ఎయిర్‌టెల్, జియో,వొడాఫోన్ ఐడియా నుంచి షాకింగ్ న్యూస్....

|

ఇండియాలోని టెలికామ్ రంగంలోకి 2016 సంవత్సరంలో రిలయన్స్ జియో ప్రవేశించింది. జియో ప్రవేశంతో భారతీయ టెలికాం పరిశ్రమలో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్ కూడా అధిక సంఖ్యలో కస్టమర్లను కోల్పోయింది.

టెలికామ్ మార్కెట్
 

టెలికామ్ మార్కెట్

Also Read:Disney+ Hotstar VIP ను ఉచితంగా అందిస్తున్న ఎయిర్‌టెల్,జియోలలో ఏది బెస్ట్?

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో టెలికామ్ రంగంలో అడుగుపెట్టినప్పుడు మొదట వాయిస్ కాలింగ్ మరియు అపరిమిత డేటా సేవలను ఉచితంగా ప్రవేశపెట్టి భారతీయ టెలికాం పరిశ్రమలో ఒక నూతన ఆధ్యాయాన్ని సృష్టించింది. ప్రస్తుతం జియోలో సుమారు 388 మిలియన్లకు పైగా సభ్యులు ఉన్నారు. భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా వంటివి జియోను ఎదురుకోవడానికి వారి యొక్క ప్లాన్ల ఖర్చులను తగ్గించాల్సి వచ్చింది. OnePlus 8 Sale: గొప్ప తగ్గింపు ఆఫర్లతో మంచి అవకాశం!!!! త్వరపడండి...

టెలికాం పరిశ్రమలో టెల్కోలు

టెలికాం పరిశ్రమలో టెల్కోలు

జియో సంస్థ ప్రవేశపెట్టిన ఉచిత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మిగిలిన టెల్కోలు తమ ప్రస్తుత కస్టమర్లను కోల్పోకుండా చూసుకోవటానికి అపరిమిత కాలింగ్ మరియు డేటా సేవలను చాలా చౌక ధరల వద్ద అందిస్తున్నాయి. ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చినప్పటికీ భారతదేశం యొక్క టెలికాం పరిశ్రమలో మాత్రం చాలా మలుపులు తీసుకువచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. మీ ఫోన్ స్క్రీన్ లాక్ ఎంతవరకు సురక్షితం?

భారతీయ టెలికాం పరిశ్రమలో నష్టాలు
 

భారతీయ టెలికాం పరిశ్రమలో నష్టాలు

టెలికామ్ మార్కెట్లో టెల్కోస్ అంచనాలను సర్దుబాటు చేసిన తరువాత వారికి AGR బకాయిలను కట్టవలసిందిగా కోర్టు నుండి నోటీసులను అందుకున్నారు. ఇది అన్ని టెల్కోలకు ఎక్కువ బాధను కలిగించాయి. కోర్టు ఉత్తర్వుల కారణంగా జియో అధిక సమస్యలను ఎదుర్కొనలేదు. జియో క్రొత్తది కావున AGR బకాయిలు ఇతర టెల్కోల మాదిరిగా అధిక మొత్తంలో లేవు. ఎయిర్‌టెల్ యొక్క మొత్తం బకాయిలు 3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే వోడాఫోన్ ఐడియా యొక్క బకాయిలు అధిక మొత్తంలోనే ఉన్నాయి.

టెలికాం రంగంలో సుంకం పెంపు

టెలికాం రంగంలో సుంకం పెంపు

భారతీయ టెలికాం పరిశ్రమలోని అన్ని టెల్కోలు ప్రవేశపెట్టిన సుంకం పెంపు కారణంగా వినియోగదారుల యొక్క మొబైల్ డేటా మరియు అపరిమిత కాల్స్ యొక్క ప్లాన్ల ధరలను పెంచారు. దీని కారణంగా టెల్కోస్ యొక్క ఆదాయాలు 2025 నాటికి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో సగటు భారతీయ వినియోగదారుడి యొక్క సగటు ఆదాయం 38 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. భారతి ఎయిర్‌టెల్ సుంకం పెంపు నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతున్నదని భావిస్తున్నారు.

భారత టెలికాం పరిశ్రమలో పెట్టుబడులు

భారత టెలికాం పరిశ్రమలో పెట్టుబడులు

భారత టెలికాం పరిశ్రమకు సుంకం పెంపు దశ వచ్చిన తరువాత GDP నిలకడగా ఉంటున్నది. అంతే కాదు అందరు ఉహించదగిన భవిష్యత్తు కోసం ఇది ప్రతి సంవత్సరం 3% నుండి 5% వరకు పెరుగుతుంది. భారత టెలికాం పరిశ్రమలో యుఎస్ టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెడుతున్నాయి. రిలయన్స్ జియో ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, కెకెఆర్ వంటి మరెన్నో సంస్థల నుండి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. అదే విధంగా భారతి ఎయిర్టెల్ అమెజాన్ నుండి 5% వాటా కోసం 2 బిలియన్లకు పైగా పెట్టుబడులను పొందినట్లు సమాచారం.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel, Jio and Vodafone Idea Data Tariff Rates Hike

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X