూ.129. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్‌ వంటి ప్రయోజనాలను మరియు రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగానే అన్ని రకాల అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌ల మధ్య గల రెండు తేడాలు ఏమిటంటే ఇది 24 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. అలాగే ఈ చెల్లుబాటు కాలంలో 300SMS‌ల ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన చివరి ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ధర 199 రూపాయలు. ఈ ప్లాన్ 1GB రోజువారీ డేటా, రోజుకు 100 SMSలు మరియు అపరిమిత కాల్స్ ప్రయోజనాలను 24 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ZEE5, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వింక్ మ్యూజిక్‌ వంటి ఉచిత చందాలను కూడా అందిస్తుంది.

BSNL రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్

ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఇటీవల రూ.365 ధర వద్ద కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ యొక్క గొప్ప విషయం ఏమిటంటే ఇది 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ప్రతిరోజూ 250 నిమిషాల పరిమితితో అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారులకు 2GB రోజువారీ డేటా మరియు రోజుకు 100 SMS ల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కానీ ప్లాన్ యొక్క ప్రయోజనాలు రీఛార్జ్ చేసిన రోజు నుండి 60 రోజుల వరకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .2,399 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .2,399 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ కేవలం కాలింగ్ ప్రయోజనాలను కోరుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ధర రూ .2,399. ఈ ప్లాన్ యొక్క ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది ఎటువంటి డేటా ప్రయోజనాలను అందించదు . ఇది కేవలం కాలింగ్ ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంది. దీని యొక్క కాలింగ్ ప్రయోజనాలు రీఛార్జ్ చేసిన రోజు నుండి 600 రోజుల వరకు చెల్లుతాయి.

Best Mobiles in India

English summary
Reliance Jio, Airtel, BSNL July 2020 Prepaid Plans Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X